తెల్లని కాంతులీనే కొంగొకటి
ఓ ఊరి చెరువుగట్టుపై వాలింది
గొప్ప తేజస్సుతో, రాజసంతో ప్రకాశిస్తోన్న
దాని చుట్టూ ఊరి కొంగలు చేరాయి.
'ఎక్కడనుంచి వచ్చావు నీవు?'
'హిమాలయాలలోని మానససరోవరం నుంచి'
'మీ ఊరి విశేషాలు చెప్పు'
'సమీపాన రజతకాంతుల కైలాసశిఖరం
పవిత్ర జలాలతో నిండిన సరోవరం
దేవతలు స్నానించే నెలవు
ఒడ్డున కొలువుదీరిన కల్పవృక్షం
దివ్యకొలనునిండా స్వర్ణ పద్మాలు, మంచి ముత్యాలు'
'మరి నత్తలు... నత్తలుంటాయా మీ ఊరి చెరువులో'
'నత్తలు అంటే?'
'నత్తలంటే తెలియదా.... హవ్వ...'
అంటూ పకపకా నవ్వుకొంటూ ఎగిరిపోయాయి ఊరికొంగలు
కొన్నాళ్లకు
అమృతజలాలు లభించక
నత్తల్నెలా పగలగొట్టుకొని తినాలో తెలియక
మానససరోవరపు కొంగ కృశించి కృశించి
ఆ చెరువు గట్టునే చచ్చిపోయింది.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
ReplyDeleteవచ్చెను తెల్లని కొంగయు
తెచ్చెను మానస జిలేబి తెమ్మర జూడన్ !
పృచ్చెను ఊరిన కొంగలు
జచ్చెను నత్తను తెలియక జవసత్వముబో !
బ్యూటిఫుల్ సర్. థాంక్యూ
Delete