Friday, September 25, 2009

Broken love


ఆమె లేని ఎడారిని
గ్లాసులతో ఎత్తుకొని
తాగీ తాగీ అతను
పాత చీకట్లలో కరిగిపోయాడు.

రాత్రి చలికి ఆమె చనిపోయింది.
తన సంచిలో, బట్టల అడుగున
నూనూగుమీసాలతో నవ్వుతున్న
నలిగిన అతని ఫొటో.

ఇన్నాళ్లూ పిచ్చిదనుకొన్నాం ఆమెను.

వైఫల్య రధానికి
దౌర్భల్యం, కన్నీళ్లు
రెందు చక్రాలు.

బొల్లోజు బాబా

Thursday, September 24, 2009

ఈ లింకులో కులం/మతం గురించి కొన్ని ఆశక్తికరమైన ప్రశ్నలున్నాయి ...

మిత్రులారా ఈ క్రింది లింకులో దూదేకుల కవిత్వం అనే ఒక టపాకు రహంతుల్లా గారు చేసిన కామెంటులో దూదేకుల కులం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి కొన్ని ఆశక్తికరమైన ప్రశ్నలున్నాయి.

అందులో నన్ను ఆకర్షించిన ఒక పాయింటు, ప్రస్తుతం దూదేకుల వృత్తి లేదు కనుక ఆ కులానికి ఆ పేరు ఉండాల్సిన అవసరం లేదు. మరేదయిన మంచి పేరు పెట్టాలి అన్న వాదన.

కులం, మతం వంటి విషయాలను లోతుగా చర్చించే మిత్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది. రహంతుల్లా గారు లేవనెత్తిన అనేక పాయింట్లు ఆలోచించదగినవని కనీసం
తెలుసుకోవలసినవని నేను భావించి ఇలా
మీ ముందుకు తీసుకొని వస్తున్నాను.
లింకు

పై పోస్టులో ఆఖరి కామెంటు చదవండి.

భవదీయుడు
బొల్లోజు బాబా

Sunday, September 20, 2009

ఆవకాయ్.డాట్ కాం లో ఒక పాబ్లో అనువాదం

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడ్డ ఆకాశానికి వెలుపల.. అనే ఒక పాబ్లో నెరుడా కవితానువాదాన్ని ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.


భవదీయుడు

బొల్లోజు బాబా

Thursday, September 10, 2009

నాకు అర్ధం కాదు ......

నా బాల్యాన్ని ఆక్రమించిన
ఆ పాత రేడియో అంటే నాకెంతో ఇష్టం.
రోజుకోసారి దానిని తాకనిదే
ఆ రోజు గడిచినట్లుండదు.
అది మూగవోయి చాన్నాళ్లే అయినా
నిత్యందాని దుమ్ము దులిపి
ధగ ధగా మెరిసిపోయేలా చేస్తూంటాను.

“కాలం ముందుకుపోతూంటే మీరింకా
ఆ పాతని ఎందుకు పట్టుకు వేలాడతారూ?”
అంటూంది మా ఆవిడ ప్రతీసారీ

ఓ రోజు ఇంటికి పెద్ద అతిధులొస్తున్నారని
మా ఆవిడ దాన్ని అటకెక్కించేసింది.
అతిధులెళిపోయాకా ఆ రాత్రి
అటకమీంచి దాన్ని దింపి
మరలా దుమ్ము దులిపి
నా టేబుల్ పై ఉంచుకొన్నాను.

నాకర్ధం కాదసలు
బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ?

బొల్లోజు బాబా

Monday, September 7, 2009

వివిధ వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డ పాబ్లో కవిత్వానువాదాలు

పాబ్లో నెరుడా రచించిన 20 ప్రేమ కవితలు మరియు ఒక విషాద గీతం అనే పుస్తకానికి నే చేసిన తెలుగు అనువాదాలు ఈ క్రింది లింకులలో చదువు కొన వచ్చును. ప్రచురించిన ఆ యా వెబ్ పత్రికల ఎడిటర్లకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. మొత్తం అన్ని కవితల అనువాదం పూర్తయింది త్వరలో ఇ.బుక్ గా మీ ముందుకు తీసుకువస్తాను.






(కవితా కౌముది శీర్షికలో రెండవ కవిత)



భవదీయుడు

బొల్లోజు బాబా





Wednesday, September 2, 2009

చేయాల్సిందల్లా.....

సూర్యుడు, నదీ
కొండల పంజరంలో
చిక్కుకొన్న గానుగెద్దులు..
ఒకటే దారి, ఒకటే గమ్యం.
దేహాలతో వచ్చిన చిక్కే ఇది.
అదే హృదయాన్ని చూడు.
ఎంత విశృంఖల విహారియో.
అన్నిదారులూ తనవే
అన్ని గమ్యాలూ తనకే.

హృదయం ఆలోచనలను
కాలంలోకి ప్రవహింపచేస్తూంటుంది.
స్వప్నాలను బలంగా
వెలుగులోకి తోసే రాత్రిలా.

చేయాల్సిందల్లా
హృదయాన్నినిత్యం కొలిమిలో
జ్వలింపచేసుకోవటమే.

లేదూ
తూనీగై మబ్బుల్ని ముద్దిడిన ఉదయంలా
రాలిపోనూవచ్చు లేదా
పండులా ఫలించిన సాయింత్రమై
పగిలిపోనూ వచ్చు.

రాలిపోయే ఆకుల సవ్వడిని
నిశ్శబ్దం కూడా గుర్తించదు.

బొల్లోజు బాబా

Tuesday, September 1, 2009

క్షుద్ర క్రీడ

మూరెడు మట్టి గాజులకు
ఆమె చేతుల్ని తొడిగారు.

సోలడు పసుపుకు
ఆమె ముఖాన్ని అద్దారు.

సంజె బింబానికి ఆమె నుదురును
అతికించారు.

బుట్టెడు పూలకు ఆమె కురులను
ముడి వేసారు.

ఇవేమీ పట్టని ఆమె
భోరు భోరు న దుఖి:స్తోంది
భర్త శవంపై పడి.

బొల్లోజు బాబా

పల్లెలో మా పాత ఇల్లు - ఇస్మాయిల్ గారి పుస్తక సమీక్ష

ఇస్మాయిల్ గారి మరణానంతరం, వారి అభిమానులు వెలువరించిన "పల్లెలో మా పాత ఇల్లు" కవితా సంకలనం సమీక్షను పుస్తకం. నెట్ వారి ఈ క్రింది లింకులో చూడవచ్చును.


బొల్లోజు బాబా