Saturday, February 27, 2021

Imported post: Facebook Post: 2021-02-27T02:34:14

poem by Rohith అనువాదం: బొల్లోజు బాబా . మనం రాయని కవితలు మనతో పాటు మరణిస్తాయని అనుకొంటాం. అవి మన తరువాత కూడా బ్రతికే ఉంటాయని మనకు తెలియదు. శూన్య దేవాలయపు విగ్రహాల అనంత నిశ్శబ్దంలా మనం రాయని కవితలు తమదైన సౌందర్యంతో చరిత్రలకూ, చూసేవాళ్ళకూ ఆవల జీవిస్తూంటాయి రాయనందుకు సంతోషిస్తూ poem by Rohith అనువాదం: బొల్లోజు బాబా

Imported post: Facebook Post: 2021-02-27T00:37:12

శ్రీశ్రీ గురించి సింగమనేని నారాయణ గారి అద్భుత ప్రసంగం అద్భుతమైన ప్రసంగం. . శ్రీశ్రీ ప్రాసంగిత మరింత స్పష్టంగా తెలుస్తోంది ఇపుడు . పెద్దాయనా! నిన్ను నేను కలవలేకపోవటం ఒక విషాదమని అర్ధమైంది. బొల్లోజు బాబా https://www.youtube.com/watch?v=ODT_iyzmv7A&fbclid=IwAR2eDnb9Cbu1_psQasLnGdyA5UcVEYrLwf52oYI-VWSd44CCNRTb_Fevg4k

Wednesday, February 24, 2021

Imported post: Facebook Post: 2021-02-24T17:17:40

బహుశా మనం కలుసుకోవటానికి ఓ ఉదయం పొగమంచులో మనం కలిసి తాగిన వెచ్చటి టీ చాలు --- వేణుగోపాల్ ఆ క్షణాలకోసం ఎదురుచూస్తూ... బొల్లోజు బాబా

Saturday, February 13, 2021

Imported post: Facebook Post: 2021-02-13T02:22:16

సమాచారం కావలెను. రాజమహేంద్రవరంలో చాళుక్య గుణగవిజయాదిత్యుడు ఒక కోట నిర్మించాడు. ఈ కోటకు రెడ్డిరాజులు అనేక మార్పులు చేర్పులు చేసారు. ఈ కోట శిథిలాలు ఇరవయ్యవశతాబ్దం ప్రారంభం వరకూ ఉండేవి. ఈ కోటలో మదనగోపాల స్వామి, ముల్లగూరిశక్తి ఆలయాలు ఉండేవని శ్రీనాథుని పద్యాలద్వారా తెలుస్తుంది. . ఉండునేవీట మార్కండేయమునినాథ సజ్జలింగమనంగ శాసనుండు ప్రవహించునేవీటి పశ్చిమప్రాకార మొరసి గంగమ్మ సాగరముకొమ్మ యావిర్భవించినా డేవీటికోటలో బలభేది #మదనగోపాలమూర్తి పాలించునేవీటి ప్రాగుదక్కోణంబు నుమతోడి శ్రీముల్లగూరిశక్తి (కాశీ ఖండము-శ్రీనాథుడు) . ఈ మదనగోపాల స్వామి విగ్రహం ఫొటో 1920 ల నాటిది. (కర్టసీ: బి.వి కృష్ణారావు) నాకు కావలసిన సమాచారం . ఈ మదనగోపాల స్వామి విగ్రహం నేడు రాజమండ్రిలో ఏదైనా ఆలయంలో భద్రపరచబడిందా? (నేటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం ఇది కాదు). మరేదైనా ఆలయంలో ప్రతిష్టించారా లేక వందేళ్ల కాలంలో ఈ విగ్రహం కాలగర్భంలో కలసిపోయిందా . ఎవరికైనా సమాచారం తెలిస్తే పంచుకోగలరు దయచేసి. బొల్లోజు బాబా

Thursday, February 11, 2021

Imported post: Facebook Post: 2021-02-11T00:41:26

[‘ఒకనాటి ఆంధ్ర రాజధాని పిఠాపురం” అనే ముప్పై పేజీల వ్యాసం ముగింపు వాక్యాలివి. రానున్న “తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు” పుస్తకం నుంచి ) . ముగింపు నేటి సమాజం మతప్రాతిపదికన నిలువునా చీలిపోయింది. హిందుయేతర మతాలు అన్యమతాలుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యయుగాలలో భారతదేశానికి వచ్చిన ముస్లిములను బయటనుంచి వచ్చినవారిగా, అదే విధంగా కలోనియల్ పాలనలో క్రిష్టియన్ మతం స్థానిక ప్రజలను మార్పిడులకు గురిచేసినట్లుగా మతవాదులు అభిప్రాయపడతారు. బ్రిటిష్ పాలకులు జనగణన చేసేటపుడు భారతదేశ ప్రజలకు మతం, కులం అనే అస్తిత్వాలను ఆపాదించి విభజించారని ఆ కారణంగా సమకాలీనసమాజం నేడు భిన్న సమూహాలుగా బిగుసుకుపోయిందని మరి కొందరి అభిప్రాయం. బ్రిటిష్ పాలనకు ముందు భారతీయసమాజం అంతా ఏకతాటిపై లేకపోయినప్పటికీ క్రీస్తుపూర్వం నుంచీ ఈ నేలపై భిన్నవిశ్వాసాలు సహజీవనం చేసాయి. బౌద్ధం, జైనం, హిందూమతం, ఇస్లామ్ విశ్వాసాలను ఆచరించిన ప్రజలు ఒకప్పుడు కలిసిమెలిసి జీవించారని ఒకరినొకరు గౌరవించుకొన్నారని చరిత్రలో అనేక ఆధారాలు కనిపిస్తాయి. క్రీశ. 1324 నాటి విలసతామ్రశాసనంలో తెలుగునాట తుగ్లక్ యుద్ధోన్మాదంతో జరిపిన అకృత్యాలను రికార్డు చేస్తుంది. ఆధిపత్యపోరులలో “యుద్ధోన్మాదంతో జరిగిన విధ్వంసాన్ని” మినహాయిస్తే “ప్రశాంత పాలనాసమయంలో ” హిందూ ముస్లిమ్ సంస్కృతులు సమాజంలో కలగలసిపోవటం గమనించవచ్చు. కృష్ణదేవరాయలు మసీదులు కట్టించాడు, పర్షియన్ తరహా నిర్మాణాలు నిర్మించాడు. హిందూరాజులలో “సుల్తాను” అని పిలిపించుకోవటం ఒక బిరుదుగామారింది. ఇబ్రహిం కుతుబ్ షాను మల్కిభరామునిగా కవులు సొంతం చేసుకొన్నారు. సాహిత్యం, శాసనాలలో ఎక్కడా ముస్లిమ్ వ్యతిరేకత కనిపించదు. కుతుబ్ షాహి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ కాలంలోనే తెలుగుభాషలోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. సూఫీ, పీర్ల సంస్కృతులు సమాజంలో ఆదరణ పొందాయి ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండరాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిమ్ రాజులు వ్యవరించుకొన్నారు. దీనికి ప్రధానకారణం అనాదిగా భారతదేశంలో భిన్న సంస్కృతులు ఒక జీవనవిధానంగా ఉండటమే. శాతవాహనులు హిందూ మతాన్ని అవలంబించినా అనేక బౌద్ధ ఆరామాలు, చైత్యాలు నిర్మించారు వాటి నిర్వహణకు దానాలు ఇచ్చారు. కొన్ని శాతవాహన నాణాలపై జైనమతానికి చెందిన శ్రీవత్స ముద్ర ఉండటాన్ని బట్టి వారు జైనాన్ని కూడా సమాదరించారని భావించాలి. జైనమతానికి చెందిన కళింగరాజు ఖారవేలునికి “సర్వ పసంద పూజక” (అన్ని ఆరాధన పద్దతులను గౌరవించేవాడు) “సర్వ దేవయతన సంస్కరణ” (అన్ని ఆరాధనా విధానాలకు ఆలయాలు నిర్మించేవాడు) అనే బిరుదులు కలవు. కుబ్జ విష్ణువర్ధనుడు తాను వైష్ణవుడని చెప్పుకొన్నప్పటికీ ఇతని భార్య అయ్యణ మహాదేవి జైన మతాన్ని అవలంబించింది. జైనులకు అనేక బసతులను నిర్మించింది. విష్ణువర్ధనుడి కాలంలోనే పిఠాపురం గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లటం మరో విశేషం. గుణగవిజయాదిత్యుడు శైవుడైనప్పటికీ ఇతని వద్ద సేనానిగా పనిచేసిన పండరంగని కుటుంబం జైనమతాన్ని పాటించేవారు. శైవమతాలంబక రెండవ అమ్మరాజు ఒక జినాలయానికి మైలంపూడి అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఈ ప్రాంతంలో ఒకసమయంలో హిందూ, బౌద్ధం, జైనమతాలు సమాదరణ పొందాయి. చాలాకాలం ప్రజలు భిన్నవిశ్వాసాలను పాటిస్తూ, ఒకరిపట్ల మరొకరు సహిష్ణుత ప్రదర్శించుకొంటూ కలిసిమెలసి జీవించారనటానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుయ్యేరు గ్రామంలో ఒక ప్రాచీన జైనాలయానికి చెందిన స్తంభంపై జైన, హిందూ శిల్పాలను పక్కపక్కనే ఉండటం గమనించవచ్చును నేటికీ. కాలక్రమేణా కొన్ని విశ్వాసాలు రాజాదరణ కోల్పోవటంతో క్రమేపీ కనుమరుగయ్యాయి. అయినప్పటికీ ఈ వ్యాస ప్రారంభంలో చెప్పినట్లు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే జైన, బౌద్ధ, హిందూ, ముస్లిం, గురుపూజ సంప్రదాయాలకు పిఠాపురం అనాదిగా ఆలవాలంగా ఉంటూ వస్తున్నది. బొల్లోజు బాబా

Monday, February 8, 2021

Imported post: Facebook Post: 2021-02-08T02:49:49

thank you కోండ్రు రమేష్ gaaru. ఆసక్తికరమైన ప్రశ్నలతో, వినూత్నంగా పుస్తక పరిచయం చేసినందుకు. I wonder at your close reading of the text. thank you so much బొల్లోజు బాబా *** ##❤❤మెకంజీ కైఫియ్యతులు❤❤## ##❤తూర్పుగోదావరి జిల్లా❤## ##బొల్లోజు బాబా## *1816లో వ్రాసిన పుస్తకం నిమిత్తం ఇంగ్లీషులో వ్రాసిన మొదటి భారతీయునిగా రాజారామమోహాన్ రాయ్ గుర్తింపబడ్డారు...కానీ ఆయన కంటే ముందు 1803లోనే ఇంగ్లీషులో రచనలు చేసిన తెలుగు వ్యక్తి ఎవరు?? *అమరావతి స్థూపాన్ని గుర్తించిన మొదటి యూరోపియన్ ఎవరు?? *దీపాలదిన్నె ప్రాంతం ఏమిటి?అదెక్కడ ఉంది?? *బోయినపూడి గ్రామం ఎలా ఏర్పడింది?నీలం జాతి వారు ఎవరు?వారి జీవన విధానం ఏమిటి?? *చిన్న పువ్వు తేనె అంటే ఏమిటి?పిఠాపురం రాజా వారి సైనికులు దానిని ఏవిధంగా సేకరించేవారు?? *108యుద్దాలలో గెలిచినందుకు 108శివాలయాలు ప్రతిష్ఠించిన చాళుక్య రాజు ఉదంతం ఏమిటి?? *రాజమండ్రి కోటగుమ్మం ప్రాంతానికి ఆ పేరెలా వచ్చింది?? *రాజమహేంద్రవరం పట్టణాన్ని ఎవరు,ఏ విధముగా నిర్మించినారు?? *రాజమహేంద్రవరం కోట గోల్కొండ నవాబుల వశం కావడానికి కారకులైన సీతాఫిఖానుడు-అవసరాల పెద్దిరాజుల ఉదంతం ఏమిటి?? *కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ నిజాం నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి,ఎప్పుడు అమ్మివేశాడు?? *పురిటి సుంకం విధించిన రాచవేమారెడ్డిని వీధిలో కత్తితో వధించిందెవరు?? *సర్పవరం,పండూరు,జల్లూరు గ్రామాలకు ఆ పేర్లేలా వచ్చాయి?? *దక్షిణ భారతదేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన రాజు ఎవరు?వాటికి వరహాలు అనే పేరెలా వచ్చింది?? *మంచికొండ పట్టణం ఎవరి పేరు మీద,ఏ సందర్భంలో ఏర్పడింది?? *వెన్నెల రాయుడికి ఆ పేరెలా వచ్చింది?వెన్నెలరాయ గుట్టకి అతనికి గల సంబంధం ఏమిటి?? *భారతదేశంలో గన్ పౌడర్ ను 1526లో బాబర్ ప్రవేశపెట్టినట్లు చెప్పబడినా...అంతకుముందే దానిని భారతదేశంలో వాడింది ఎవరు?? *కోరుకొండ పట్టణం ఏవిధంగా ఏర్పడింది?కోరుకొండ కొండపై నృశింహస్వామి దేవాలయం నిర్మించింది ఎవరు?? *గోదావరికి గుద్రవర అనే ప్రాచీన నామం ఏ ఆలయ స్తంభంపై శాసనరూపంలో ఉంది?? *మనిషి పుర్రెలో వండిన అన్నాన్ని,రక్తంతో కలిపి రాత్రివేళ యుద్ధభూమిలో నైవేద్యం పెట్టే రాజు ఎవరు?? *కుల్లమీనార్ అంటే ఏమిటి?దాని వలన ఏర్పడిన భయనక వాతావరణం ఏమిటి?? *తన ఎదుట పొగ త్రాగితే కత్తి తీసి పరిగెత్తించి కొట్టే గజపతుల రాజు ఎవరు?? *దోమాడ యుద్ధం ఎప్పుడు,ఎవరి మధ్య జరిగింది?? *కిమ్మూరు,గోరంట,గోవాడ,చెల్లూరు గ్రామాలకు ఆ పేర్లేలా వచ్చాయి?? *కోరంగి గ్రామానికి ఆ పేరెలా వచ్చింది?కోరంగికి రామాయణానికీ గల సంబంధం ఏమిటి?? *సీతాంతం గ్రామం సిద్దాంతం గ్రామంగా ఎలా మారింది?? *గుడిపాడు,అంకసానిపాడు గ్రామాలు ఏవిధంగా ఏర్పడ్డాయి?? *ధర్మవేమారెడ్డి కాలంలో జరిగిన పరుసవేది వృత్తాంతం ఏమిటి? *ద్రాక్షారామ భీమేశ్వరాలయం,సామర్లకోట కుమార భీమేశ్వరాలయలను నిర్మించిన రాజు ఎవరు?? *ద్రాక్షారామం ప్రాచీన నామం ఏమిటి??ద్రాక్షారామంలో దాదాపు వేయి సంవత్సరాల క్రితం నెలకొన్న సామాజిక,ఆర్థిక,మత,వర్ణవ్యవస్థ పరిస్థితులు ఏమిటి?? *క్రీ.శ ఏ కాలం నాటికి గోదావరి,ద్రాక్షారామపురం అనే పేర్లు వాడుకలోకి వచ్చాయి?? *ఒక అఖండ దీపారాధన కోసం కావాల్సిన నెయ్యి కోసం ఎన్ని గోవులు అవసరం?? *ఆంధ్రదేశంలో బౌద్ధ,జైన మతాలను తీవ్రంగా అణచివేసి,ఉత్తర భారతదేశం నుండి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను రప్పించి,హిందూ మతాన్ని ఆంధ్రదేశంలో స్థిరీకరించిన రాజు ఎవరు?ఆనాటి పరిస్థితులు ఏమిటి?? *వరంగల్ సీతాఫ్ ఖాన్,రాజమహేంద్రవరం సీతాఫ్ ఖాన్ ల మధ్య సంబంధం ఏమిటి?? *1759,మే 14 న కోస్తా జిల్లాలను బ్రిటిష్ వారికి ఈనాం గా ఇచ్చిన నిజాం నవాబు ఎవరు?? *సర్కారు జిల్లాలలో ఫ్రెంచివారి నిష్క్రమణ మరియు బ్రిటిష్ వారి ప్రాబల్యం ఏవిధంగా ఏర్పడ్డాయి?? *అనేక శాసనాలలో ప్రస్తావించబడిన ఇనుపఎడ్లు అంటే ఏమిటి?? *ఆలయాలలో గోశాలల నిర్మాణం ప్రారంభించిన రాజు ఎవరు? *సాని అనే పదం యొక్క పవిత్రత ఏమిటి?దేవాలయాలలో వారు చేసిన పవిత్ర సేవలు ఏమిటి?వారు పొందిన గౌరవాలు ఎట్టివి?కాలక్రమంలో సాని అంటే బూతుగా ఎలా,ఎందుకు మారింది?? *కాలీన్ మెకంజీకి శాసనాలు,కైఫీయత్తులు సేకరణలో తోడ్పడిన సహాయకులు,చిత్రకారులు ఎవరు?వారి కృషి వలన తెలుగు ప్రాంతానికి జరిగిన చారిత్రక మేలు ఏమిటి?? ఇత్యాది విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే...❤❤ తెలంగాణా ప్రాంతంతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలో ప్రాచీన చరిత్రపై జరుగుతున్న పరిశోధనలు,రచనలు బహు తక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు...అయితే ఈ పుస్తకం కోసం రచయిత బొల్లోజు బాబా గారి పరిశోధన,శ్రమ,అవిరాళ కృషి నిజంగా శ్లాఘనీయం...చక్కని వివరాలతో,ఆధారాలతో సరళ శైలిలో వారు ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు...కేవలం తూర్పుగోదావరి జిల్లా వాసులు మాత్రమే కాకుండా తెలుగువారందరు చదవదగిన పుస్తకం రచించిన రచయిత బొల్లోజు బాబా గారికి...🙏🙏🙏 వీరి కలం నుండి ఇలాంటి రచనలు అనేకం రావాలని ఒక చరిత్ర విద్యార్థిగా నేను ఆశిస్తున్నాను...💐💐💐💐 ఈ పుస్తకం కావాల్సిన వారు పల్లవి పబ్లికేషన్స్ వారిని 9866115655నంబర్ లో సంప్రదించగలరు... writeup by Sri కోండ్రు రమేష్

Thursday, February 4, 2021

Imported post: Facebook Post: 2021-02-04T23:46:09

. వెళ్ళాలి... వెళ్ళి తీరాలి ఈ రాత్రిస్వప్నంలోనైనా వెళ్తాను.... వెళ్ళి టెంటులో చలికి ఒణుకుతోన్న నాగలి నుదుటిని ముద్దాడి వస్తాను . బొల్లోజు బాబా