Thursday, September 10, 2009

నాకు అర్ధం కాదు ......

నా బాల్యాన్ని ఆక్రమించిన
ఆ పాత రేడియో అంటే నాకెంతో ఇష్టం.
రోజుకోసారి దానిని తాకనిదే
ఆ రోజు గడిచినట్లుండదు.
అది మూగవోయి చాన్నాళ్లే అయినా
నిత్యందాని దుమ్ము దులిపి
ధగ ధగా మెరిసిపోయేలా చేస్తూంటాను.

“కాలం ముందుకుపోతూంటే మీరింకా
ఆ పాతని ఎందుకు పట్టుకు వేలాడతారూ?”
అంటూంది మా ఆవిడ ప్రతీసారీ

ఓ రోజు ఇంటికి పెద్ద అతిధులొస్తున్నారని
మా ఆవిడ దాన్ని అటకెక్కించేసింది.
అతిధులెళిపోయాకా ఆ రాత్రి
అటకమీంచి దాన్ని దింపి
మరలా దుమ్ము దులిపి
నా టేబుల్ పై ఉంచుకొన్నాను.

నాకర్ధం కాదసలు
బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ?

బొల్లోజు బాబా

17 comments:

  1. నిజమే కదా!
    బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ?
    అభీష్టానికి ఆంక్షలేంటి?:):)

    ReplyDelete
  2. “కాలం ముందుకుపోతూంటే మీరింకా
    ఆ పాతని ఎందుకు పట్టుకు వేలాడతారూ?”

    అవును, పాతను పట్టుకు వేలాడటంలో ఒక కొత్తదనం ఉంటుంది.

    Excellent, as asual! Thank you sir!

    ReplyDelete
  3. ప్రతి జ్ఞాపకం వెలకట్టలేనిదే. చివరకు మిగిలేది అవే కదా.
    బాగా చెప్పారు.

    ReplyDelete
  4. బాబా గారు,

    బాగలేదని చెప్పలేను గాని, బాగుందని కూడా చెప్పలేను. కవితలో వచనం గురించి నాకభ్యంతరం ఏవిలేదు. కానీ ఈ కవితలో వచనం, కవితలో వచనంలాగాక, కథలో వచనంలాగుంది. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానేవో, కానీ కవితని చదివిన అనుభవం లేదు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    ReplyDelete
  5. రవికిరణ్ గారు చెప్పిందే నాకూ అనిపించింది. ఒక భావనే కానీ, కవిత్వం మాత్రం కాలేకపోయింది.

    ReplyDelete
  6. మీ వచన కవిత చదువుతుంటే నాకు నా సిల్కుదుప్పటి గుర్తుకువచ్చింది. ఉయ్యాలలో మా తాతగారు [మాతామహులు] నా పొత్తిళ్ళలో పెట్టిన ఆ దుప్పటిని ఎన్నో అవాంతరాలనుండి కాపడుకుని ఇప్పటికీ నా తల క్రిందనే వుంచుకున్నాను. బాధలో నన్ను ఓదార్చే బాంధవి, సంతోషంలో నాతో చిందులేసే సాగర కెరటం అది. వినటానికి వింతగా వున్న అతి అరుదుగా నేను తాకనిచ్చే వారెవరైనా ఏదో ఒక భావనకి లోనౌతారు.

    ReplyDelete
  7. పద్మార్పిత గారికి, సుజాత గారికి, వాసు గారికి ధన్యవాదములండీ.
    రవికిరణ్ గారికి
    సాయికిరణ్ గారు అన్నట్లు ఒక భావనను చెప్పాలని చేసిన ప్రయత్నమిది.

    సాయికిరణ్ గారు థాంక్సండీ

    ఉషగారు
    నా కవితలోని ఆత్మను పట్టుకొన్నారు. నేను చెప్పదలచుకొన్నదీ అదే. ఇక రేడియో అనేది ఒక మీడియం అంతే.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  8. avunu baba garu,
    balyam oka geetam,
    balyam oka gani
    balyam oka gnapakam
    enta padukunna malli malli padalanipinchedi
    enta tavvukunna taragani manulakhani
    gnapakalaki kotta,pata ani emi vundavandi.
    modatisari mee blog chusanu..chaala baagunnayi

    ReplyDelete
  9. అవును బాల్యానికి పాతేమిటి కొత్తేమిటి .....మనసుకు అపురూపమైనదేదైనా అపూర్వమే, దానికి కట్టే వెల అమూల్యమే..

    ReplyDelete
  10. బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ? ఎంత బాగా చెప్పారండీ. చాలా బాగుంది.

    ReplyDelete
  11. బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ super :)

    ReplyDelete
  12. బాల్యపు గుర్తులతో నాకూ ఓ నీలం రంగు చొక్కావుండేది
    ఆ కవిత వార్త ఆదివారం అనుబందంలో వచ్చినప్పుడు ఆ వారమంతా ఫోను పలకరింపులు వుక్కిరి బిక్కిరి చేసాయి.
    అయి రెండూ గుర్తు కొచ్చాయి
    http://alalapaikalatiga.blogspot.com/2007/07/blog-post_9996.html
    ఈ లంకె చూడొచ్చు

    ReplyDelete
  13. కవితలోని భావన అద్భుతం గా వుంది.నిజమే కొత్తేమిటి పాతేమిటి?

    ReplyDelete
  14. mee balyapu jnaapakam chaduvutunte maa intlo jarigina sanghatana gurthochindi. maa thaatagari, matamahulu, radio ni ikkadikoche mundu maa nannagaru evariko ichesaaru. adi thaluchukuni maa ammagaaru ippatikii badhapadutuntaaru. nenu kuda..endukante naa baalyam kuda aa radio thone kuniragalu theesindi mari. aa radio ippatikii muugapoledu..balyapu jnaapakaala laage..

    ReplyDelete
  15. స్పందించిన అందరకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  16. "బాల్యానికి పాతేమిటి, కొత్తేమిటీ?"

    ఆలోచింపజేసే చక్కని ప్రశ్న

    -సురేష్

    ReplyDelete