Thursday, September 24, 2009

ఈ లింకులో కులం/మతం గురించి కొన్ని ఆశక్తికరమైన ప్రశ్నలున్నాయి ...

మిత్రులారా ఈ క్రింది లింకులో దూదేకుల కవిత్వం అనే ఒక టపాకు రహంతుల్లా గారు చేసిన కామెంటులో దూదేకుల కులం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి కొన్ని ఆశక్తికరమైన ప్రశ్నలున్నాయి.

అందులో నన్ను ఆకర్షించిన ఒక పాయింటు, ప్రస్తుతం దూదేకుల వృత్తి లేదు కనుక ఆ కులానికి ఆ పేరు ఉండాల్సిన అవసరం లేదు. మరేదయిన మంచి పేరు పెట్టాలి అన్న వాదన.

కులం, మతం వంటి విషయాలను లోతుగా చర్చించే మిత్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది. రహంతుల్లా గారు లేవనెత్తిన అనేక పాయింట్లు ఆలోచించదగినవని కనీసం
తెలుసుకోవలసినవని నేను భావించి ఇలా
మీ ముందుకు తీసుకొని వస్తున్నాను.
లింకు

పై పోస్టులో ఆఖరి కామెంటు చదవండి.

భవదీయుడు
బొల్లోజు బాబా

2 comments:

 1. Thanks for the link. There is alonger post in November with more comments. I think that there some more groups like that shunted between India and Pakistan after partition. Alice Albinia also describes some groups in "Empires of the Indus". I vaguely remember that people like Sheik Chinna Maulana Sahib may be from the same group, but I am not sure.

  ReplyDelete
 2. దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. ముఖ్యంగా నాదస్వర సామ్రాజ్యాన్ని ఏలిన షేక్ చినమౌలానా వంటి విద్వాంసులు, బుర్రకథా పితామహుడు నాజర్ వంటి కళాకారులు దూదేకుల కులం నుంచి ఎదిగిన ప్రముఖులు. నిజమైన లౌకికవాదులు దూదేకులు. దూది ఏకే వృత్తిని ఇప్పుడు ఎవ్వరూ చేయడం లేదు. "నూర్ బాషీయులు " అనే పేరుతో ఈ కులం చరిత్ర - సంసృతి పై రిటైర్డ్ ఐ.ఏ.యస్. అధికారి శ్రీ ఇనగంటి దావూద్ గారు ఒక పుస్తకం రాశారు. బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారీ" అనే పుస్తకంగా ప్రచురించాడు. కుటుంబనియంత్రణ పాటించటం,పిల్లల్ని బాగా చదివించటం ద్వారా నూర్ బాషీయులు క్రమేణా అబివృద్ధి బాటపట్టారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ వి న్నవించింది.వీళ్ళ ఇంటి పేర్లు, వ్యక్తుల పేర్లు కూడా హిందూ దేవుళ్ల పేరు ఉంటాయి.
  దూదేకుల ప్రముఖులు
  తాత్వికులు
  • బ్రహ్మం గారి శిష్యుడు సిద్దయ్య కడప జిల్లా:
  కళాకారులు
  • బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్, గుంటూరు జిల్లా:
  • నాగూర్ బాబు ( మనో ) సినీ గాయకుడు (తెనాలి)
  క్లారినెట్ విద్వాంసులు
  • కంకటపాలెం సుభాన్ సాహెబ్
  • సూరాలపల్లి మౌలాసాహెబ్
  • జగ్గయ్యపేట హుసేన్ సాహెబ్
  • కారుమూరు షేక్ మీరాసాహెబ్
  • ఈదుమూడి పీరుసాహెబ్
  నాదస్వర విద్వాంసులు
  • షేక్ నబీసాహెబ్ సాతులూరు 1825
  • షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు చిలకలూరిపేట 1830
  • షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1850
  • షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు అమ్మనబ్రోలు 1890
  • షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1904
  • నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు చిలకలూరిపేట 1915
  • వల్లూరు ఆదంసాహెబ్ వల్లూరు 1850
  • ఇనగంటి సుబ్బన్న 1875
  • కొమ్మూరు పెంటుసాహెబ్ 1890
  • కొమ్మూరు సిలార్ సాహెబ్ 1928
  • రాచవారిపాలెం కాసింసాహెబ్ 1850
  • దొప్పలపూడి ఆదంసాహెబ్ 1885
  • ఆదిపూడి రంతుల్లా 1910
  • నందిగామ ఉద్దండుసాహెబ్ 1925
  • ముండ్లపాడు హసాన్ సాహెబ్ నందిగామ
  • షేక్ మహబూబ్ సుభాని కాలేషాబీ]] దంపతులు 1955
  • త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు)
  • కస్మూరు మస్తాను
  • పద్మశ్రీ షేక్ చిన మౌలానా కరవది 5.12.1924
  • వల్లూరిపాలెం మస్తాను 1925
  • పందలపాడు సైదులు 1926
  • షేక్ మీరాసాహెబ్ సన్నాయి సైదమ్మ దంపతులు మిడమలూరు ఒంగోలు
  విద్యావేత్తలు,అధికారులు
  • డాక్టర్ ఖాదర్ దూదేకుల మైసూరులోని భారతీయ ఆహార పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్
  • డాక్టర్ మస్తాన్ అనస్తీషియా స్పెషలిస్టు ఎన్.ఆర్.ఐ.హాస్పిటల్,మంగళగిరి.
  • జి.ఎ.రహీం రిటైర్డ్ ఐ.జి.ఆఫ్ పోలీస్ (నూర్జహాన్,శాల్యూట్ పత్రికలసంపాదకుడు),
  • ఇనగంటి దావూద్ (ఐ.ఏ.ఎస్.) (నూర్ బాషీయులు గ్రంధరచయిత) హైదరాబాద్:
  • ఎస్.ఎం.సుభాన్ హైకోర్టు న్యాయవాది,
  • మహబూబ్ ఆలీ, రైల్వే చీఫ్ ఇంజనీర్.
  • ప్రొఫెసర్ నూర్ బాషా అబ్దుల్ (నాగార్జున యూనివర్సిటీ)
  • డాక్టర్ షేక్ శ్రీనివాసరావు పి.హెచ్.డి. ప్రిన్సిపల్ సైంటిస్ట్, హిటిరో డ్రగ్స్, (కొరిశపాడు)
  • షేక్ వలి హామిద్ ఆలి, ఛీఫ్ టెలిగ్రాఫ్ ఆఫీసర్, రాజమండ్రి:
  • డిప్యూటీ కలెక్టర్లు నూర్ బాషా రహంతుల్లా, నూర్ బాషా ఖాశిం కంకటపాలెం
  దూదేకుల సాయిబుల మీద సామెతలు
  • దూదేకులవానికి తుంబ తెగులు (అందుకే ఆ వృత్తి జిన్నింగ్ మిల్లులకొదిలేశారు)
  • దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు)
  • తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా (ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టులాగా)
  • కాకర బీకర కాకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. (ఉర్దూ రాక పాట్లు)

  ReplyDelete