మహా నగరం
ఓ మహా వృక్షాన్ని కొట్టేసారు
ఒక పిట్ట తన చివరి పాటను
అక్కడే విడిచి
ఎక్కడికో ఎగిరిపోయింది
లేని చెట్టుకొమ్మకు వేలాడుతోన్న
ఆ పిట్ట పాట గాలికి ఊగుతోంది
ఒక పిట్ట తన చివరి పాటను
అక్కడే విడిచి
ఎక్కడికో ఎగిరిపోయింది
లేని చెట్టుకొమ్మకు వేలాడుతోన్న
ఆ పిట్ట పాట గాలికి ఊగుతోంది
ఆ పాట వినీ వినీ
నగరానికి పిచ్చెక్కింది
దుస్తులు చింపుకొని నగ్నయై
నేలపై పొర్లాడుతోంది
తన బాహువుల్ని తాడెత్తు గోడల్లా
పిచ్చిగా విస్తరింపచేసి
సరిహద్దుల్ని బంధించింది.
నగరానికి పిచ్చెక్కింది
దుస్తులు చింపుకొని నగ్నయై
నేలపై పొర్లాడుతోంది
తన బాహువుల్ని తాడెత్తు గోడల్లా
పిచ్చిగా విస్తరింపచేసి
సరిహద్దుల్ని బంధించింది.
బయటకు వెళ్ళే మార్గం
ఎవరికీ తెలియదు
దాని గురించి
ఎవరూ మాట్లాడుకోరు కూడా!
ఎవరికీ తెలియదు
దాని గురించి
ఎవరూ మాట్లాడుకోరు కూడా!
బొల్లోజు బాబా
No comments:
Post a Comment