గులకరాయి
వాచీలో అపుడు సమయం మారేడుమిల్లి
సెలయేటి ఒడ్డున కూర్చొని
నీటి రాపిడికి గుండ్రంగా నున్నగా మారిన
ఒక గులకరాయిని చేతిలోకి తీసుకొని
చెవి వద్ద ఉంచుకొన్నాను.
సెలయేటి ఒడ్డున కూర్చొని
నీటి రాపిడికి గుండ్రంగా నున్నగా మారిన
ఒక గులకరాయిని చేతిలోకి తీసుకొని
చెవి వద్ద ఉంచుకొన్నాను.
కొండలపై భోరున కురిసే వాన శబ్దాలు,
ఉరుములు, భీకరంగా వీచే గాలుల ఊళలు,
చీకట్లో చినుకుల దారిలో
"a girl in red coat" ఒంటరిగా
నడిచిపోతోన్న అడుగుల సవ్వడులు వినిపించాయి.
ఏవో జ్ఞాపకాలు బహుసా!
ఉరుములు, భీకరంగా వీచే గాలుల ఊళలు,
చీకట్లో చినుకుల దారిలో
"a girl in red coat" ఒంటరిగా
నడిచిపోతోన్న అడుగుల సవ్వడులు వినిపించాయి.
ఏవో జ్ఞాపకాలు బహుసా!
ఆ గులకరాయిని ఆశ్చర్యంతో చూస్తుండగానే
కళ్లముందే ఓ సీతాకోక చిలుకలా మారి
తన ఒంటరితనాన్ని నా చేతిలో ఒదిలిపెట్టి.
ఎటో వెళ్ళిపోయింది
దాన్ని జేబులో వేసుకొని ఇంటికి బయల్దేరాను.
***
కళ్లముందే ఓ సీతాకోక చిలుకలా మారి
తన ఒంటరితనాన్ని నా చేతిలో ఒదిలిపెట్టి.
ఎటో వెళ్ళిపోయింది
దాన్ని జేబులో వేసుకొని ఇంటికి బయల్దేరాను.
***
ఒంటరితనం
ఎర్రని గౌను తొడుక్కొని
నా రీడింగ్ టేబుల్ పై కూర్చొని
చీకట్లో మెరిసే కళ్లతో
నన్నే తదేకంగా చూస్తోంది.
ఎర్రని గౌను తొడుక్కొని
నా రీడింగ్ టేబుల్ పై కూర్చొని
చీకట్లో మెరిసే కళ్లతో
నన్నే తదేకంగా చూస్తోంది.
వాచీలో అపుడు సమయం కవిత్వం.
బొల్లోజు బాబా
"a girl in red coat"- Schindler's list సినిమాలో ఒక ప్రతీకాత్మక పాత్ర.
No comments:
Post a Comment