Tuesday, April 26, 2016
రూమీ వాక్యాలు
Monday, April 25, 2016
రెండు నాల్కల పద్యం
ఆధునిక ప్రపంచానికి
Friday, April 22, 2016
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
http://magazine.saarangabooks.com/2016/04/21/రేపు-నిన్ను-ఎవరో-అరెష్టు/
బొల్లోజు బాబా
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు. నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం. ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం. ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
ప్రముఖ కవయిత్రి, మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం. అదీ ఈ కవితకు నేపథ్యం.
ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది. ఆ ‘నువ్వు’ లో ‘నేను’ లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.
*******
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు. నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు. పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పిటిషన్ పై వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ చిట్టితల్లి UAPA అంటే ఏమిటో తెలుసుకొంటుంది. నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి, లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి. ఎవరూ మాట్లాడరు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు. ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నిన్ను హెచ్చరిస్తారు. నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు- కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు. నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు. మాట్లాడకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది. మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు
రేపు ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు. నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.
నిశ్శబ్దమా వర్ధిల్లు!
మూలం: మీనా కందసామి ( The End of Tomorrow) – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
Monday, April 18, 2016
రూమీ వాక్యాలు
నీ హృదయానికి త్రోవ తెలుసు. ఆ దిశలో పరిగెత్తు – రూమీ
రోజా పూవు రాలి, శకలాలై, సుగంధమై విస్తరిస్తుంది. నీవుకూడా ప్రతీ ఇంటికి కిటికీగా మారతావు. ప్రతీ మైదానంలో ఓ రోజావనం గా మొలకెత్తుతావు. – రూమీ
రాపిడులకే చికాకు పడుతుంటే, నీకు మెఱుగు ఎలా పెట్టేదీ? – రూమీ
చివరకు మిగిలే సౌందర్యం, హృదయసౌందర్యం మాత్రమే – రూమీ
నీ హృదయం నుంచి నాకు ఒక దారి ఉంది – రూమీ
ప్రేమికుల ఇళ్ళలో సంగీతం ఎన్నడూ ఆగిపోదు
గోడలు పాటలతో, నేల నృత్యాలతో చేయబడి ఉంటాయి – రూమీ
గాయం ద్వారా కాంతి నీలోకి ప్రవేశిస్తుంది – రూమీ
నన్ను నీలో చూడలేకపోతే నన్నెప్పటికీ చూడలేవు, ఎందుకంటే ఆదినుంచీ నేను నీలోనే ఉన్నాను – రూమీ
బొల్లోజు బాబా
(మరిన్ని "రూమీ వాక్యాలు" గ్రూపులో")
https://www.facebook.com/groups/1286654614695032/
Friday, April 15, 2016
ఆ తరువాతేం జరిగిందంటే.....
Wednesday, April 13, 2016
"మహర్షి అంబేద్కర్" - శ్రీ గుర్రం ధర్మోజీ గారి పుస్తక పరిచయం
భారతదేశపు రాజకీయ చిత్రాన్ని, సామాజిక వ్యవస్థను ఒక జ్ఞాన సూర్యునిలా ప్రకాశింపచేసిన అజరామరుడు, ప్రాతఃస్మరణీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్. అలాంటి మహానుభావుని జీవితచరిత్రను "మహర్షి అంబేద్కర్" అనే పేరుతో గేయకావ్యాన్ని వెలువరించారు ప్రముఖ పద్యకవి శ్రీ గుర్రం ధర్మోజీ గారు.లలాట ఫలకస్థలాన
చలిత ప్రభాకలితము
జ్వలిత జ్ఞానతిలకము
చిక్కని చీకట్లు చీల్చ
మహర్లందు మహర్షిగా
అంబేద్కర్ ఉదయించెను.
ఉత్తరమీయకతత్తరపాటున
బిత్తరపోవుచునిస్సహాయులై
నిరుత్తరులౌచునిలుచుంటే (ఇది గేయ పద్యం, చందో బద్దం కాదు గమనించగలరు)
నేనే? పాపం చేశాననుచు
చిన్నమనస్సునెన్నో ప్రశ్నలు
మెదడును తొలిచే పదునగుబాకులు
నెమ్మనమున ఉమ్మెత్తలగుత్తులు.
తనేకదా పోరునకు పిలుపు
తనేకదా ఉద్యమపు గెలుపు
గుండెలలో సదా నిలుపు
అంబేద్కరుని ఉపన్యాసము
అద్భుతమైన విన్యాసము
అచ్చెరువొందే ఉపన్యాసము
మాటలు కావవి ఈటెలు కాని
పదములు కావవి పదును కత్తులు
గాధకాదని బాధయెకాని
ప్రతిఒక్కరు చదివి ప్రేరణనొంది, మరో పదిమందికి ఈ పుస్తకాన్ని బహూకరించి వారిలో కూడా ఉత్తేజాన్ని నింపాల్సిన సమయం ఇది.
శ్రీశ్రీ జ్ఞానవిధాన భాస్కరసమం శ్రీబాబసాహేబునం
శ్రీ సక్పాలసుతంనమామిసతతంసాంబేద్కరం భాసురం
భీమాబాయిసుతం సదా హితకరం శ్రీబుద్ద ధర్మాశ్రితం ..... అంటూ శ్రీ ధర్మోజి అంబేద్కర్ పై వ్రాసిన సంస్కృత శ్లోకంతో ఈ గేయసంపుటి మొదలై, మరో సంస్కృత మంగళాశాసనంతో ముగుస్తుంది.
ఫోన్.నం.9949263267
వెల 10 రూ.
దొరకు చోటు
జి. ధర్మోజీ రావు, తెలుగు లెక్చరర్
ప్రభావతి పబ్లికేషన్స్
రాజోలు, తూ.గో.జిల్లా., ఆంధ్రప్రదేష్.
Tuesday, April 12, 2016
20. Tonight I Can Write - poem by Pablo Neruda
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.
Saturday, April 9, 2016
19. Girl Lithe and Tawny - by Pablo Neruda
19. Girl Lithe and Tawny - by Pablo Neruda
చలాకీ నల్ల పిల్లా
పండ్లకు రూపాన్ని, గింజలకు నిండుతనాన్ని
సముద్రనాచుకు వంపులను ఇచ్చే సూర్యుడు
నీ దేహంనిండా ఆనందాన్ని, కనులలో కాంతిని
పెదవులపై నీటి దరహాసాలనూ నింపాడు.
నీ నల్లని కురుల పాయలలో నలుపు కోర్కెల సూర్యుడు పెనవేసుకొని ఉన్నాడు.
నీవు సెలయేరుతో క్రీడించినట్లే, సూర్యునితోకూడా ఆటలాడతావు.
నీ కనులు రెండు నల్లని సరోవరాలు.
చలాకీ నల్ల పిల్లా
నీ వైపుకు నన్నాకర్షించేదేమీ లేదు.
ప్రతీదీ నన్ను నీనుంచి దూరం చేసేదే. నీవేదో మిట్టమధ్యాహ్నపు వేళైనట్లు.
నీవు తేనెటీగ అవిశ్రాంత యవ్వనానివి
కెరటాల ఉన్మత్త వినోదానివి. వరి కంకుల దాగిన బలానివి
నీ చలాకీ దేహమంటే నాకిష్టం. నీ సన్నని ప్రవహించే స్వరం అంటే నాకిష్టం.
నా దుఃఖిత హృదయం నిన్ను నిత్యం అన్వేషిస్తూనే ఉంటుంది.
నల్లని సీతాకోకచిలుకా!
వరిచేను సూర్యుడు నీరు సారాయిల్లా నీవు చాలా స్పష్టమైనదానవు.
స్వేచ్ఛానువాదం: బొల్లోజు బాబా (Feb - 2010)
