Friday, September 25, 2009

Broken love


ఆమె లేని ఎడారిని
గ్లాసులతో ఎత్తుకొని
తాగీ తాగీ అతను
పాత చీకట్లలో కరిగిపోయాడు.

రాత్రి చలికి ఆమె చనిపోయింది.
తన సంచిలో, బట్టల అడుగున
నూనూగుమీసాలతో నవ్వుతున్న
నలిగిన అతని ఫొటో.

ఇన్నాళ్లూ పిచ్చిదనుకొన్నాం ఆమెను.

వైఫల్య రధానికి
దౌర్భల్యం, కన్నీళ్లు
రెందు చక్రాలు.

బొల్లోజు బాబా

5 comments:

  1. ఒక్కసారే దిగులు ఆవరించింది.

    ReplyDelete
  2. ప్చ్ వైఫల్యం ఇంత దీనంగా అంతమైందా?

    ReplyDelete
  3. ఆమె లేని ఎడారిని
    గ్లాసులతో ఎత్తుకొని
    తాగీ తాగీ అతను
    పాత చీకట్లలో కరిగిపోయాడు.
    బాగా చెప్పారు సార్, వైఫల్య రధానికి దౌర్బల్యం, కన్నీళ్ళు రెండు చక్రాలు. మంచి విశ్లేషణనిచ్చారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఆమె లేని ఎడారిని
    గ్లాసులతో ఎత్తుకొని
    తాగీ తాగీ అతను
    పాత చీకట్లలో కరిగిపోయాడు.
    చాలా బాగుంది.
    మనసంతా దిగులుతో నిండి పొయింది.
    రోడ్డుమీద ఎంతోమంది పిచ్చి వాళ్ళని, బిచ్చగాళ్ళని చూస్తూంటాం.ప్రతివాని కి ఒక కధ ఉంటుంది.ప్రతి కధలోను ఒక వేదన,ఒక పోరాటం,ఒక ఓటమి
    ఉంటాయి.
    చివరి లైనులో..పాత చీకట్లు అంటే...
    పాత బాధలా, స్మృతులా.. మరణమా ..లేక..?
    వైఫల్య రధానికి దౌర్బల్యం, కన్నీళ్ళు రెండు చక్రాలు...మంచి పోలిక..ఆ రధ సారధి ఓ జోకర్. అతనెవరు? మనిషా? దేవుడా?
    బాబా గారూ ప్రస్తుతం మీ రవీంద్రుని అనువాదం చదువుతున్నాను..

    ReplyDelete