కాగితం పడవలు (రవీంద్రుని క్రిసెంట్ మూన్ నుంచి)
ప్రతీరోజూ నేను పారేనీటిపై కాగితపు పడవలని వదులుతూంటాను.
వాటిపై పెద్దపెద్ద అక్షరాలతో వ్రాస్తాను, నా పేరు నా ఊరి పేరు.
ఎవరైనా పరదేశి వాటిని చూసి నేనెవరో తెలుసుకొంటారని నా ఆశ.

మా తోటలో పూచిన పారిజాతపూలతో నా చిట్టి పడవలను నింపుతాను.
ఈ ఉదయ సుమాలు సురక్షితంగా రాత్రి తీరానికి చేర్చబడతాయని నా ఆశ.

నా పడవలను నీటిపై వదిలి అలా ఆకాశం వైపు చూస్తాను.
అక్కడ చిట్టి మేఘాలు తమ వెండి తెరచాపల్ని విప్పుకొని కనిపిస్తాయి.
నా పడవలతో పోటీ పడటానికై, ఏ ఆటగాడు వాటిని ఆకాశంలోకి వొదిలాడో నాకు తెలియదు.

ఆ రాత్రి నిదురలో నా కాగితపు పడవలు నిశీధి తారల నడుమ అలా అలా సాగుతున్నట్లుగా కలగంటాను.
నిదుర కాంతలు వారి సజ్జల నిండా స్వప్నాలు నింపుకొని వాటిలో పయనిస్తూవుంటారు.

మూలం: రవీంద్రనాథ్ టాగూర్ క్రిసెంట్ మూన్
అనువాదం: బొల్లోజు బాబా
అనువాదం: బొల్లోజు బాబా
Complete version can be downloaded here
No comments:
Post a Comment