Monday, September 28, 2020

Imported post: Facebook Post: 2020-09-28T16:43:57

#PeetMeNotLeave Day 3: I have been nominated by Vasudha Rani gaaru to participate in the poetic marathon #PeetMeNotLeave. Thank you so much madam. During eight days, I publish my poems along with photos. Today I request Sikhamani garu to continue this torch *** The Dead After the funeral rites we reached home and he was right there, skimming through the photo albums of bygone days; by the time we recovered from the daze, he disappeared. I saw him many times afterwards. At night when I roll on bed sideways and remain sleepless despite taking a diazepam pill, he would let me keep my head on his lap and recount the stories and songs from his childhood as I would slowly spiral into sleep. On the days when I run a temperature 'The kid's body is burning with fever' he would say, and take me to the balcony to comfort me, where my daughter would touch forehead and ask 'what happened, father?' I always thought he is somewhere around trying to grapple his reflection in the water. Those who are in disbelief will understand when they see me appearing after death. Translated by Rohith మృతుడు అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికొచ్చేసరికి సోఫాలో కూర్చొని పాత ఆల్బమ్ లు తిరగేస్తూ కనిపించాడు ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా మాయమయ్యాడు ఆ తరువాత ఎన్నోసార్లు కనిపించాడు డైజిపామ్ కి కూడా నిద్ర పట్టక దొర్లుతూంటే తన బొజ్జపై నన్ను పడుకోపెట్టుకొని కథలు, పద్యాలు తన చిన్ననాటి సంగతులూ చెపుతూండగా మధ్యలో ఎపుడో నిద్ర పట్టేసేది. "చంటాడికి ఒళ్ళు కాలిపోతోంది" అంటూ నన్ను భుజాలపై వేసుకొని ఆరుబయట తిప్పుతూండగా మా అమ్మాయి నా నుదిటిపై చేయివేసి "ఏమైంది నాన్నా" అనేది చాలాసార్లు. నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకోవటానికి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడని అనిపించేది. ఇపుడెవరూ నమ్మటం లేదు కానీ రేపెపుడో నేనూ అలా కనిపించినపుడు నమ్ముతారు బహుసా! బొల్లోజు బాబా

Sunday, September 27, 2020

personal

 #PeetMeNotLeave

Day 2: I have been nominated by Vasudha Rani gaaru to participate in the poetic marathon #PeetMeNotLeave. Thank you so much madam.
During eight days, I publish my poems along with photos.
***

Personal

are you religious?
yes, I am

religion means my
unwitnessed conversation with God
I am not there in
groups playing cymbals or
crowds rotating tridants
Jai Sree Ram

are you a commie?
Yes, I am
Communism means my
personal responsibility towards society
I am not there in
gatherings holding flags
troops carrying guns
Lal Salam

Bolloju Baba


personal

నువ్వు మతవాదివా?
అవును మతవాదినే!

మతం అంటే భగవంతునితో
నేచేసే ఏకాంత సంభాషణ
చిడతలు పట్టుకొన్న సమూహాలలోను
త్రిశూలాలు తిప్పుతున్న బృందాలలోను
నేను లేను..... జై శ్రీరామ్

నువ్వు కమ్యూనిస్టువా?
అవును కమ్యూనిస్టునే!

కమ్యూనిజం అంటే సమాజం పట్ల
నాకున్న వ్యక్తిగత బాధ్యత
జండాలు పట్టుకొన్న సమూహాలలోను
తుపాకులు మోస్తున్న బృందాలలోను
నేను లేను..... లాల్ సలామ్.

27/05/2019
బొల్లోజు బాబా 
See less

Imported post: Facebook Post: 2020-09-27T12:13:34

#PeetMeNotLeave Day 2: I have been nominated by Vasudha Rani gaaru to participate in the poetic marathon #PeetMeNotLeave. Thank you so much madam. During eight days, I publish my poems along with photos. *** Personal are you religious? yes, I am religion means my unwitnessed conversation with God I am not there in groups playing cymbals or crowds rotating tridants. Jai Sree Ram are you a commie? Yes, I am Communism means my personal responsibility towards society I am not there in gatherings holding flags troops carrying guns. Lal Salam Bolloju Baba personal నువ్వు మతవాదివా? అవును మతవాదినే! మతం అంటే భగవంతునితో నేచేసే ఏకాంత సంభాషణ చిడతలు పట్టుకొన్న సమూహాలలోను త్రిశూలాలు తిప్పుతున్న బృందాలలోను నేను లేను..... జై శ్రీరామ్ నువ్వు కమ్యూనిస్టువా? అవును కమ్యూనిస్టునే! కమ్యూనిజం అంటే సమాజం పట్ల నాకున్న వ్యక్తిగత బాధ్యత జండాలు పట్టుకొన్న సమూహాలలోను తుపాకులు మోస్తున్న బృందాలలోను నేను లేను..... లాల్ సలామ్. 27/05/2019 బొల్లోజు బాబా

Saturday, September 26, 2020

Imported post: Facebook Post: 2020-09-26T17:01:27

#PeetMeNotLeave Day 1: I have been nominated by Vasudha Rani gaaru to participate in the poetic marathon #PeetMeNotLeave. Thank you so much madam. During eight days, I publish my poems along with photos. *** About a few words...... Nothing is remembered Except A pocketful of sun-rays A Fistful slices of moon Wish to forget everything by getting this tear filled evening under the eyelids of this night to sleep But Some words drop from me and become a desert a forest comes out of that desert and a cloud-burst from that forest- one after the other blossom and engulf me Though born out of me It drifts me away like a piece of twig Nothing is remembered Except Pocketful of words Fistful slices of a dream. 13 March 2016 కొన్ని పదాల గురించి...... ఏమీ గుర్తు లేవిపుడు జేబుడు సూర్యకిరణాలు గుప్పెడు చందమామ ముక్కలు తప్ప. దుఃఖాశ్రువులు నిండిన సాయింత్రాన్ని రాత్రి రెప్పల క్రింద నిదురపుచ్చి అన్నీ మరచిపోదామనుకొంటాను కానీ కొన్ని పదాలు నా నుండి రాలిపడి ఓ ఎడారిని సృష్టిస్తాయి ఆ ఎడారిలోంచి ఓ అరణ్యము ఆ అరణ్యం లోంచి కుంభవృష్టీ ఒక్కొక్కటిగా విచ్చుకొని నన్ను కబళిస్తాయి. నానుంచి పుట్టినదైనా నన్నో పూచికపుల్లను చేసి కొట్టుకొని పోతుంది ఏమీ గుర్తులేవిపుడు జేబుడు పదాలు గుప్పెడు కలల ముక్కలు తప్ప బొల్లోజు బాబా

Imported post: Facebook Post: 2020-09-26T13:18:03

రామ్, రవీ మా డ్రాయింగు మాస్టారు శ్రీ చెల్లి కృష్ణమూర్తి గారి అబ్బాయిలు. మేమంతా ఒకే స్కూల్ లో చదూకున్నాం. వీళ్ళిద్దరూ నాకు సీనియర్స్. రామ్ పాలిటెక్నిక్ చదివి నాతో పాటు ఇంటర్ లో కొంతకాలం కలిసాడు. తరువాత ఉద్యోగం వచ్చి వెళిపోయాడు. అప్పట్లో చలం పుస్తకాలు పట్టుకొని తిరిగేవాడు. నేను డిగ్రీలో కొచ్చాకా చలాన్ని తాకాను. ఇక రవి గురించయితే నాకెప్పుడూ కన్ఫ్యూజనే నేనెవరితో మాట్లాడుతున్నానో అని. చాన్నాళ్లకు కానీ క్లారిటీ రాలేదు. రవి కూడా కవిత్వం వ్రాస్తాడు. చక్కగా ఆలపించగలడు. వక్తగా సభల్లో రంజింపచేయగలడు. అంతకు మించి "ఒక కవిని కన్న తండ్రి". కొయిటా అమ్మకు కన్నీటి సంతకం ఒక సంచలనం. శివారెడ్డిగారు అంటూంటారు ఒక్క కవిత..... ఒక్క కవిత చాలు నిన్ను ఓ ఇరవై ఏళ్లు బ్రతికిస్తుందని. అలా ఆ సంపుటి రామ్ కి తెచ్చిన కీర్తి అజరామరం. అయినప్పటికీ రామ్ రెండో పుస్తకం తేవాలి. ఈ ఇరవై ఏళ్ళలో ఏ మేరకు పదునెక్కాడో, ఏ మేరకు విస్త్రుతమయ్యాడో సాహిత్యచరిత్రలో నిక్షిప్తం కావాలి..... అది అవసరం. నాకు తెలిసి రవి వద్ద మంచి కవితలు ఉన్నాయి. వాటిని వెలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొడుకుతో పోటీ పడే అవకాసం ఎంతమందికి వస్తుంది? ఇద్దరూ ఒకే ట్రాక్ పై పరిగెడుతూంటే చూడాలని ఉంది.... ... పోనీ పాడుతూంటే ... సరదాకి మా ముగ్గురినీ కలిపి ఉంచే అంతస్సూత్రం శిఖామణి గురువుగారు. ఆ చెట్టుపై వాలిన పిట్టలం ముగ్గురం. Ram Poet, Chelli Ravi ఇద్దరకూ జన్మదిన శుభాకాంక్షలు బొల్లోజు బాబా


Friday, September 25, 2020

Imported post: Facebook Post: 2020-09-25T17:35:51

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ పెరిగిన వారిలో నేనూ ఒకడిని. వారికి నా నివాళులు

Thursday, September 17, 2020

Imported post: Facebook Post: 2020-09-17T16:19:21

నన్నయ రాజమహేంద్రవరాన్ని "వేంగీ రాజ్యమునకే నాయకరత్నం" అని ప్రస్తావించిన పద్యం ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్

Monday, September 14, 2020

చరిత్రలో కన్యాశుల్కం

 చరిత్రలో కన్యాశుల్కం

వివాహవ్యవస్థ సమాజంలో అతి ముఖ్యమైనది. ఒక యువకుడు గృహస్థాశ్రమ దశలో భార్యతో కలిసి ధార్మికవిధులను, తన ఫూర్వీకులకు సంబంధించిన కర్మకాండలను నిర్వహిస్తూ జీవించాలని వేదాలలో చెప్పబడింది. స్త్రీ పురుషులిద్దరకూ సమాన హోదా ఇవ్వబడింది. అర్ధాంగి అనే మాట అప్పటిదే. భార్యాభర్తలిరువురు ఒకేదేహంలోని ఇద్దరు వ్యక్తులు కనుక, భర్తచనిపోతే ఇంకా సగభాగం బ్రతికే ఉన్నట్లే, అట్టి భర్తృహీనకు భర్తఆస్తిలో హక్కు ఉంటుందని స్మృతులు చెప్పాయి. స్త్రీల పట్ల ఆనాటి చట్టాలు చూపిన సమానత్వమది.
మధ్య యుగాలకు వచ్చేసరికి సమాజంలో స్త్రీ స్థానం తారుమారు అయ్యింది. పురుషాధిక్య సమాజంలో ఒక విలాస వస్తువుగా మారింది. రాజులు, సంపన్నవర్గాలు అంతఃపుర స్త్రీల (Harem) పేరిట వేలకొలది యువతులను తమ ఆధీనంలో ఉంచుకోవటం; బహుభార్యత్వము; చట్టబద్ద వ్యభిచార గృహాలకు అవసరమైన స్త్రీలకొరకు పెద్దఎత్తున సమాజంలో యువతుల అపహరణాలు జరుగుతూ ఉండటం - లాంటి వివిధ కారణాల వల్ల ఒక సమయంలో స్త్రీల సంఖ్య విపరీతంగా పడిపోయింది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని యువకులకు పెండ్లాడాలంటే ఆడపిల్లలకు కరువు ఏర్పడింది. ఈ కాలంలోనే కన్యాశుల్కం అనే ఆచారం వచ్చిఉంటుంది. కన్యాశుల్కం ఆచారం అంటే ఆడపిల్లల తండ్రులకు కొంత ధనం చెల్లించి వారి అమ్మాయిలను పెండ్లిచేసుకోవటం. అలా చెల్లించిన ధనానికి కన్యాశుల్కం/ఓలిసుంకం/ఓలి మర్యాద అని వివిధ పేర్లు. .
పదహారో శతాబ్దంలో Linschoten అనే డచ్ వ్యాపారి ఆంధ్రదేశాన్ని సందర్శించినపుడు "ఇక్కడ ఆడపిల్లలకు 7 సంవత్సరాలలోపు, మగపిల్లలకు తొమ్మిది సంవత్సరాలలోపు వివాహాలు అయిపోతాయి. అమ్మాయిలకు యుక్తవయసు వచ్చిన పిదప మాత్రమే కాపురానికి పంపించటం జరుగుతూన్నది" అన్నాడు.
మనుస్మృతిలో స్త్రీ వివాహ వయస్సు 12 లేదా 18 సంవత్సరాలుగా చెప్పబడింది. యజ్ఞయాగాదులు, పితృదేవతల కర్మకాండలు ఇతర పూజాదికాలు సతీ సమేతంగా నిర్వహించవలసి ఉంటుంది కనుక ముప్పై ఏండ్ల వయసు ఉన్న పురుషుడు, తన ధార్మిక విధులు నిర్వహించటానికి అత్యవసర పరిస్థితులలో 8 ఏండ్ల బాలికను వివాహమాడవచ్చునని మినహాయింపు ఇచ్చింది (Olivelle 2005, p. 194). లౌకిక వ్యవహారాలను నిర్వహించటానికి స్త్రీలకు కనీసం 12 సంవత్సరములు, పురుషులకు 16 సంవత్సరములు ఉంటేనే వారు అర్హులని కౌటిల్యుని అర్ధశాస్త్రం చెప్పింది. మన ప్రాచీన ధర్మశాస్త్రాలలో ఎక్కడా Linschoten వర్ణించినట్లు అమ్మాయిలకు ఏడు సంవత్సరాల వయసులోపు చేసే బాల్య వివాహాల ప్రసక్తి లేదు.
మధ్యయుగాలలో ఏర్పడిన సామాజిక పరిస్థితుల వల్ల బాల్యవివాహాలు అనేవి ఒక రకంగా కరువు కాలంలో "ముందస్తు ఒప్పందాల" వంటివి అని భావించవచ్చు.
ఈ కన్యాశుల్క ఆచారం వల్ల ఒకనాటి మధ్యతరగతి యువకులు ఎలా నలిగిపోయారో కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది.
***
విజయవాడ మల్లేశ్వర ఆలయంలో క్రీశ. 1553 నాటి ఒక శాసనములో- కొండపల్లినుండి రాజమహేంద్రవరం వరకూ ఉన్న ప్రజలందరూ (తెలగాలు?) పెండ్లికొడుకు తరపువాళ్ళైతే "ఓలి మర్యాద" గా 21 బంగారు మాడలు, పెండ్లికూతురు తరపువాళ్ళు 12 వెండి మాడలు ఇచ్చిపుచ్చుకోవాలని; పెండ్లికూతురుకి రెండవపెండ్లి అయితే మగపెళ్ళివారు పన్నెండు వెండిమాడలు, రెండు బంగారు మాడలు ఇవ్వాలని దీన్ని ఎవరు తప్పినా హీనవాదులు" అని ఉన్నది. (శా.నం. 337 of 1892).
మగ పెండ్లివారు అధిక మొత్తాన్ని ఆడపెండ్లివారు నామమాత్రంగా కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం గమనించవచ్చు. అప్పట్లో ఇలా జరిగే బాల్య వివాహాలకారణంగా చిన్న వయసులోనే స్త్రీలు వైధవ్యం పొందేవారు. అలాంటి వారికి పునర్వివాహం చేయటానికి ఎలాంటి ఆక్షేపణా ఉండేదికాదు. అలాంటి వివాహాలకు తక్కువ ఓలి ఉండేది. నిర్ధిష్టమైన కట్నకానుకలను నిర్ణయించటం ద్వారా ఆనాటి సంఘం తన సభ్యుల హెచ్చుతగ్గుల్ని క్రమబద్దం చేయటానికి ప్రయత్నించేదని అర్ధమౌతుంది.
***
పూర్వం రాజుల ప్రాపకం పొందిన వారికి రాజు కొన్ని గ్రామాలను దానం చేసేవాడు. వారు ఆ గ్రామాలు కట్టే పన్నులను వసూలు చేసుకొంటూ జీవనం సాగించేవారు. తమ మగపిల్లలకు వివాహం చేయవలసిన సందర్భాలలో తమకు హక్కుకలిగిన గ్రామాలను కన్యాశుల్కం క్రింద దానం చేసేవారని శాసనాలలో కనిపిస్తుంది.
విజయనగర రాజుల పాలనలో క్రీశ. 1379 నాటి శాసనంద్వారా నంబి ఇరవ శెట్టియార్ తనకు హక్కుభుక్తంగా ఉన్న పసింగైపల్లి అనే గ్రామాన్ని తనమనవడైన కేశవ శెట్టియార్ కు వివాహం నిమిత్తం ఆచంద్రతారార్కం ఉండేలా దానం ఇచ్చాడు. అంటే మనవడి పెండ్లి ఖర్చులను తాత భరించినట్లు అర్ధం చేసుకోవాలి. ఆచంద్రతారార్కం అంటే ఒక రకంగా ఆ గ్రామంపై తనకు ఉన్న అన్ని హక్కులను ఒదులుకొన్నట్లే. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol IX, pn 102)
క్రీశ. 1404 నాటి ఒక శాసనములో అచ్చప్ప కొడుకు విత్తప్ప అనే వ్యక్తి "తన వివాహఖర్చులకొరకు" కౌదవల్లి అనే గ్రామాన్ని 300 బంగారునాణాలకు (Hon coins), నరశింహదేవ కుమారుడైన శుంగప్పకు విక్రయించినట్లు కలదు. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol VIII, pn 190).
క్రీశ. 1424 నాటి శాసనములో ఆళ్వప్రభు బొమ్మియక్క అనే వ్యక్తి బోవన్న అయ్య అనే ఆలయపూజారికి కొంతభూమిని "తన వివాహ నిమిత్తం" విక్రయించినట్లు కలదు. (ibid p 199)
పై శాసనముల ద్వారా మగపిల్లల వివాహం అనేది ఖర్చుతో కూడుకొన్నదని, కన్యాశుల్కధనం కొరకు ఆస్తులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అర్ధమౌతుంది.
"ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెండ్లాడితే ఇంటి కుండలన్నీ పగలకొట్టిందట" అనే సామెతలో ఆనాటి మధ్య, దిగువమధ్యతరగతి పెండ్లికొడుకులు సామాజికంగా ఎదుర్కొన్న వ్యధంతా దాగిఉన్నది. ( ఈ సామెతలోని body shaming కి ఈ రచయిత వ్యతిరేకం)
***
మెకంజీ సేకరించిన గ్రామ కైఫియ్యతులలో వివిధ కులాలలో అమలులో ఉన్న కన్యాశుల్క ప్రస్తావనలు కలవు. ఇవి భిన్న కులాలకు భిన్న విలువలతో ఉండటాన్ని గమనించవచ్చు.
* వక్కలిగర్ కులస్థులలో ఓలి మర్యాద 12 వరహాలు. వితంతువు అయితే 6 వరహాలు.
* తెలుగు బానాజిగర్ కులస్థులలో పెండ్లికూతురికి ఓలి 8 వరహాలు. పెళ్ళి నిశ్చయమయ్యాక, జ్యోతిష్యుడు నిర్ణయించిన సమయానికి పెండ్లికుమారుని బృందం పెండ్లికుమార్తె ఇంటికి వెళ్ళి ఆ ధనాన్ని ఇస్తారు. ఆ మరుసటి రోజు ఆ దంపతులను ఊరంతా ఊరేగించి వివాహం జరిపిస్తారు.
* కుంభకార కులాలలో ఓలి మర్యాద 3 వరహాలు. మేనరికాలకు మొదటి అవకాశం ఇవ్వాలి. పెండ్లికూతురు వితంతువు అయితే ఓలి మర్యాద 1 వరహా.
* వడ్డెరలలో ఓలి 2 వరహాలు, మారుమనువు అయితే 1 వరహా. వీరి ముహుర్తాలను జోగినిలు నిర్ణయించెదరు. (ref: Summaries of the Mackenzie collection vol II)
కన్యాశుల్కం అనేది ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే చెందిన ఒక దురాచారంగా తెలుగునాట స్థిరపడిపోయింది. కానీ ఈ ఆచారాన్ని ఆనాటి సమాజంలోని ఇతర కులాలు కూడా పాటించేవని మెకంజీ కైఫియ్యతులద్వారా అర్ధమౌతుంది.
***
విజయనగర రాజు ప్రతాపదేవరాయలు చెంగల్పట్టు, మంగాడు అనే గ్రామంలో స్థానికులతో కలసి వేయించిన ఒప్పంద శాసనము చాలా ఆసక్తికరం. దీనిలో వివాహసందర్భంగా ఆ గ్రామానికి చెందిన భూములను స్థానికేతరులకు సంక్రమింపచేయరాదని ఉన్నది. (శా.నం.354 of 1908).
ఈ శాసనం ఆనాటి గ్రామసంఘాలయొక్క కట్టుబాటును తెలియచేస్తుంది. బహుసా ఆడపిల్లల తండ్రులు తమకూతురికి కన్యాశుల్కంగా ఇవ్వబడిన భూముల యాజమాన్యహక్కులను పదిలపరచుకొనే ప్రయత్నంలో ఆ గ్రామంలో ఏవో ఘర్షణలు జరిగి ఉంటాయి. కన్యాశుల్కమంటే ఆడపిల్లలను అమ్ముకోవటంగానే ఒకనాటి సమాజం చూసిందని అనుకోవాలి.
***
కన్యాశుల్క ఆచారం గురించి అప్పట్లోనే ప్రజలలో నిరసన ఉండేదనటానికి కూడా ఒక శాసనం ఆధారంగా నిలుస్తుంది. ఆనాటి సమాజ చైతన్యాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక శాసనమిది.
క్రీశ 1425, వీరప్రతాప దేవరాయలు పాలనలో పడైవీడు ప్రాంతానికిచెందిన కన్నడ, తమిళ, తెలుగు బ్రాహ్మణులందరూ కలసి ఒక తీర్మానం చేసుకొన్నారు. దీనిప్రకారం "వారి కుటుంబాలమధ్య జరిగే వివాహాలు కన్యాదాన పద్దతిలో మాత్రమే జరుపుకొనేటట్లు, పెండ్లికూతురుతండ్రి ధనాన్ని స్వీకరించినా లేక పెండ్లికొడుకుతండ్రి ధనాన్ని ఇవ్వచూపినా వారిని కులం నుండి వెలివేయటం జరుగుతుందని; ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు కన్యాదానపద్దతి వివాహమే అనుమతించబడినదని; దీన్ని అతిక్రమించేవారు రాజదండనకు పాత్రులు అని వ్రాసుకొని సంతకాలు పెట్టుకొని, ఆ తీర్మానాన్ని తమిళనాడులోని వెల్లూరు వద్దకల విరించిపురం ఆలయగోపురం లోపలిగోడపై ఒక శాసనంగా వేయించారు. (శా.నం.49 of 1887)
ఈ శాసనం ద్వారా ఒకప్పుడు ప్రజాసమూహాలు తమకు సంబంధించిన ఆచారవ్యవహారాలను ప్రజాస్వామ్యయుతంగా రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండేవారని తెలుస్తుంది. శాసనం దిగువ దీనికి ఒడంబడిన గ్రామపెద్దల వివరాలు, వారి ఊరిపేర్లతో సహా ఉన్నాయి. ఇది ఒకరకంగా పెద్దమనుషుల ఒప్పందం లాంటిది. అది రాజామోదం పొందటం గమనార్హం. ఈ అమరిక ఇతరప్రాంతాలకు విస్తరించినట్లు లేదు.
***
మధ్యయుగాలలో మధ్యతరగతి వర్గాలు వివాహం చేసుకోవాలంటే భరించాల్సిన మరో కష్టం పెండ్లి సుంకం. అప్పట్లో సాధారణంగా పెళ్ళిళ్ళు ఆలయాలలో జరిగేవి. అలా చేసుకొన్నందుకు అప్పటికి అమలులో ఉన్న చట్టాలప్రకారం పెండ్లి సుంకం చెల్లించాలి. దీన్ని ఆడ మరియు మగ పెండ్లి వారు ఇరువురూ కట్టవలసి ఉంటుంది.
పెండ్లి సుంకం వసూలు చేయటం చోళులకాలం నుంచి ఉన్నది. పెండ్లి సుంకం కాక వివాహ సందర్భంలో జరిపే ఉరేగింపు, పెళ్లిపందిరులు, వివాహవేడుకలు, పల్లకి యాత్రలకు వంటి వివిధ అంశాలకు విడి విడి పన్నులు వసూలుచేసేవారు.
రొంపిచర్ల, వేణుగోపాల స్వామి ఆలయంలో క్రీశ. 1264 నాటి ఒకశాసనములో, ఆ ఆలయములో వివాహము జరుపుకొన్నందుకు ఒక బంగారు మాడ పెండ్లిసుంకము, 13 పోకలు, ఒక కట్ట తమలపాకులు స్వామివారికి సమర్పించుకోవాలని ఉన్నది.
ఆలయమునకు పెండ్లి సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ బాగోగులకై వెచ్చించేవారని నరసారావుపేట పమిడిపాడు వల్లభరాయ ఆలయంలో క్రీశ 1154 లో వేయించిన ఒక శాసనము ద్వారా తెలుస్తున్నది. (శానం.347 of 1915)
మెకంజీ సేకరించిన సంజీవిపల్లె కైఫియత్తులో గండికోట ను ఏలుతున్న పెమ్మసాని తిమ్మనాయుని కాలంలో కర్నగొల్లలు పేదరికముచేత 101 మాడల పెండ్లిసుంకము చెల్లించలేక అవివాహితులుగా ఉండిపోతున్నారని, వారి దుస్థితిని గమనించిన సదాశివరాయలు పెండ్లిసుంకాన్ని 16 మాడలకు తగ్గించాడనే ఉదంతం కలదు. ఈ ఉదంతం ద్వారా పెండ్లిసుంకం సామాజికంగా ఏ విధమైన ప్రభావం కలిగించేదో స్పష్టమౌతుంది. (Summaries of the Mackenzie collection vol II p.no 182)
పెండ్లి సుంకమును వివిధ శుభసందర్భాలలో ప్రజలకు కానుకగా ప్రభువులు రద్దుచేయటం జరిగేది. క్రీశ.1510 లో కృష్ణదేవరాయలు వేయించిన ఒక శాసనములో విజయనగర సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో అన్నికులాల వారికి పెండ్లి సుంకము రద్దుచేసినట్లు ప్రకటించాడు. (శా.నం.387 of l904)
***
క్రీశ. 1870 లో విశాఖపట్నానికి చెందిన G. Vedanthachary అనే మహాశయుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్రాసిన ఒక లేఖలో " ఈ కన్యాశుల్క దురాచారం వల్ల జరుగుతున్న బాల్యవివాహాల కారణంగా స్త్రీలు చిన్నవయసులోనే వితంతువులుగా మారుతున్నారని, ఈ ఆచారంపై నిషేదం విధించాలని" విన్నవించాడు. 1887 లో విజయనగర మహారాజు గారు చేయించిన ఒక సర్వేలో అక్కడ ఏటా 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నాయని, వధువులు ఎక్కువగా అయిదేండ్ల లోపుబాలికలు అని తేలింది. బహుశా ఈ సర్వే ఫలితాలు శ్రీ గురజాడ అప్పారావు గారు చూసే ఉంటారు. కన్యాశుల్కం నాటకం వ్రాయటానికి ప్రేరణ పొంది ఉండొచ్చు.
ఆ తరువాతి క్రమంలో కన్యాశుల్కం బదులుగా వరకట్న ఆచారం పెచ్చరిల్లింది. నిజానికి స్త్రీలకు వివాహ సమయంలో స్త్రీ ధనం రూపంలో బహుమతులు ఇచ్చే పద్దతి అనాదిగా ఉన్న సంప్రదాయమే. అది ప్రేమతో, స్త్రీ స్వావలంబనను పెంచే ఆచారంగా అనుకోవచ్చు. కానీ నేటి వరకట్న డిమాండ్, వేధింపులు సామాజిక రుగ్మతలు. గత శతాబ్దంతో పోల్చితే పరిస్థితులు కొద్దికొద్దిగా మారుతున్నాయి. ఇదొక శుభపరిణామం.
బొల్లోజు బాబా

భిన్న మతాలలో వినాయకుడు

 భిన్న మతాలలో వినాయకుడు

.
హిందూ మతంలో గణేషుడు విఘ్నాధిపతిగా అతి ముఖ్యమైన పాత్రపోషించే దైవం. గణాధిపతి మొదటగా ఎక్కడ ప్రస్తావించబడ్డాడనే దానిపై చరిత్రకారులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
*Alice Getty అనే చరిత్రకారిణి, గణేషుడు ద్రావిడులకు చెందిన దైవమని అభిప్రాయపడింది.
*దక్షిణానికి వచ్చిన ఆర్యులు ఇక్కడి ఏనుగులను చూసి అంతటి శక్తి తమకివ్వమని ఆ రూపంలో గణేషుని కల్పన చేసుకొన్నారని మరికొందరి అభిప్రాయం. (Haridas Mitra).
*Aravamutham వంటి వారు వేదాలలో గణేషుని మూలాలున్నాయని భావించారు.
1. వేదాలలో గణేషుడు
రుగ్వేదం లో చెప్పబడిన గణేషుడు బ్రహ్మనస్పతి అని నేడు మనం కొలుస్తున్న గజముఖుడు, ఏకదంతుడు, లంబోదరుడు, శివపార్వతుల తనయుడైన వినాయకుడు కాదు అని ఒక వర్గం; వేదాలలో ఉన్న "గణానాంత్వా గణపతిగుం హవామహే.... శ్లోకంలో గణాధిపతిగా గణేషుడు కలడని, ఇతడే బ్రహ్మనస్పతి గా చెప్పబడ్డాడని మరొక వర్గం ఎవరికివారు తమ తమ వాదనలలో నిలువునా విడిపోయారు. ఇది ఎప్పటికీ తెగని వాదం.
రామాయణ, మహాభారతాలలో వినాయకుని ప్రస్తావన ఎక్కడా లేకపోవటం గణేషుని కాలాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. (వ్యాసునికి లేఖకునిగా వినాయకుడు ఉండటం అనే గాథ తొమ్మిదో శతాబ్దానిది అంటారు. )
చరిత్రపరంగా చూడవలసి వస్తే... క్రీశ. 485 లో విష్ణుకుండిన రాజైన మాధవవర్మ వేల్పూరు లో వేయించిన ఒక శాసనములో మొదటి సారిగా వినాయకుని ఆలయనిర్మాణము గావించి అందులో "దంతిముఖ స్వామి" విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఉన్నది. దక్షిణభారతదేశములో వినాయక ఆలయాలను గురించి లభించే మొట్టమొదటి శాసనమిది.
వేంగిచాళుక్యల కాలంలో (ఆరోశతాబ్దం) బిక్కవోలు వద్ద నిర్మించిన వినాయకాలయం ప్రాచీన గణపతి ఆలయాలలో ప్రముఖమైనది. ఇక ఆ తరువాత ఏడో శతాబ్దం నాటి శంకరాచార్యుడు ప్రవేశపెట్టిన "పంచాయతన పూజ" పద్దతికి అనుగుణంగా శివాలయమైనా, వైష్ణవాలయమైనా గణపతి మందిరం తప్పనిసరిగా ఉంటూ వచ్చింది.
ఏ వాదన ఎలా సాగినప్పటికీ గణేష ఆరాధనకు సంబంధించిన గణాపత్య శాఖ (Ganapatya) క్రీశ. 4 వ శతాబ్దంలో వృద్ధిలోకి వచ్చి గణేష ఆరాధన భారతదేశంలోనే కాక శ్రీలంక, నేపాల్, బర్మా, చైనా, జపాన్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది.
బౌద్ధ, జైన మతాలలో కూడా గణేషుని గురించి స్పష్టమైన ఉల్లేఖనలు కనిపిస్తాయి.
.
2. బౌద్ధంలో గణేషుడు
క్రీపూ రెండొ శతాబ్దానికి చెందిన అమరావతి బౌద్ధ స్థూపంపై ఏనుగుశిరస్సు కలిగిన యక్ష శిల్పాలు గణేషునికి సంబంధించిన తొట్టతొలి రూపంగా చరిత్రకారులు భావిస్తారు (C. Sivaramamurthy). కొన్ని బౌద్ధగాథలలో వినాయకుడు అన్నమాట బుద్ధునికి పర్యాయపదంగా వాడటం జరిగింది. (అమరుకోశం). విశాఖపట్నం సమీపంలో కల బొజ్జన్నకొండ వద్ద కల క్రీశ 5/6 శతాబ్దానికి చెందిన బౌద్ధారామం ముంగిట వద్దకూడా వినాయకుని విగ్రహం ఉన్నది.
శ్రీలంక లో ఒకటో శతాబ్దానికి చెందిన Mihintale బౌద్ధచైత్యంలో నేడు మనం చూస్తున్న ఆకారంలో గణేషుడు ప్రప్రధమంగా కనిపిస్తాడు. పీఠంపై కూర్చున్న భంగిమలో, లంబోదరంతో, ఏకదంతంతో ఉండే ఈ గణపతి విగ్రహం నేడు మనం పూజిస్తున్న విగ్రహానికి ప్రొటోటైప్ లాంటిదని చరిత్రకారులు భావిస్తారు. (IK Sarma).
క్రీశ 5 శతాబ్దానికి చెందిన సారనాథ్ బుద్ధుని నిర్యాణసందర్భాన్ని చిత్రించే శిల్పాలలో గణేషుడు తన సోదరుడైన కార్తికేయునితో ఇంకా నవగ్రహాల ప్రతిమలతో బుద్ధుని చూస్తున్నట్లు ఉంది. బౌద్ధ శిల్పకళ క్రమక్రమంగా హిందూ శిల్పకళగా రూఫాంతరం చెందుతున్న కాలాన్ని ఈ ప్రతిమ నిక్షిప్తం చేస్తుంది.
బౌద్ధమతంలో జనామోదం పొందిన పేరుగా వినాయకుడు అనే నామం హిందూదేవగణంలోకి ప్రవేశించి ఉంటుందని. KK Datta అభిప్రాయపడ్డారు. (Proceedings of the Indian History Congress Vol XXII).
.
2. జైన గణేషుడు
విఘ్నాలను తొలగించి, విజయం అనుగ్రహించే దైవంగా జైనులు గణేషుని కొలిచేవారు. దేవతలు కూడా తమకార్యాలు సఫలం అవ్వాలని గణేషుని ప్రసన్నం చేసుకొంటారు అంటూ జైనాచార్యుడు, వర్ధమానసూరి తన ఆచారదినకర అనే గ్రంధంలో అన్నాడు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మధుర, రాజస్థాన్ లోని Ranakpur లాంటి జైనాలయాలలో గణేషుని శిల్పాలు నేటికీ చూడవచ్చును.
***
ఒకే కథనో, బోధననో హిందువులు, బౌద్ధులు, జైనులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా భాష్యం చెప్పుకొన్నారు. మధ్యయుగాల వరకూ అందరూ ఒకే భావధారను పంచుకొన్నారు. ఒకే దేవుళ్లకు, దేవతలకు తమ ధార్మికగ్రంధాలలో తోచినరీతిలో స్థానాన్ని కల్పించుకొన్నారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ నేలపై విలసిల్లిన భిన్న ఆధ్యాత్మిక మార్గాలు ఆదానప్రదానాలు చేసుకొన్నాయి. సింధులోయనాగరికతనుంచే భారతదేశంలో భిన్న సంస్కృతుల మేళనం మొదలైంది.
ఈ సమ్మేళనం గురించి పార్శీలు ఒక కథ చెపుతారు. కొంతమంది పార్శీలు ఒక నగరానికి వచ్చినపుడు అక్కడి రాజు ఒక నిండిన పాలగ్లాసును పంపి, ఈ నగరంలో చోటులేదు అని అన్యాపదేశంగా చెప్పాడట. దానికి ఆ పార్శీ బృందం ఆ పాలగ్లాసులో చక్కెర వేసి తిరిగి ఆ రాజుకు పంపారట. దాని అర్ధం మేము ఇక్కడి ప్రజలతో పాలు చక్కెరల్లా కలిసిపోతాము, అంతే కాక తీపిదనాన్ని కలిగిస్తాము అని. అలాగే ప్రాచీన భారతదేశ చరిత్రను గమనించినపుడు, బౌద్ధులు, జైనులు, శక్తేయులు, చార్వాకులు, కాపాలికులు, గణాపత్య, గిరిజనులు, సనాతన ధార్మికులు అందరూ శతాబ్దాలపాటు కలిసిమెలిసి సహజీవనం సాగించారు. అన్ని మార్గాల మధ్యా మానవాభ్యుదయానికి సంబంధించిన ఉత్తమవిలువల ప్రసరణం జరిగింది.
ఇదే సంప్రదాయం ముస్లిములు ఈ నేలపై అడుగుపెట్టిన తరువాత కూడా హిందూమతం తన అనాది బహుళత్వాన్ని ప్రదర్శించటాన్కి ఒక ప్రయత్నం చేసినట్లు అర్ధమౌతుంది. వెంకటేశ్వర స్వామికి బీబీనాంచారిని కట్టబెట్టటం, సూఫీలను, పీర్ల పండుగలను హిందువులు సమాదరించటం, మాలిక్ నైబు ను మల్కిభరామునిగా కీర్తించటం లాంటివి చాచిన స్నేహహస్తాలవంటివి.
బొల్లోజు బాబా

సమగ్ర కళా విమర్శకుడు - శ్రీ అద్దేపల్లి రామమోహన రావు

 సమగ్ర కళా విమర్శకుడు - శ్రీ అద్దేపల్లి రామమోహన రావు

.
(ప్రజాకవి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు జయంతి సందర్భంగా)
కవి చేసిన సృజనలోని గుణదోష విచారణ చేయటాన్ని విమర్శ అంటారు. ఆధునిక విమర్శకులలో కట్టమంచి, రాళ్ళపల్లి, విశ్వనాథ, శ్రీశ్రీ కోవలో నిలిచే వ్యక్తి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు.
శ్రీ అద్దేపల్లి కవిగా ఎంత లబ్ద ప్రతిష్టులో విమర్శకునిగా కూడా అంతే గొప్ప ప్రతిభావంతులు. వీరు సాహిత్యవిమర్శను ఇలా నిర్వచించారు.
"విమర్శ స్థూలంగా రెండు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. మొదటిది కవితా వస్తువు. రెండోది శిల్పం. ఒట్టి వస్తువు మీద మాత్రమే దృష్టి ఉంటే, దానిలో వాచ్యత మాత్రమే ఉంటుంది. ఒట్టి శిల్పం మీద మాత్రమే దృష్టి ఉంటే వ్యక్తికి గాని సమాజానికి గానీ సరైన ప్రయోజనం ఉండదు. అందువల్ల రెంటి మధ్యా సమగ్రమైన సమ్మేళనం ఉంటే అందులో ప్రయోజనం ఉంటుంది. వస్తువు శిల్పమూ ఎక్కడ కలిసిపోతాయో అది గొప్ప కవిత్వం. వస్తువును బాగా చెప్పేదే శిల్పం అవుతుంది. శిల్పం లేని వస్తువే గొప్పదనే వాదానికి పెద్దగా ప్రాముఖ్యం లేదు" అంటారు.
ఒక కవిని అంచనా వేయటానికి ఎంతో సహాయపడతాయి పై వాక్యాలు. అవి శ్రీ అద్దేపల్లి వారి సాహిత్యజీవితాన్ని కూడా పట్టిచూపుతాయి . విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి విమర్శనావ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది పై మాటలలో.
విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి వెలువరించిన పుస్తకాలు, వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.
1. శ్రీశ్రీ కవితా ప్రస్థానం
శ్రీశ్రీ మహాప్రస్థానంపై వ్రాసిన "శ్రీశ్రీ కవితా ప్రస్థానం" అనే సమీక్షాగ్రంథం శ్రీ అద్దేపల్లి వారి మొదటి విమర్శనా రచన. ఈ పుస్తకంపై రాచమల్లు రామచంద్రా రెడ్డి చేసిన ప్రతివిమర్శ, దానికి అద్దేపల్లి వారు ఇచ్చిన సమాధానం ఆ పై నడచిన చర్చ - అప్పట్లో తెలుగు సాహిత్యప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్లేషించేటపుడు "అక్షరాక్షర పరిశీలన" అనే పదం వాడారు. ఇది అద్దేపల్లి వారు సృజించిన పదమే. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వర్ణిస్తూ "కాల్పనికతకీ, అభ్యుదయానికీ మధ్య ఎర్రని రేఖ" అంటారు. అద్దేపల్లి ప్రతిపాదించిన ఈ మాట నేటికీ ఎంతో విలువైనదిగా భావించవచ్చు.
అద్దేపల్లి వారి గొప్పతనం ఎక్కడ ఉందంటే - ఆ తదనంతర కాలంలో శ్రీశ్రీపై చేసిన విమర్శలో ఉండిన "నా లోపాలు కూడా నాకు తెలిసినై" అని అంగీకరించటం. అది అద్దేపల్లి నిత్యచలనశీలతకు సంకేతం. ఇలాంటి వ్యక్తిత్వం విమర్శకులందరికీ గొప్ప ఆదర్శనీయం.
2. మహాకవి జాషువా కవితా సమీక్ష
జాషువా వ్రాసిన పుస్తకాలపై అద్దేపల్లి వ్రాసిన విశ్లేషణా వ్యాసాల గ్రంథం పేరు "మహాకవి జాషువా కవితా సమీక్ష". ఈ పుస్తకంలో జాషువా శైలి, శిల్పం, సామాజికత లాంటి అంశాలపై లోతైన చర్చ చేసారు అద్దేపల్లి. సాధారణంగా కులప్రాతిపదికపై జాషువా సాహిత్యాన్ని పరిశీలించటం అందరూ చేస్తారు. కానీ ఎవరూ అంతవరకూ చెప్పని విషయాలను చెప్పటం విమర్శకునిగా అద్దేపల్లి ప్రత్యేకత. పిరదౌసి, ముంతాజ్ మహల్ కావ్యాలలో కథాశిల్పాన్ని చెప్పటం, స్వయంవరం పుస్తకంలో ఉండే రాజకీయ వ్యంగ్యాన్ని గురించి విశ్లేషించటం ఈ కోవకు చెందుతాయి.
భూస్వామ్య భావధారకు ఫలితమైన సమాజదురాచారాలను వ్యతిరేకించటమే జాషువా ప్రగతిశీలత అని; జాషువా గాంధీ సిద్ధాంతాన్ని, మానవతా సూత్రాల్ని, కరుణ రస ప్రాధాన్యాన్ని విశ్వసించి రచనావ్యాసంగం సాగించారు అన్న అద్దేపల్లి అభిప్రాయాలు జాషువాను అర్ధం చేసుకోవటంలో దోహదపడతాయి.
3. అనుభూతి వాదం ప్రతిపాదన
ప్రముఖ కవి తిలక్ ను అనుభూతికవిగా, భావకవిగా అద్దేపల్లి దర్శిస్తారు. “అనుభూతి వాది తిలక్” అనే వ్యాసంలో అనుభవాన్ని, అనుభూతిని వేరుపరచి - అనుభూతి అనేది మనస్సును స్పందింపచేసి ఎక్కువకాలం గుర్తుండిపోయే అంశమంటూ అనుభూతిని నిర్వచిస్తారు. “అనుభూతిని రాస్తున్నట్టి కవులలో ఉపదేశము ఉండదు, ఒక నినాదము ఉండదు. ఒక సిద్ధాంతము ఉండదు. ఇవన్నీ పై పొరలకు సంబంధించినవి. కాని, లోపలి పొరలకు వెళ్ళినపుడు అవి అనుభూతి అవుతుంది” అంటూ అనుభూతి వాదాన్ని విశదపరుస్తారు. తిలక్ కవిత్వంలో కనిపించే వివిధ అనుభూతుల్ని ఉదహరిస్తూ సాగుతుందీ వ్యాసం. ఈ రకమైన కవిత్వాన్ని రాయటాన్ని "అనుభూతివాదం" అనొచ్చని ప్రతిపాదిస్తారు అద్దేపల్లి.
తెలుగు సాహిత్యచరిత్రలో ప్రధమంగా అనుభూతిని నిర్వచించటం దాని ఆధారంగా కవిత్వాన్ని విశ్లేషించటం, అట్టి కవిత్వానికి అనుభూతి వాదమని పేరుపెట్టటం చేసింది శ్రీ అద్దేపల్లే.
భావకవిగా తిలక్ అనే మరో వ్యాసంలో భావకవిత్వం సౌందర్యప్రధానమని, తిలక్ శైలిలోనే గొప్ప సౌందర్యం ఉంటుందని అదే విధంగా తిలక్ లో అభ్యుదయ భావాలుకూడా హెచ్చుగానే ఉన్నాయని నిరూపిస్తారు అద్దేపల్లి.
“కృష్ణ శాస్త్రి కవిత్వంలో అనుభూతి ఒక వేదనా స్పర్శతో కూడి ఉంటుంది” అంటారు అద్దేపల్లి. అంతే కాక ఒక వ్యాసంలో “కృష్ణ శాస్త్రి కృష్ణ పక్షం, ఊర్వసి, ప్రవాసం - ఈ మూడు వ్రాసి ఉండకపోయినా, ఒక్క “అన్వేషణము” అనే ఖండిక వ్రాస్తే చాలు, మహాకవిగా నిలబడిఉంటాడు” అంటూ చేసిన ఒక సాహసోపేతమైన వ్యాఖ్య దాన్ని సహేతుకంగా సమర్ధించిన విధానము విమర్శకునిగా అద్దేపల్లి ప్రదర్శించిన అసాధారణమైన సాధికారిక ప్రజ్ఞ.
4. మిని కవిత - శిల్పం శైలి.
ఒకనాటి తెలుగు కవిత్వలోకంలో మిని కవితా ఉద్యమం ఒక ప్రభంజనం. ఆ ఉద్యమాన్ని దాదాపు చేయిపట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రచారం చేసిన వారిలో శ్రీ అద్దేపల్లి ప్రముఖులు. "మినికవిత" అనే పుస్తకంలో మినీ కవితా శిల్పాన్ని, శైలిని సోదాహరణంగా చర్చించారు అద్దేపల్లి. "ఒకే ఒక్క భావాన్ని సాధ్యమైనంత శక్తిమంతంగా, హృదయంలో ముద్రపడేటట్లు, ధ్వనిపూర్వకంగా చెప్పటానికి మినీకవిత ఉపకరిస్తుంది, మిని కవితకు ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వని” అంటూ శ్రీ అద్దేపల్లి ఇచ్చిన నిర్వచనాన్ని నేడు వస్తున్న ఏ రకపు కవితకైనా అన్వయించుకోవచ్చు.
రుబాయీలు, గాలిబ్ గీతాలు, గురజాడ, శ్రీశ్రీ కవితలను ఉదహరిస్తూ మినికవిత్వం అనేది ఎప్పటినుంచో ఉన్న ప్రక్రియేనని నిరూపించే ప్రయత్నం చేస్తారు అద్దేపల్లి.
కొత్తగా ఒక సాహిత్య ప్రక్రియ మొలకెత్తుతున్నప్పుడు దానిని స్వాగతించి, ఆ ప్రక్రియకొక సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించటం విమర్శకుల బాధ్యత. మినికవితోద్యమ సందర్భంగా అద్దేపల్లి ఆ పనిని ఈ పుస్తకం ద్వారా సమర్ధవంతంగా నెరవేర్చారు.
5. దృష్టిపథం - అస్తిత్వ వాదాలపై విశ్లేషణ
వివిధ అస్తిత్వవాదాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న సందర్భంలో దళిత, బహుజన, స్త్రీవాద రచనలపై వ్రాసిన విశ్లేషణాత్మక వ్యాససంపుటి “దృష్టిపథం”. ఈ పుస్తకంలో దళితవాద, స్త్రీవాద, పోస్ట్ మోడర్నిజం పుట్టుపూర్వోత్తరాలను లోతుగా చర్చించి, వాటి అవసరతను, బాధ్యతలను గుర్తుచేస్తారు. ఈ సంపుటిలో బొజ్జాతారకం గారు వ్రాసిన "నదిపుట్టిన గొంతుక" లోని తాత్వికధార తెలుగు ఆధునిక దళిత అస్తిత్వవాదానికి పునాదిగా నిలిచింది అని చేసిన ప్రతిపాదన అపూర్వమైనది.
ఈ పుస్తకంలో శ్రీ అద్దేపల్లి - ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీ బానిస అయితే బూర్జువా వ్యవస్థలో ఒక వస్తువు; పోస్ట్ మోడర్నిజం ఒక అవాంఛనీయ ధోరణి; దళితకవిత్వం ఒక ఉద్యమ కవిత్వంగా మారుతుందని మొదట్లోనే అంచనా వేయటం -లాంటివి వీరి సామాజిక అవగాహనకు నిదర్శనం.
తెలుగు సాహిత్యవిమర్శనా పుస్తకాలలో దృష్టిపథం అత్యంత విలువైనది, ఆధునిక తెలుగు కవిత్వరీతులను అధ్యయనం చేయటానికి ఇదొక దిక్సూచి.
6. అభ్యుదయ విప్లవ కవిత్వాలు-సిద్ధాంతాలు; శిల్పరీతులు
శ్రీ అద్దేపల్లి గారు తమ డాక్టరేట్ కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఇది. తెలుగు సాహిత్యరంగానికి సంబంధించి అభ్యుదయ, విప్లవ కవిత్వాల యొక్క సిద్ధాంత చర్చలు ఎక్కువగా జరిగాయి తప్ప, వాటిలోని శిల్ప సమీక్ష పెద్దగా జరగలేదు. నిజానికి అదొక ఖాళీ ప్రదేశం. దిశానిర్ధేశనం చేయటానికి ఎటువంటి పూర్వరచనలు అందుబాటులో ఉండవు. అటువంటి టాపిక్ తీసుకోవటం సాహసోపేతమైన చర్య. ఒక రకంగా సవాలు కూడా. శ్రీ అద్దేపల్లి ప్రతిభ కలిగిన సాహసి కనుక ఈ టాపిక్ ను తమ డాక్టరేట్ కొరకు ఎంచుకొని ఆ లోటును ఈ సిద్ధాంతగ్రంథం ద్వారా సమర్ధవంతంగా పూరించారు.
7. కుందుర్తి కవితా వైభవం
కుందుర్తి ఆంజనేయులు గారి కవిత్వాన్ని సమగ్రంగా చర్చించిన పుస్తకమిది. కుందుర్తి అచ్చమైన ప్రజాకవి అని, కథా కథన పద్దతిలో ధ్వని మార్గాన్ని అనుసరించిన కవి అని, వ్యంగ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొన్నాడు అని శ్రీ అద్దేపల్లి చేసిన ప్రతిపాదనలు ఎంతో ఖచ్చితమైనవి, విలువైనవి.
8. సమకాలీనత
సాహిత్య విమర్శకుడు తప్పని సరిగా తనకాలంలో వస్తున్న వివిధ అంతర్జాతీయ రచనలను, వాటిపై వస్తున్న విమర్శను నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇది అద్దేపల్లి వారు జీవిత పర్యంతమూ సాగించారు. శ్రీశ్రీని విమర్శించేటపుడు ఆనాటి టి.ఎస్. ఇలియట్ తో పోల్చటం; కృష్ణశాస్త్రిని విశ్లేషించేటపుడు ఠాగూర్ శైలిని ప్రస్తావించటం; తిలక్ వద్దకు వచ్చేటపుడు ఇమేజిస్ట్ సిద్ధాంత సారాంసాన్ని అన్వయం చేయటం; జాషువా కవిత్వాన్ని వివరించాల్సి వచ్చినపుడు భారతీయ భూస్వామ్య, కుల వ్యవస్థలలో అతని కవిత్వ మూలాల్ని అన్వేషించటం; స్త్రీవాదాన్ని, పోస్ట్ మోడర్నిజం, దళిత, మైనారిటీ వాదాల్ని విశ్లేషణ చేసేటపుడు ప్రపంచీకరణ, హ్యూమన్ రైట్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను చర్చించటం - అద్దేపల్లి కాలానుగుణ పరిణామశీలతను, నిరంతర అధ్యయనాన్ని, కాలిక స్పృహను మనకు పట్టిచూపుతాయి.
***
అనేక వందల పుస్తకాలకు అద్దేపల్లి వ్రాసిన ముందుమాటలలో ఎక్కువగా ఆ కవిత్వంలోని మంచిని వెలికితీసి చూపేవారు. ఇది వారి ఔదార్యానికి, ఔచిత్యానికి నిదర్శనం.
నలభై ఏళ్ళపాటు సాగిన శ్రీ అద్దేపల్లి విమర్శనాయానాన్ని గమనిస్తే- ఈయన ఆయా కాలాలలో వచ్చిన అన్ని ధోరణులను అధ్యయనం చేసి, వస్తువుతో పాటు కవి భావాల్ని, అతని పదాలకున్న శక్తిని, అతని శైలిని, శిల్పాన్ని మొదలైన అన్నింటిపై లోతైన విశ్లేషణలు చేసిన "సమగ్ర కళా విమర్శకుడు" గా దర్శనమిస్తారు.
బొల్లోజు బాబా
ఉపయుక్త గ్రంథాలు
1. అద్దేపల్లి రచనలు సమగ్రపరిశీలన – సిద్ధాంత గ్రంథం శ్రీ వాసా భూపాల్
2. డా. అద్దేపల్లి సారస్వత సమీక్షా దర్శిని
3. డా. అద్దేపల్లి రామమోహన రావు రచనలు
4. సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి
5. అద్దేపల్లి వైమర్శిక ప్రస్థానం ఆదర్శనీయం – తంగిరాల చక్రవర్తి

Saturday, September 12, 2020

Imported post: Facebook Post: 2020-09-12T23:11:31

చరిత్రలో కన్యాశుల్కం వివాహవ్యవస్థ సమాజంలో అతి ముఖ్యమైనది. ఒక యువకుడు గృహస్థాశ్రమ దశలో భార్యతో కలిసి ధార్మికవిధులను, తన ఫూర్వీకులకు సంబంధించిన కర్మకాండలను నిర్వహిస్తూ జీవించాలని వేదాలలో చెప్పబడింది. స్త్రీ పురుషులిద్దరకూ సమాన హోదా ఇవ్వబడింది. అర్ధాంగి అనే మాట అప్పటిదే. భార్యాభర్తలిరువురు ఒకేదేహంలోని ఇద్దరు వ్యక్తులు కనుక, భర్తచనిపోతే ఇంకా సగభాగం బ్రతికే ఉన్నట్లే, అట్టి భర్తృహీనకు భర్తఆస్తిలో హక్కు ఉంటుందని స్మృతులు చెప్పాయి. స్త్రీల పట్ల ఆనాటి చట్టాలు చూపిన సమానత్వమది. మధ్య యుగాలకు వచ్చేసరికి సమాజంలో స్త్రీ స్థానం తారుమారు అయ్యింది. పురుషాధిక్య సమాజంలో ఒక విలాస వస్తువుగా మారింది. రాజులు, సంపన్నవర్గాలు అంతఃపుర స్త్రీల (Harem) పేరిట వేలకొలది యువతులను తమ ఆధీనంలో ఉంచుకోవటం; బహుభార్యత్వము; చట్టబద్ద వ్యభిచార గృహాలకు అవసరమైన స్త్రీలకొరకు పెద్దఎత్తున సమాజంలో యువతుల అపహరణాలు జరుగుతూ ఉండటం - లాంటి వివిధ కారణాల వల్ల ఒక సమయంలో స్త్రీల సంఖ్య విపరీతంగా పడిపోయింది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని యువకులకు పెండ్లాడాలంటే ఆడపిల్లలకు కరువు ఏర్పడింది. ఈ కాలంలోనే కన్యాశుల్కం అనే ఆచారం వచ్చిఉంటుంది. కన్యాశుల్కం ఆచారం అంటే ఆడపిల్లల తండ్రులకు కొంత ధనం చెల్లించి వారి అమ్మాయిలను పెండ్లిచేసుకోవటం. అలా చెల్లించిన ధనానికి కన్యాశుల్కం/ఓలిసుంకం/ఓలి మర్యాద అని వివిధ పేర్లు. . పదహారో శతాబ్దంలో Linschoten అనే డచ్ వ్యాపారి ఆంధ్రదేశాన్ని సందర్శించినపుడు "ఇక్కడ ఆడపిల్లలకు 7 సంవత్సరాలలోపు, మగపిల్లలకు తొమ్మిది సంవత్సరాలలోపు వివాహాలు అయిపోతాయి. అమ్మాయిలకు యుక్తవయసు వచ్చిన పిదప మాత్రమే కాపురానికి పంపించటం జరుగుతూన్నది" అన్నాడు. మనుస్మృతిలో స్త్రీ వివాహ వయస్సు 12 లేదా 18 సంవత్సరాలుగా చెప్పబడింది. యజ్ఞయాగాదులు, పితృదేవతల కర్మకాండలు ఇతర పూజాదికాలు సతీ సమేతంగా నిర్వహించవలసి ఉంటుంది కనుక ముప్పై ఏండ్ల వయసు ఉన్న పురుషుడు, తన ధార్మిక విధులు నిర్వహించటానికి అత్యవసర పరిస్థితులలో 8 ఏండ్ల బాలికను వివాహమాడవచ్చునని మినహాయింపు ఇచ్చింది (Olivelle 2005, p. 194). లౌకిక వ్యవహారాలను నిర్వహించటానికి స్త్రీలకు కనీసం 12 సంవత్సరములు, పురుషులకు 16 సంవత్సరములు ఉంటేనే వారు అర్హులని కౌటిల్యుని అర్ధశాస్త్రం చెప్పింది. మన ప్రాచీన ధర్మశాస్త్రాలలో ఎక్కడా Linschoten వర్ణించినట్లు అమ్మాయిలకు ఏడు సంవత్సరాల వయసులోపు చేసే బాల్య వివాహాల ప్రసక్తి లేదు. మధ్యయుగాలలో ఏర్పడిన సామాజిక పరిస్థితుల వల్ల బాల్యవివాహాలు అనేవి ఒక రకంగా కరువు కాలంలో "ముందస్తు ఒప్పందాల" వంటివి అని భావించవచ్చు. ఈ కన్యాశుల్క ఆచారం వల్ల ఒకనాటి మధ్యతరగతి యువకులు ఎలా నలిగిపోయారో కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది. *** విజయవాడ మల్లేశ్వర ఆలయంలో క్రీశ. 1553 నాటి ఒక శాసనములో- కొండపల్లినుండి రాజమహేంద్రవరం వరకూ ఉన్న ప్రజలందరూ (తెలగాలు?) పెండ్లికొడుకు తరపువాళ్ళైతే "ఓలి మర్యాద" గా 21 బంగారు మాడలు, పెండ్లికూతురు తరపువాళ్ళు 12 వెండి మాడలు ఇచ్చిపుచ్చుకోవాలని; పెండ్లికూతురుకి రెండవపెండ్లి అయితే మగపెళ్ళివారు పన్నెండు వెండిమాడలు, రెండు బంగారు మాడలు ఇవ్వాలని దీన్ని ఎవరు తప్పినా హీనవాదులు" అని ఉన్నది. (శా.నం. 337 of 1892). మగ పెండ్లివారు అధిక మొత్తాన్ని ఆడపెండ్లివారు నామమాత్రంగా కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం గమనించవచ్చు. అప్పట్లో ఇలా జరిగే బాల్య వివాహాలకారణంగా చిన్న వయసులోనే స్త్రీలు వైధవ్యం పొందేవారు. అలాంటి వారికి పునర్వివాహం చేయటానికి ఎలాంటి ఆక్షేపణా ఉండేదికాదు. అలాంటి వివాహాలకు తక్కువ ఓలి ఉండేది. నిర్ధిష్టమైన కట్నకానుకలను నిర్ణయించటం ద్వారా ఆనాటి సంఘం తన సభ్యుల హెచ్చుతగ్గుల్ని క్రమబద్దం చేయటానికి ప్రయత్నించేదని అర్ధమౌతుంది. *** పూర్వం రాజుల ప్రాపకం పొందిన వారికి రాజు కొన్ని గ్రామాలను దానం చేసేవాడు. వారు ఆ గ్రామాలు కట్టే పన్నులను వసూలు చేసుకొంటూ జీవనం సాగించేవారు. తమ మగపిల్లలకు వివాహం చేయవలసిన సందర్భాలలో తమకు హక్కుకలిగిన గ్రామాలను కన్యాశుల్కం క్రింద దానం చేసేవారని శాసనాలలో కనిపిస్తుంది. విజయనగర రాజుల పాలనలో క్రీశ. 1379 నాటి శాసనంద్వారా నంబి ఇరవ శెట్టియార్ తనకు హక్కుభుక్తంగా ఉన్న పసింగైపల్లి అనే గ్రామాన్ని తనమనవడైన కేశవ శెట్టియార్ కు వివాహం నిమిత్తం ఆచంద్రతారార్కం ఉండేలా దానం ఇచ్చాడు. అంటే మనవడి పెండ్లి ఖర్చులను తాత భరించినట్లు అర్ధం చేసుకోవాలి. ఆచంద్రతారార్కం అంటే ఒక రకంగా ఆ గ్రామంపై తనకు ఉన్న అన్ని హక్కులను ఒదులుకొన్నట్లే. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol IX, pn 102) క్రీశ. 1404 నాటి ఒక శాసనములో అచ్చప్ప కొడుకు విత్తప్ప అనే వ్యక్తి "తన వివాహఖర్చులకొరకు" కౌదవల్లి అనే గ్రామాన్ని 300 బంగారునాణాలకు (Hon coins), నరశింహదేవ కుమారుడైన శుంగప్పకు విక్రయించినట్లు కలదు. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol VIII, pn 190). క్రీశ. 1424 నాటి శాసనములో ఆళ్వప్రభు బొమ్మియక్క అనే వ్యక్తి బోవన్న అయ్య అనే ఆలయపూజారికి కొంతభూమిని "తన వివాహ నిమిత్తం" విక్రయించినట్లు కలదు. (ibid p 199) పై శాసనముల ద్వారా మగపిల్లల వివాహం అనేది ఖర్చుతో కూడుకొన్నదని, కన్యాశుల్కధనం కొరకు ఆస్తులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అర్ధమౌతుంది. "ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెండ్లాడితే ఇంటి కుండలన్నీ పగలకొట్టిందట" అనే సామెతలో ఆనాటి మధ్య, దిగువమధ్యతరగతి పెండ్లికొడుకులు సామాజికంగా ఎదుర్కొన్న వ్యధంతా దాగిఉన్నది. ( ఈ సామెతలోని body shaming కి ఈ రచయిత వ్యతిరేకం) *** మెకంజీ సేకరించిన గ్రామ కైఫియ్యతులలో వివిధ కులాలలో అమలులో ఉన్న కన్యాశుల్క ప్రస్తావనలు కలవు. ఇవి భిన్న కులాలకు భిన్న విలువలతో ఉండటాన్ని గమనించవచ్చు. * వక్కలిగర్ కులస్థులలో ఓలి మర్యాద 12 వరహాలు. వితంతువు అయితే 6 వరహాలు. * తెలుగు బానాజిగర్ కులస్థులలో పెండ్లికూతురికి ఓలి 8 వరహాలు. పెళ్ళి నిశ్చయమయ్యాక, జ్యోతిష్యుడు నిర్ణయించిన సమయానికి పెండ్లికుమారుని బృందం పెండ్లికుమార్తె ఇంటికి వెళ్ళి ఆ ధనాన్ని ఇస్తారు. ఆ మరుసటి రోజు ఆ దంపతులను ఊరంతా ఊరేగించి వివాహం జరిపిస్తారు. * కుంభకార కులాలలో ఓలి మర్యాద 3 వరహాలు. మేనరికాలకు మొదటి అవకాశం ఇవ్వాలి. పెండ్లికూతురు వితంతువు అయితే ఓలి మర్యాద 1 వరహా. * వడ్డెరలలో ఓలి 2 వరహాలు, మారుమనువు అయితే 1 వరహా. వీరి ముహుర్తాలను జోగినిలు నిర్ణయించెదరు. (ref: Summaries of the Mackenzie collection vol II) కన్యాశుల్కం అనేది ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే చెందిన ఒక దురాచారంగా తెలుగునాట స్థిరపడిపోయింది. కానీ ఈ ఆచారాన్ని ఆనాటి సమాజంలోని ఇతర కులాలు కూడా పాటించేవని మెకంజీ కైఫియ్యతులద్వారా అర్ధమౌతుంది. *** విజయనగర రాజు ప్రతాపదేవరాయలు చెంగల్పట్టు, మంగాడు అనే గ్రామంలో స్థానికులతో కలసి వేయించిన ఒప్పంద శాసనము చాలా ఆసక్తికరం. దీనిలో వివాహసందర్భంగా ఆ గ్రామానికి చెందిన భూములను స్థానికేతరులకు సంక్రమింపచేయరాదని ఉన్నది. (శా.నం.354 of 1908). ఈ శాసనం ఆనాటి గ్రామసంఘాలయొక్క కట్టుబాటును తెలియచేస్తుంది. బహుసా ఆడపిల్లల తండ్రులు తమకూతురికి కన్యాశుల్కంగా ఇవ్వబడిన భూముల యాజమాన్యహక్కులను పదిలపరచుకొనే ప్రయత్నంలో ఆ గ్రామంలో ఏవో ఘర్షణలు జరిగి ఉంటాయి. కన్యాశుల్కమంటే ఆడపిల్లలను అమ్ముకోవటంగానే ఒకనాటి సమాజం చూసిందని అనుకోవాలి. *** కన్యాశుల్క ఆచారం గురించి అప్పట్లోనే ప్రజలలో నిరసన ఉండేదనటానికి కూడా ఒక శాసనం ఆధారంగా నిలుస్తుంది. ఆనాటి సమాజ చైతన్యాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక శాసనమిది. క్రీశ 1425, వీరప్రతాప దేవరాయలు పాలనలో పడైవీడు ప్రాంతానికిచెందిన కన్నడ, తమిళ, తెలుగు బ్రాహ్మణులందరూ కలసి ఒక తీర్మానం చేసుకొన్నారు. దీనిప్రకారం "వారి కుటుంబాలమధ్య జరిగే వివాహాలు కన్యాదాన పద్దతిలో మాత్రమే జరుపుకొనేటట్లు, పెండ్లికూతురుతండ్రి ధనాన్ని స్వీకరించినా లేక పెండ్లికొడుకుతండ్రి ధనాన్ని ఇవ్వచూపినా వారిని కులం నుండి వెలివేయటం జరుగుతుందని; ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు కన్యాదానపద్దతి వివాహమే అనుమతించబడినదని; దీన్ని అతిక్రమించేవారు రాజదండనకు పాత్రులు అని వ్రాసుకొని సంతకాలు పెట్టుకొని, ఆ తీర్మానాన్ని తమిళనాడులోని వెల్లూరు వద్దకల విరించిపురం ఆలయగోపురం లోపలిగోడపై ఒక శాసనంగా వేయించారు. (శా.నం.49 of 1887) ఈ శాసనం ద్వారా ఒకప్పుడు ప్రజాసమూహాలు తమకు సంబంధించిన ఆచారవ్యవహారాలను ప్రజాస్వామ్యయుతంగా రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండేవారని తెలుస్తుంది. శాసనం దిగువ దీనికి ఒడంబడిన గ్రామపెద్దల వివరాలు, వారి ఊరిపేర్లతో సహా ఉన్నాయి. ఇది ఒకరకంగా పెద్దమనుషుల ఒప్పందం లాంటిది. అది రాజామోదం పొందటం గమనార్హం. ఈ అమరిక ఇతరప్రాంతాలకు విస్తరించినట్లు లేదు. *** మధ్యయుగాలలో మధ్యతరగతి వర్గాలు వివాహం చేసుకోవాలంటే భరించాల్సిన మరో కష్టం పెండ్లి సుంకం. అప్పట్లో సాధారణంగా పెళ్ళిళ్ళు ఆలయాలలో జరిగేవి. అలా చేసుకొన్నందుకు అప్పటికి అమలులో ఉన్న చట్టాలప్రకారం పెండ్లి సుంకం చెల్లించాలి. దీన్ని ఆడ మరియు మగ పెండ్లి వారు ఇరువురూ కట్టవలసి ఉంటుంది. పెండ్లి సుంకం వసూలు చేయటం చోళులకాలం నుంచి ఉన్నది. పెండ్లి సుంకం కాక వివాహ సందర్భంలో జరిపే ఉరేగింపు, పెళ్లిపందిరులు, వివాహవేడుకలు, పల్లకి యాత్రలకు వంటి వివిధ అంశాలకు విడి విడి పన్నులు వసూలుచేసేవారు. రొంపిచర్ల, వేణుగోపాల స్వామి ఆలయంలో క్రీశ. 1264 నాటి ఒకశాసనములో, ఆ ఆలయములో వివాహము జరుపుకొన్నందుకు ఒక బంగారు మాడ పెండ్లిసుంకము, 13 పోకలు, ఒక కట్ట తమలపాకులు స్వామివారికి సమర్పించుకోవాలని ఉన్నది. ఆలయమునకు పెండ్లి సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ బాగోగులకై వెచ్చించేవారని నరసారావుపేట పమిడిపాడు వల్లభరాయ ఆలయంలో క్రీశ 1154 లో వేయించిన ఒక శాసనము ద్వారా తెలుస్తున్నది. (శానం.347 of 1915) మెకంజీ సేకరించిన సంజీవిపల్లె కైఫియత్తులో గండికోట ను ఏలుతున్న పెమ్మసాని తిమ్మనాయుని కాలంలో కర్నగొల్లలు పేదరికముచేత 101 మాడల పెండ్లిసుంకము చెల్లించలేక అవివాహితులుగా ఉండిపోతున్నారని, వారి దుస్థితిని గమనించిన సదాశివరాయలు పెండ్లిసుంకాన్ని 16 మాడలకు తగ్గించాడనే ఉదంతం కలదు. ఈ ఉదంతం ద్వారా పెండ్లిసుంకం సామాజికంగా ఏ విధమైన ప్రభావం కలిగించేదో స్పష్టమౌతుంది. (Summaries of the Mackenzie collection vol II p.no 182) పెండ్లి సుంకమును వివిధ శుభసందర్భాలలో ప్రజలకు కానుకగా ప్రభువులు రద్దుచేయటం జరిగేది. క్రీశ.1510 లో కృష్ణదేవరాయలు వేయించిన ఒక శాసనములో విజయనగర సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో అన్నికులాల వారికి పెండ్లి సుంకము రద్దుచేసినట్లు ప్రకటించాడు. (శా.నం.387 of l904) *** క్రీశ. 1870 లో విశాఖపట్నానికి చెందిన G. Vedanthachary అనే మహాశయుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్రాసిన ఒక లేఖలో " ఈ కన్యాశుల్క దురాచారం వల్ల జరుగుతున్న బాల్యవివాహాల కారణంగా స్త్రీలు చిన్నవయసులోనే వితంతువులుగా మారుతున్నారని, ఈ ఆచారంపై నిషేదం విధించాలని" విన్నవించాడు. 1887 లో విజయనగర మహారాజు గారు చేయించిన ఒక సర్వేలో అక్కడ ఏటా 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నాయని, వధువులు ఎక్కువగా అయిదేండ్ల లోపుబాలికలు అని తేలింది. బహుశా ఈ సర్వే ఫలితాలు శ్రీ గురజాడ అప్పారావు గారు చూసే ఉంటారు. కన్యాశుల్కం నాటకం వ్రాయటానికి ప్రేరణ పొంది ఉండొచ్చు. ఆ తరువాతి క్రమంలో కన్యాశుల్కం బదులుగా వరకట్న ఆచారం పెచ్చరిల్లింది. నిజానికి స్త్రీలకు వివాహ సమయంలో స్త్రీ ధనం రూపంలో బహుమతులు ఇచ్చే పద్దతి అనాదిగా ఉన్న సంప్రదాయమే. అది ప్రేమతో, స్త్రీ స్వావలంబనను పెంచే ఆచారంగా అనుకోవచ్చు. కానీ నేటి వరకట్న డిమాండ్, వేధింపులు సామాజిక రుగ్మతలు. గత శతాబ్దంతో పోల్చితే పరిస్థితులు కొద్దికొద్దిగా మారుతున్నాయి. ఇదొక శుభపరిణామం. బొల్లోజు బాబా

Thursday, September 10, 2020

Imported post: Facebook Post: 2020-09-10T22:42:03

భిన్న మతాలలో వినాయకుడు . హిందూ మతంలో గణేషుడు విఘ్నాధిపతిగా అతి ముఖ్యమైన పాత్రపోషించే దైవం. గణాధిపతి మొదటగా ఎక్కడ ప్రస్తావించబడ్డాడనే దానిపై చరిత్రకారులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. *Alice Getty అనే చరిత్రకారిణి, గణేషుడు ద్రావిడులకు చెందిన దైవమని అభిప్రాయపడింది. *దక్షిణానికి వచ్చిన ఆర్యులు ఇక్కడి ఏనుగులను చూసి అంతటి శక్తి తమకివ్వమని ఆ రూపంలో గణేషుని కల్పన చేసుకొన్నారని మరికొందరి అభిప్రాయం. (Haridas Mitra). *Aravamutham వంటి వారు వేదాలలో గణేషుని మూలాలున్నాయని భావించారు. 1. వేదాలలో గణేషుడు రుగ్వేదం లో చెప్పబడిన గణేషుడు బ్రహ్మనస్పతి అని నేడు మనం కొలుస్తున్న గజముఖుడు, ఏకదంతుడు, లంబోదరుడు, శివపార్వతుల తనయుడైన వినాయకుడు కాదు అని ఒక వర్గం; వేదాలలో ఉన్న "గణానాంత్వా గణపతిగుం హవామహే.... శ్లోకంలో గణాధిపతిగా గణేషుడు కలడని, ఇతడే బ్రహ్మనస్పతి గా చెప్పబడ్డాడని మరొక వర్గం ఎవరికివారు తమ తమ వాదనలలో నిలువునా విడిపోయారు. ఇది ఎప్పటికీ తెగని వాదం. రామాయణ, మహాభారతాలలో వినాయకుని ప్రస్తావన ఎక్కడా లేకపోవటం గణేషుని కాలాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. (వ్యాసునికి లేఖకునిగా వినాయకుడు ఉండటం అనే గాథ తొమ్మిదో శతాబ్దానిది అంటారు. ) చరిత్రపరంగా చూడవలసి వస్తే... క్రీశ. 485 లో విష్ణుకుండిన రాజైన మాధవవర్మ వేల్పూరు లో వేయించిన ఒక శాసనములో మొదటి సారిగా వినాయకుని ఆలయనిర్మాణము గావించి అందులో "దంతిముఖ స్వామి" విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఉన్నది. దక్షిణభారతదేశములో వినాయక ఆలయాలను గురించి లభించే మొట్టమొదటి శాసనమిది. వేంగిచాళుక్యల కాలంలో (ఆరోశతాబ్దం) బిక్కవోలు వద్ద నిర్మించిన వినాయకాలయం ప్రాచీన గణపతి ఆలయాలలో ప్రముఖమైనది. ఇక ఆ తరువాత ఏడో శతాబ్దం నాటి శంకరాచార్యుడు ప్రవేశపెట్టిన "పంచాయతన పూజ" పద్దతికి అనుగుణంగా శివాలయమైనా, వైష్ణవాలయమైనా గణపతి మందిరం తప్పనిసరిగా ఉంటూ వచ్చింది. ఏ వాదన ఎలా సాగినప్పటికీ గణేష ఆరాధనకు సంబంధించిన గణాపత్య శాఖ (Ganapatya) క్రీశ. 4 వ శతాబ్దంలో వృద్ధిలోకి వచ్చి గణేష ఆరాధన భారతదేశంలోనే కాక శ్రీలంక, నేపాల్, బర్మా, చైనా, జపాన్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది. బౌద్ధ, జైన మతాలలో కూడా గణేషుని గురించి స్పష్టమైన ఉల్లేఖనలు కనిపిస్తాయి. . 2. బౌద్ధంలో గణేషుడు క్రీపూ రెండొ శతాబ్దానికి చెందిన అమరావతి బౌద్ధ స్థూపంపై ఏనుగుశిరస్సు కలిగిన యక్ష శిల్పాలు గణేషునికి సంబంధించిన తొట్టతొలి రూపంగా చరిత్రకారులు భావిస్తారు (C. Sivaramamurthy). కొన్ని బౌద్ధగాథలలో వినాయకుడు అన్నమాట బుద్ధునికి పర్యాయపదంగా వాడటం జరిగింది. (అమరుకోశం). విశాఖపట్నం సమీపంలో కల బొజ్జన్నకొండ వద్ద కల క్రీశ 5/6 శతాబ్దానికి చెందిన బౌద్ధారామం ముంగిట వద్దకూడా వినాయకుని విగ్రహం ఉన్నది. శ్రీలంక లో ఒకటో శతాబ్దానికి చెందిన Mihintale బౌద్ధచైత్యంలో నేడు మనం చూస్తున్న ఆకారంలో గణేషుడు ప్రప్రధమంగా కనిపిస్తాడు. పీఠంపై కూర్చున్న భంగిమలో, లంబోదరంతో, ఏకదంతంతో ఉండే ఈ గణపతి విగ్రహం నేడు మనం పూజిస్తున్న విగ్రహానికి ప్రొటోటైప్ లాంటిదని చరిత్రకారులు భావిస్తారు. (IK Sarma). క్రీశ 5 శతాబ్దానికి చెందిన సారనాథ్ బుద్ధుని నిర్యాణసందర్భాన్ని చిత్రించే శిల్పాలలో గణేషుడు తన సోదరుడైన కార్తికేయునితో ఇంకా నవగ్రహాల ప్రతిమలతో బుద్ధుని చూస్తున్నట్లు ఉంది. బౌద్ధ శిల్పకళ క్రమక్రమంగా హిందూ శిల్పకళగా రూఫాంతరం చెందుతున్న కాలాన్ని ఈ ప్రతిమ నిక్షిప్తం చేస్తుంది. బౌద్ధమతంలో జనామోదం పొందిన పేరుగా వినాయకుడు అనే నామం హిందూదేవగణంలోకి ప్రవేశించి ఉంటుందని. KK Datta అభిప్రాయపడ్డారు. (Proceedings of the Indian History Congress Vol XXII). . 2. జైన గణేషుడు విఘ్నాలను తొలగించి, విజయం అనుగ్రహించే దైవంగా జైనులు గణేషుని కొలిచేవారు. దేవతలు కూడా తమకార్యాలు సఫలం అవ్వాలని గణేషుని ప్రసన్నం చేసుకొంటారు అంటూ జైనాచార్యుడు, వర్ధమానసూరి తన ఆచారదినకర అనే గ్రంధంలో అన్నాడు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మధుర, రాజస్థాన్ లోని Ranakpur లాంటి జైనాలయాలలో గణేషుని శిల్పాలు నేటికీ చూడవచ్చును. *** ఒకే కథనో, బోధననో హిందువులు, బౌద్ధులు, జైనులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా భాష్యం చెప్పుకొన్నారు. మధ్యయుగాల వరకూ అందరూ ఒకే భావధారను పంచుకొన్నారు. ఒకే దేవుళ్లకు, దేవతలకు తమ ధార్మికగ్రంధాలలో తోచినరీతిలో స్థానాన్ని కల్పించుకొన్నారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ నేలపై విలసిల్లిన భిన్న ఆధ్యాత్మిక మార్గాలు ఆదానప్రదానాలు చేసుకొన్నాయి. సింధులోయనాగరికతనుంచే భారతదేశంలో భిన్న సంస్కృతుల మేళనం మొదలైంది. ఈ సమ్మేళనం గురించి పార్శీలు ఒక కథ చెపుతారు. కొంతమంది పార్శీలు ఒక నగరానికి వచ్చినపుడు అక్కడి రాజు ఒక నిండిన పాలగ్లాసును పంపి, ఈ నగరంలో చోటులేదు అని అన్యాపదేశంగా చెప్పాడట. దానికి ఆ పార్శీ బృందం ఆ పాలగ్లాసులో చక్కెర వేసి తిరిగి ఆ రాజుకు పంపారట. దాని అర్ధం మేము ఇక్కడి ప్రజలతో పాలు చక్కెరల్లా కలిసిపోతాము, అంతే కాక తీపిదనాన్ని కలిగిస్తాము అని. అలాగే ప్రాచీన భారతదేశ చరిత్రను గమనించినపుడు, బౌద్ధులు, జైనులు, శక్తేయులు, చార్వాకులు, కాపాలికులు, గణాపత్య, గిరిజనులు, సనాతన ధార్మికులు అందరూ శతాబ్దాలపాటు కలిసిమెలిసి సహజీవనం సాగించారు. అన్ని మార్గాల మధ్యా మానవాభ్యుదయానికి సంబంధించిన ఉత్తమవిలువల ప్రసరణం జరిగింది. ఇదే సంప్రదాయం ముస్లిములు ఈ నేలపై అడుగుపెట్టిన తరువాత కూడా హిందూమతం తన అనాది బహుళత్వాన్ని ప్రదర్శించటాన్కి ఒక ప్రయత్నం చేసినట్లు అర్ధమౌతుంది. వెంకటేశ్వర స్వామికి బీబీనాంచారిని కట్టబెట్టటం, సూఫీలను, పీర్ల పండుగలను హిందువులు సమాదరించటం, మాలిక్ నైబు ను మల్కిభరామునిగా కీర్తించటం లాంటివి చాచిన స్నేహహస్తాలవంటివి. బొల్లోజు బాబా



Monday, September 7, 2020

"On Making Tea" by Rohith

 "On Making Tea" by

Rohith
ఇస్మాయిల్ గారు ఓ కవితలో తేనీరు సమయంగురించి చెపుతారు. ఒక మామూలు అనుభవాన్ని కవిత్వంలోకి తెచ్చేపద్దతికి అదొక చక్కని ఉదాహరణ.
చాన్నాళ్లకు మరలా టీ గురించి చదివిన గొప్ప కవిత ఇది.
Rohith అచ్చమైన తెలుగబ్బాయి.... ఇంగ్లీషులో కవిత్వం రాస్తారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురింపబడ్డాయి ఇతని కవితలు.
వొలుచుకొన్న కొలదీ పొరలు పొరలుగా విచ్చుకొంటూ చివరకు వచ్చేసరికి ఒక గాఢ జీవనపరిమళంమేదో గుండెల్ని కుదిపేస్తుంది. Life goes on for every one. For a poet it is like a rebirth at each move. This poem captures such moment brilliantly.
***
టీ కాచుకోవటం గురించి - "On Making Tea" by Rohith
మొదట్లో మా నాయినమ్మ
టీ తో నన్ను నిద్రలేపేది
అది ప్రతీసారి ఒకే రుచిని కలిగి ఉండేది
తూకమేసినట్లు తియ్యదనం
పాలు.
ఒకరోజు, ఆమె గతించాక
ఈ ప్రపంచంతో అంగీకారానికి వచ్చేక్రమంలో
దుఃఖం టీ రుచిలా అనిపించేది:
ఆ రుచిని మరచిపోదామని ప్రయత్నించేవాడిని
కానీ టీ తాగిన ప్రతీసారి- ఒక పరాయితనాన్ని
రుచి చూస్తున్నట్లు ఉండేది, అది నేరుగా నన్ను
మా నాయినమ్మ వద్దకు తీసుకొనిపోయేది.
ఆ పరాయితనం నాలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది
అది నాకొక కొత్త చర్మాన్ని ఇచ్చింది. వేరే పొర.
మెల్లమెల్లగా నేను టీ తయారుచేసుకోవటం
నేర్చుకొన్నాను.
ఖచ్చితమైన పాళ్లలో... నా సొంత టీ.
Source: On Making Tea by Rohith
అనువాదం: బొల్లోజు బాబా

Sunday, September 6, 2020

Imported post: Facebook Post: 2020-09-06T19:27:19

సమగ్ర కళా విమర్శకుడు - శ్రీ అద్దేపల్లి రామమోహన రావు . (ప్రజాకవి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు జయంతి సందర్భంగా) కవి చేసిన సృజనలోని గుణదోష విచారణ చేయటాన్ని విమర్శ అంటారు. ఆధునిక విమర్శకులలో కట్టమంచి, రాళ్ళపల్లి, విశ్వనాథ, శ్రీశ్రీ కోవలో నిలిచే వ్యక్తి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు. శ్రీ అద్దేపల్లి కవిగా ఎంత లబ్ద ప్రతిష్టులో విమర్శకునిగా కూడా అంతే గొప్ప ప్రతిభావంతులు. వీరు సాహిత్యవిమర్శను ఇలా నిర్వచించారు. "విమర్శ స్థూలంగా రెండు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. మొదటిది కవితా వస్తువు. రెండోది శిల్పం. ఒట్టి వస్తువు మీద మాత్రమే దృష్టి ఉంటే, దానిలో వాచ్యత మాత్రమే ఉంటుంది. ఒట్టి శిల్పం మీద మాత్రమే దృష్టి ఉంటే వ్యక్తికి గాని సమాజానికి గానీ సరైన ప్రయోజనం ఉండదు. అందువల్ల రెంటి మధ్యా సమగ్రమైన సమ్మేళనం ఉంటే అందులో ప్రయోజనం ఉంటుంది. వస్తువు శిల్పమూ ఎక్కడ కలిసిపోతాయో అది గొప్ప కవిత్వం. వస్తువును బాగా చెప్పేదే శిల్పం అవుతుంది. శిల్పం లేని వస్తువే గొప్పదనే వాదానికి పెద్దగా ప్రాముఖ్యం లేదు" అంటారు. ఒక కవిని అంచనా వేయటానికి ఎంతో సహాయపడతాయి పై వాక్యాలు. అవి శ్రీ అద్దేపల్లి వారి సాహిత్యజీవితాన్ని కూడా పట్టిచూపుతాయి . విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి విమర్శనావ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది పై మాటలలో. విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి వెలువరించిన పుస్తకాలు, వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు. 1. శ్రీశ్రీ కవితా ప్రస్థానం శ్రీశ్రీ మహాప్రస్థానంపై వ్రాసిన "శ్రీశ్రీ కవితా ప్రస్థానం" అనే సమీక్షాగ్రంథం శ్రీ అద్దేపల్లి వారి మొదటి విమర్శనా రచన. ఈ పుస్తకంపై రాచమల్లు రామచంద్రా రెడ్డి చేసిన ప్రతివిమర్శ, దానికి అద్దేపల్లి వారు ఇచ్చిన సమాధానం ఆ పై నడచిన చర్చ - అప్పట్లో తెలుగు సాహిత్యప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్లేషించేటపుడు "అక్షరాక్షర పరిశీలన" అనే పదం వాడారు. ఇది అద్దేపల్లి వారు సృజించిన పదమే. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వర్ణిస్తూ "కాల్పనికతకీ, అభ్యుదయానికీ మధ్య ఎర్రని రేఖ" అంటారు. అద్దేపల్లి ప్రతిపాదించిన ఈ మాట నేటికీ ఎంతో విలువైనదిగా భావించవచ్చు. అద్దేపల్లి వారి గొప్పతనం ఎక్కడ ఉందంటే - ఆ తదనంతర కాలంలో శ్రీశ్రీపై చేసిన విమర్శలో ఉండిన "నా లోపాలు కూడా నాకు తెలిసినై" అని అంగీకరించటం. అది అద్దేపల్లి నిత్యచలనశీలతకు సంకేతం. ఇలాంటి వ్యక్తిత్వం విమర్శకులందరికీ గొప్ప ఆదర్శనీయం. 2. మహాకవి జాషువా కవితా సమీక్ష జాషువా వ్రాసిన పుస్తకాలపై అద్దేపల్లి వ్రాసిన విశ్లేషణా వ్యాసాల గ్రంథం పేరు "మహాకవి జాషువా కవితా సమీక్ష". ఈ పుస్తకంలో జాషువా శైలి, శిల్పం, సామాజికత లాంటి అంశాలపై లోతైన చర్చ చేసారు అద్దేపల్లి. సాధారణంగా కులప్రాతిపదికపై జాషువా సాహిత్యాన్ని పరిశీలించటం అందరూ చేస్తారు. కానీ ఎవరూ అంతవరకూ చెప్పని విషయాలను చెప్పటం విమర్శకునిగా అద్దేపల్లి ప్రత్యేకత. పిరదౌసి, ముంతాజ్ మహల్ కావ్యాలలో కథాశిల్పాన్ని చెప్పటం, స్వయంవరం పుస్తకంలో ఉండే రాజకీయ వ్యంగ్యాన్ని గురించి విశ్లేషించటం ఈ కోవకు చెందుతాయి. భూస్వామ్య భావధారకు ఫలితమైన సమాజదురాచారాలను వ్యతిరేకించటమే జాషువా ప్రగతిశీలత అని; జాషువా గాంధీ సిద్ధాంతాన్ని, మానవతా సూత్రాల్ని, కరుణ రస ప్రాధాన్యాన్ని విశ్వసించి రచనావ్యాసంగం సాగించారు అన్న అద్దేపల్లి అభిప్రాయాలు జాషువాను అర్ధం చేసుకోవటంలో దోహదపడతాయి. 3. అనుభూతి వాదం ప్రతిపాదన ప్రముఖ కవి తిలక్ ను అనుభూతికవిగా, భావకవిగా అద్దేపల్లి దర్శిస్తారు. “అనుభూతి వాది తిలక్” అనే వ్యాసంలో అనుభవాన్ని, అనుభూతిని వేరుపరచి - అనుభూతి అనేది మనస్సును స్పందింపచేసి ఎక్కువకాలం గుర్తుండిపోయే అంశమంటూ అనుభూతిని నిర్వచిస్తారు. “అనుభూతిని రాస్తున్నట్టి కవులలో ఉపదేశము ఉండదు, ఒక నినాదము ఉండదు. ఒక సిద్ధాంతము ఉండదు. ఇవన్నీ పై పొరలకు సంబంధించినవి. కాని, లోపలి పొరలకు వెళ్ళినపుడు అవి అనుభూతి అవుతుంది” అంటూ అనుభూతి వాదాన్ని విశదపరుస్తారు. తిలక్ కవిత్వంలో కనిపించే వివిధ అనుభూతుల్ని ఉదహరిస్తూ సాగుతుందీ వ్యాసం. ఈ రకమైన కవిత్వాన్ని రాయటాన్ని "అనుభూతివాదం" అనొచ్చని ప్రతిపాదిస్తారు అద్దేపల్లి. తెలుగు సాహిత్యచరిత్రలో ప్రధమంగా అనుభూతిని నిర్వచించటం దాని ఆధారంగా కవిత్వాన్ని విశ్లేషించటం, అట్టి కవిత్వానికి అనుభూతి వాదమని పేరుపెట్టటం చేసింది శ్రీ అద్దేపల్లే. భావకవిగా తిలక్ అనే మరో వ్యాసంలో భావకవిత్వం సౌందర్యప్రధానమని, తిలక్ శైలిలోనే గొప్ప సౌందర్యం ఉంటుందని అదే విధంగా తిలక్ లో అభ్యుదయ భావాలుకూడా హెచ్చుగానే ఉన్నాయని నిరూపిస్తారు అద్దేపల్లి. “కృష్ణ శాస్త్రి కవిత్వంలో అనుభూతి ఒక వేదనా స్పర్శతో కూడి ఉంటుంది” అంటారు అద్దేపల్లి. అంతే కాక ఒక వ్యాసంలో “కృష్ణ శాస్త్రి కృష్ణ పక్షం, ఊర్వసి, ప్రవాసం - ఈ మూడు వ్రాసి ఉండకపోయినా, ఒక్క “అన్వేషణము” అనే ఖండిక వ్రాస్తే చాలు, మహాకవిగా నిలబడిఉంటాడు” అంటూ చేసిన ఒక సాహసోపేతమైన వ్యాఖ్య దాన్ని సహేతుకంగా సమర్ధించిన విధానము విమర్శకునిగా అద్దేపల్లి ప్రదర్శించిన అసాధారణమైన సాధికారిక ప్రజ్ఞ. 4. మిని కవిత - శిల్పం శైలి. ఒకనాటి తెలుగు కవిత్వలోకంలో మిని కవితా ఉద్యమం ఒక ప్రభంజనం. ఆ ఉద్యమాన్ని దాదాపు చేయిపట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రచారం చేసిన వారిలో శ్రీ అద్దేపల్లి ప్రముఖులు. "మినికవిత" అనే పుస్తకంలో మినీ కవితా శిల్పాన్ని, శైలిని సోదాహరణంగా చర్చించారు అద్దేపల్లి. "ఒకే ఒక్క భావాన్ని సాధ్యమైనంత శక్తిమంతంగా, హృదయంలో ముద్రపడేటట్లు, ధ్వనిపూర్వకంగా చెప్పటానికి మినీకవిత ఉపకరిస్తుంది, మిని కవితకు ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వని” అంటూ శ్రీ అద్దేపల్లి ఇచ్చిన నిర్వచనాన్ని నేడు వస్తున్న ఏ రకపు కవితకైనా అన్వయించుకోవచ్చు. రుబాయీలు, గాలిబ్ గీతాలు, గురజాడ, శ్రీశ్రీ కవితలను ఉదహరిస్తూ మినికవిత్వం అనేది ఎప్పటినుంచో ఉన్న ప్రక్రియేనని నిరూపించే ప్రయత్నం చేస్తారు అద్దేపల్లి. కొత్తగా ఒక సాహిత్య ప్రక్రియ మొలకెత్తుతున్నప్పుడు దానిని స్వాగతించి, ఆ ప్రక్రియకొక సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించటం విమర్శకుల బాధ్యత. మినికవితోద్యమ సందర్భంగా అద్దేపల్లి ఆ పనిని ఈ పుస్తకం ద్వారా సమర్ధవంతంగా నెరవేర్చారు. 5. దృష్టిపథం - అస్తిత్వ వాదాలపై విశ్లేషణ వివిధ అస్తిత్వవాదాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న సందర్భంలో దళిత, బహుజన, స్త్రీవాద రచనలపై వ్రాసిన విశ్లేషణాత్మక వ్యాససంపుటి “దృష్టిపథం”. ఈ పుస్తకంలో దళితవాద, స్త్రీవాద, పోస్ట్ మోడర్నిజం పుట్టుపూర్వోత్తరాలను లోతుగా చర్చించి, వాటి అవసరతను, బాధ్యతలను గుర్తుచేస్తారు. ఈ సంపుటిలో బొజ్జాతారకం గారు వ్రాసిన "నదిపుట్టిన గొంతుక" లోని తాత్వికధార తెలుగు ఆధునిక దళిత అస్తిత్వవాదానికి పునాదిగా నిలిచింది అని చేసిన ప్రతిపాదన అపూర్వమైనది. ఈ పుస్తకంలో శ్రీ అద్దేపల్లి - ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీ బానిస అయితే బూర్జువా వ్యవస్థలో ఒక వస్తువు; పోస్ట్ మోడర్నిజం ఒక అవాంఛనీయ ధోరణి; దళితకవిత్వం ఒక ఉద్యమ కవిత్వంగా మారుతుందని మొదట్లోనే అంచనా వేయటం -లాంటివి వీరి సామాజిక అవగాహనకు నిదర్శనం. తెలుగు సాహిత్యవిమర్శనా పుస్తకాలలో దృష్టిపథం అత్యంత విలువైనది, ఆధునిక తెలుగు కవిత్వరీతులను అధ్యయనం చేయటానికి ఇదొక దిక్సూచి. 6. అభ్యుదయ విప్లవ కవిత్వాలు-సిద్ధాంతాలు; శిల్పరీతులు శ్రీ అద్దేపల్లి గారు తమ డాక్టరేట్ కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఇది. తెలుగు సాహిత్యరంగానికి సంబంధించి అభ్యుదయ, విప్లవ కవిత్వాల యొక్క సిద్ధాంత చర్చలు ఎక్కువగా జరిగాయి తప్ప, వాటిలోని శిల్ప సమీక్ష పెద్దగా జరగలేదు. నిజానికి అదొక ఖాళీ ప్రదేశం. దిశానిర్ధేశనం చేయటానికి ఎటువంటి పూర్వరచనలు అందుబాటులో ఉండవు. అటువంటి టాపిక్ తీసుకోవటం సాహసోపేతమైన చర్య. ఒక రకంగా సవాలు కూడా. శ్రీ అద్దేపల్లి ప్రతిభ కలిగిన సాహసి కనుక ఈ టాపిక్ ను తమ డాక్టరేట్ కొరకు ఎంచుకొని ఆ లోటును ఈ సిద్ధాంతగ్రంథం ద్వారా సమర్ధవంతంగా పూరించారు. 7. కుందుర్తి కవితా వైభవం కుందుర్తి ఆంజనేయులు గారి కవిత్వాన్ని సమగ్రంగా చర్చించిన పుస్తకమిది. కుందుర్తి అచ్చమైన ప్రజాకవి అని, కథా కథన పద్దతిలో ధ్వని మార్గాన్ని అనుసరించిన కవి అని, వ్యంగ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొన్నాడు అని శ్రీ అద్దేపల్లి చేసిన ప్రతిపాదనలు ఎంతో ఖచ్చితమైనవి, విలువైనవి. 8. సమకాలీనత సాహిత్య విమర్శకుడు తప్పని సరిగా తనకాలంలో వస్తున్న వివిధ అంతర్జాతీయ రచనలను, వాటిపై వస్తున్న విమర్శను నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇది అద్దేపల్లి వారు జీవిత పర్యంతమూ సాగించారు. శ్రీశ్రీని విమర్శించేటపుడు ఆనాటి టి.ఎస్. ఇలియట్ తో పోల్చటం; కృష్ణశాస్త్రిని విశ్లేషించేటపుడు ఠాగూర్ శైలిని ప్రస్తావించటం; తిలక్ వద్దకు వచ్చేటపుడు ఇమేజిస్ట్ సిద్ధాంత సారాంసాన్ని అన్వయం చేయటం; జాషువా కవిత్వాన్ని వివరించాల్సి వచ్చినపుడు భారతీయ భూస్వామ్య, కుల వ్యవస్థలలో అతని కవిత్వ మూలాల్ని అన్వేషించటం; స్త్రీవాదాన్ని, పోస్ట్ మోడర్నిజం, దళిత, మైనారిటీ వాదాల్ని విశ్లేషణ చేసేటపుడు ప్రపంచీకరణ, హ్యూమన్ రైట్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను చర్చించటం - అద్దేపల్లి కాలానుగుణ పరిణామశీలతను, నిరంతర అధ్యయనాన్ని, కాలిక స్పృహను మనకు పట్టిచూపుతాయి. *** అనేక వందల పుస్తకాలకు అద్దేపల్లి వ్రాసిన ముందుమాటలలో ఎక్కువగా ఆ కవిత్వంలోని మంచిని వెలికితీసి చూపేవారు. ఇది వారి ఔదార్యానికి, ఔచిత్యానికి నిదర్శనం. నలభై ఏళ్ళపాటు సాగిన శ్రీ అద్దేపల్లి విమర్శనాయానాన్ని గమనిస్తే- ఈయన ఆయా కాలాలలో వచ్చిన అన్ని ధోరణులను అధ్యయనం చేసి, వస్తువుతో పాటు కవి భావాల్ని, అతని పదాలకున్న శక్తిని, అతని శైలిని, శిల్పాన్ని మొదలైన అన్నింటిపై లోతైన విశ్లేషణలు చేసిన "సమగ్ర కళా విమర్శకుడు" గా దర్శనమిస్తారు. బొల్లోజు బాబా ఉపయుక్త గ్రంథాలు 1. అద్దేపల్లి రచనలు సమగ్రపరిశీలన – సిద్ధాంత గ్రంథం శ్రీ వాసా భూపాల్ 2. డా. అద్దేపల్లి సారస్వత సమీక్షా దర్శిని 3. డా. అద్దేపల్లి రామమోహన రావు రచనలు 4. సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి 5. అద్దేపల్లి వైమర్శిక ప్రస్థానం ఆదర్శనీయం – తంగిరాల చక్రవర్తి