ఛాయా శకలాలు - (Pieces of Shadow- by Jaime Sabines)
నాకు స్పష్టంగా తెలియదు కానీ ఊహిస్తున్నాను
ఒక అమ్మాయి ఒక అబ్బాయి
ప్రేమలో పడతారు ఓరోజు
మెల్ల మెల్లగా ఏకాంతంలోకి జారుకుంటారు
తాము ఈ భూమిపై ఏకాకులమని
వాళ్ల హృదయం చెపుతుంది
ఒకరిలోకి మరొకరు ప్రవేశిస్తారు ఒంటరిగా
పరస్పరం పూరించుకొంటారు.
ఒక అమ్మాయి ఒక అబ్బాయి
ప్రేమలో పడతారు ఓరోజు
మెల్ల మెల్లగా ఏకాంతంలోకి జారుకుంటారు
తాము ఈ భూమిపై ఏకాకులమని
వాళ్ల హృదయం చెపుతుంది
ఒకరిలోకి మరొకరు ప్రవేశిస్తారు ఒంటరిగా
పరస్పరం పూరించుకొంటారు.
కళ్ళలో వెలుగు నిండినట్లు
ఇదంతా నిశ్శబ్దంగా జరుగుతుంది
ప్రేమ దేహాలను బంధిస్తుంది
మౌనంగా ఒకరినొకరు నింపుకుంటూనే ఉంటారు
ఇదంతా నిశ్శబ్దంగా జరుగుతుంది
ప్రేమ దేహాలను బంధిస్తుంది
మౌనంగా ఒకరినొకరు నింపుకుంటూనే ఉంటారు
ఏదో ఓరోజు వారు కౌగిలింతలో మేల్కొని
అన్నీ తెలుసుకొన్నామని అనుకొంటారు
ఒకరినొకరు నగ్నంగా చూసుకొని
పరిపూర్ణత పొందినట్లు భావిస్తారు.
అన్నీ తెలుసుకొన్నామని అనుకొంటారు
ఒకరినొకరు నగ్నంగా చూసుకొని
పరిపూర్ణత పొందినట్లు భావిస్తారు.
(నాకూ ఖచ్చితంగా తెలియదు. ఊహించాను)
Source; Pieces of Shadow- by Jaime Sabines
అనువాదం: బొల్లోజు బాబా
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment