Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Thursday, July 18, 2013

స్వప్నమునందు నిదురించువారు ధన్యులు…..


నాకూ నా అంతరాత్మకు
ఈ మధ్య అస్సలు పడటం లేదు
నే చేసే పనులపట్ల
వాడు చాలా కోపంగా ఉంటున్నాడు
అరిచి గోల చేస్తున్నాడు
నేనో హరిత పంజరంలో చిక్కుకొన్న
పక్షినని ఎంత చెప్పినా వినడు
“నాతో చెప్పద్దు, నీ ఇష్టం
వచ్చినట్లు చేసుకో” అంటో
చీదరించుకొంటాడు

ఆమె బేల చూపుల్ని విదిలించుకొని
వచ్చేసిన రోజయితే
వాడు తన బలమైన చేతులతో
నన్ను కుదిపేస్తూ
ఉక్కిరిబిక్కిరి చేసేసాడు

గడియారం టిక్కు టిక్కు మంటో
దగ్గుతున్నట్లుగా...
తెల్లని కంటిపాపపై
వెంట్రుకలు మొలిచినట్లుగా...
ప్రాణపాము తన బట్టల్ని విడిచి
ఎటో వెళిపోయినట్లుగా  .........  జీవితం

ఇలాగయితే సుఖం లేదని
ఓ రోజు గోదారి ఒడ్డుకు వెళ్ళి
వాడితో మాట్లాడటం మొదలుపెట్టాను
కాసేపటికి నా కళ్ళమ్మట నీళ్ళు
ఇద్దరం భోరు భోరున ఏడ్చుకొన్నాం
చాలాసేపు మౌనం తరువాత
“నువ్వు మాత్రం ఏం చేస్తావులే”
అని వాడు గొణుక్కోవటం వినిపించింది


బొల్లోజు బాబా

Friday, February 17, 2012

మూడు సంసారాలు...


కొట్టునుంచొచ్చిన భర్తకు
వడకట్టిన చెరువునీళ్ళను
దోసకాయ చెంబుతో ఇచ్చి
మామ్మ మేనత్తల జడలు
ముడివేసిన ఘనకార్యానికి
గంతులువేస్తున్న పిల్లలను వారించి
కుంపట్లోని చల్లారిన వంకాయతో
పచ్చిపులుసు చేయటానికి
వంటింట్లోకి వెళ్ళింది -  నాయినమ్మ

పేపర్లు దిద్దుతున్న భర్తకు
స్టీలు ప్లేటుతో జంతికలు ఇచ్చి
ఎక్కడెక్కడో ఆట్లాడుకొని వచ్చిన పిల్లల్ని
కాళ్ళుకడుక్కొని పుస్తకాలు తియ్యమని చెప్పి,
స్టవ్ వెలిగించి టీ పెడుతూ
“రాత్రికి కూరేంచేయమంటారూ” అంది  -  అమ్మ

ఆఫీసు బడలికను విదిలించుకొని
పిల్లల రీడింగ్ రూమ్ డోర్ దగ్గరకు వేసి
ఫ్రీజర్ లోని కర్రీని ఓవెన్ లో ఉంచి
డ్యూటీకి వెళ్ళేముందు నేపెట్టిఉంచిన
గ్రీన్ టీ ని ఫ్లాస్క్ నుంచి కప్ లో ఒంపుకొని
సోఫాలో కూర్చొని తాగుతూ
రిమోట్ తో టీవి ఆన్ చేసింది  -  నా భార్య

బొల్లోజు బాబా

Wednesday, February 1, 2012

ఫ్రాగ్మెంట్స్ 6

1.  వానచినుకూ
     సాగర హృదయం
     ఒకరిలోకి మరొకరు
     కరిగిపోతూ మరలా
     మిత్రులైపోయారు

2.  ఒకే ఒక్క రాగంతో
     చిమ్మెట
     తెల్లారేదాకా
     సూర్యుడ్ని
     పైకి లేవనియ్యలేదు

3.  అమావాస్య రాత్రి
     చందమామ
     శకలాలు శకలాలుగా
     విడిపోయి
     తిరుగుతోంది భువిపై
     మిణుగురుల రూపంలో

4.  చికన్ కూర
     అమ్మ వడ్డించింది
     మెత్తని ముక్కలన్నీ
     మాయమయ్యాయి


5.  ఆ కాన్సర్ పిలగాని
     నవ్వు
     కన్నీళ్ళ కన్నా
     ఎక్కువ
     బాధిస్తోంది


బొల్లోజు బాబా




Friday, December 23, 2011

దొరికిన దొంగ .....

కొబ్బరి కాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారంటే
చూట్టానికి వెళ్ళాను.
అతను తల దించుకొని ఉన్నాడు
చీప్ లిక్కర్ వాసన గుప్పుమంటోంది.
వ్యసనం అతని ఆత్మను తినేసింది
ఆత్మ లేని ఆ వికార దేహం
రక్త గడ్డలా ఉంది.
వాడి కుటుంబాన్ని తల్చుకొంటే జాలనిపిచింది.
వీధికొక్కటి చొప్పున 
వెలిసిన గిలిటన్ల వేట్లకు
ఊర్లకు ఊర్లు కబేళాలుగా 
మారుతున్న దృశ్యశకలమిది.
ఉన్నది కనుక తాగుతున్నారు
తాగుతున్నారు కనుక ఉంచుతున్నాం
నరంలేనిదే నాలుక కదా!
లిక్కర్  వైద్యం  ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా అంటూ
ప్రాణం చుట్టూ అన్ని
వ్యాపారాలు ముడివేసుకొన్నపుడు
జీవితం ఎంత చవకో 
అతణ్ణి చూస్తే అర్ధమౌతుంది.

“ఇది వరకు తిండి కోసం దొంగతనాలు చేసేవారు
ఇప్పుడు మందుకోసం చేస్తున్నారు” ఎవరో పెద్దాయన
గొణుక్కొంటున్నాడు.

అభివృద్ధంటే అదేనేమో!


బొల్లోజు బాబా

Monday, May 9, 2011

న్యాయాధిపతి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా చిన్నారి గురించి 
నువ్వెన్ని మాటలు చెప్పినా
నాకు తెలుసు వాని దోషాలు.
ఉత్తమమైనవాడని కాదు 
నేను వాడిని ప్రేమించేది
నా చిన్నారి శిశువు కనుక.

వాని అర్హతలను దోషాలతో తూకం వేసే మీకు
వాడు నాకెంత ప్రియమైన వాడో 
ఎలా తెలుస్తుంది?

వాడిని దండించేటపుడు 
వాడు నాలో భాగమై ఉంటాడు.

వాడికి కంటనీరు తెప్పించేటపుడు
వానితో కలసి నా  హృదయమూ ఏడుస్తుంది.

వాడిని నిందించటానికి కానీ 
దండించటానికి కానీ
నాకే అధికారముంది ఎందుకంటే
ఎవరైతే ప్రేమిస్తారో వారే శిక్షించగలరు.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Judge గీతం)

బొల్లోజు బాబా

Saturday, May 7, 2011

సిద్ధాంతి (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)



నేనన్నానూ

"మునిమాపు వేళ నిండుచందమామ ఆ కాదంబరీ చెట్టు
కొమ్మలలో చిక్కుకున్నది.  ఎవరైనా దానిని అందుకోగలరా?" అని

పెద్దన్నయ్య నవ్వి "నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు, చెల్లీ!
చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరూ?" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నువ్వెంత అమాయకుడవూ!  మనం ఆడుకొనేపుడు
కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? అని

నీవు నిజంగా తెలివి మాలిన దానవే! చందమామ పట్టేంత పెద్దవల
నీవు సంపాదించగలవా? అన్నాడు

నేనన్నానూ
"నీ చేతులతోనే పట్టుకోగలవు" అని

అన్న మళ్ళీ నవ్వి "నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే
నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?

"నీవు తెలివి తక్కువ పిల్లవే" అన్న ఇంకా అంటూనే ఉన్నాడు.



(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Astronomer గీతం)



బొల్లోజు బాబా


Tuesday, January 11, 2011

21 వ శతాబ్దానికి కవిత్వం అక్కరలేదా?

ఈ మధ్య ఆంధ్రప్రదేష్ మీడియా కబుర్లు బ్లాగరి, రాముగారు “కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతికశాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదుశాతమే” అంటూ కవిత్వంపై  ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చూసి ఆశ్చర్యం కలిగింది.  ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు.  దశాబ్దాలుగా రచనారంగంలో ఉన్నవారే.   
అంతేకాక ఈ మధ్య విడుదల అయిన ఒక కవితా సంకలనంపై బ్లాగుల్లో జరిగిన వాద ప్రతివాదాలు అందరికీ తెలిసినవే. ఈ సందర్భంగా Does Poetry matter in 21 centuary అనే పేరుతో ఒక వెబ్ సైట్ లో జరిగిన డిబేట్ నన్ను ఆకర్షించింది. అందులోని కొన్ని ఆశక్తి కరమైన అంశాలను సంక్షిప్తీకరించి పెడుతున్నాను.

కవిత్వానికి అనుకూల వాదనలు
ఇరవయ్యొకటవ శతాబ్దంలో కవిత్వం పాత్ర పదిలమే. ఇది మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుందా అంటే చేస్తూనే ఉంటుందనే చెప్పుకోవాలి. వేల సంవత్సరాల క్రితం నాటి కవిత్వాన్ని శ్లోకాల (psalms) రూపంలో మనం ఇంకా ఉటంకించటం లేదా? షేక్స్ పియర్ ’టుబి అర్ నాటు బి’ -- రాబర్ట్ ఫ్రాస్ట్ “Two roads diverged in a wood, and I took the one less traveled by, And that has made all the difference." లేదా The woods are lovely, dark and deep, But I have promises to keep, And miles to go before I sleep, And miles to go before I sleep."  వంటి వాక్యాలలో అర్థం, ఉద్వేగం నేటికీ నిలిచే ఉన్నాయి.  ఇలాంటివి మనలను కదిలిస్తూనే ఉంటాయి.  మనం కూడా వాటిని తరవాతి తరాలకు కదిలిస్తూనే ఉంటాము. --- రిక్ బెవెరా

హృదయ కెలిడియోస్కోపుతో సృజనలోతుల అన్వేషణకు, ఆత్మ ఆవిష్కరణకు, ఈ ప్రపంచాన్ని రంగులలో ఆవిష్కరించటానికీ కవిత్వమొక్కటే శరణ్యం. మనల్ని పరిపూర్ణం చేసే మాధ్యమమే కవిత్వం. మనల్ని పారవశ్యంలోకో లేక మానవ గాయాల్లోకో తీసుకెళ్ళే అంతర్ చిత్రాలు, సంకేతాలు, భావనలు వ్యక్తీకరణల సమాహారమే కవిత్వం.  కవిత్వం లేకపోతే మానవ హృదయాన్ని ఆత్మను అర్ధం చేసుకోవటంలో ఒక శూన్యత నెలకొని ఉంటుంది. – చెర్రీ లార్సన్

గతంలో కవులు రాజాశ్రయంలో ఉండేవారు. చనిపోయిన వందల సంవత్సరాల తరువాతకూడా వారి స్మరణ జరిగేది.  కానీ నేటి మల్టిమీడియా ప్రపంచంలో, రియాల్టీ షోలు, ప్లాస్మాటీవీల జోరులో దృశ్య మాధ్యమం లేని ఉత్త పదాలు బలమైన భావోద్వేగాలని సృష్టించగలవా అని ప్రశ్నించకుండా ఉండలేం.  అయినప్పటికీ కవిత్వానికి నేటికీ ప్రాధాన్యత ఉందనే నేను నమ్ముతున్నాను. నేటి కవులు పూర్వపు కవులవలె సెలిబ్రిటీలు కాకపోవచ్చు.  కానీ కవిపలికే ప్రతీ పదానికీ అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, ప్రతీ మనిషి ఒక్కో జీవితాన్ని ఒక్కో దారిలో జీవిస్తున్నాడు, నీదారిని నేను చూడలేకపోయినా నాదారిని నీవు చూడలేకున్నా, ఒకరి జీవితాల్ని, హృదయాల్ని, అనుభవాల్ని  మరొకరికి చూపించాలంటే నేటికీ సాహిత్యమే శరణ్యం.   అక్షరాలే మానవాళిని అనుసంధానం చేసే సాధనాలు.  -- క్రిస్ట్లె హార్నాండెజ్

కవిత్వం అనేది ఈ శతాబ్దానికి తగినట్లుగా మారుతూ వస్తున్నది. ఇది వరకట్లా అది క్లిష్టంగా, అర్ధంకాని విధంగా ఉండటం లేదు.  వాడుక భాష లో వ్రాసిన కవిత్వం ప్రాచుర్యం పొందుతూంది. నేటి రాప్/సినీ గీతాలలో మంచి కవిత్వం తొణికిసలాడుతున్నది. నేడు కవిత్వం కనిపించే మరో రంగం గ్రీటింగ్ కార్డుల అభినందనల్లో (ఇదో చిల్లర ఉదాహరణ కావొచ్చునేమో) కవిత్వం అద్బుతంగా ఉంటోంది.  నర్సరీ రైములలో కవిత్వం పాళ్ళు తక్కువేమీ కాదు.  కవిత్వానికి మనమేం సెంచరీలో ఉన్నామో అన్న స్పృహఉందనే అనిపిస్తూంది. – మెలనీ మిల్లర్

మంచిగా రాసిన కవిత మానవ అనుభవానికి చిత్తరువు లాంటిది.  కవిత్వాశ్వాదన మన జీవితాల్ని పరిపూర్ణం చేస్తుంది.  సృజన లేని, రాజకీయంగా కరక్ట్ అభిప్రాయాలనే చెప్పాలని శాసిస్తున్న దశకం ఇది. పాత గ్రంధాలను ”రాజకీయంగా కరక్ట్”  చేస్తూ తిరిగి రాయలన్న అపవిత్ర చర్చలు జరుగుతున్న కాలమిది.  ఈ సందర్భంలో మన పిల్లలకు కవిత్వాన్ని అందించటం చాలా చాలా అవసరం.  కవిత్వాన్ని అర్ధం చేసుకోవటంలో నిశితమైన ఆలోచనా దృష్టి చదువరిలో ఏర్పడుతుంది. కవి ఎమి చెప్పదలచుకొన్నాడో మనం అర్ధం చేసుకొనే ప్రయత్నంలో మన ఆలోచనల, భావాల పరిధి పెరిగి మన దృక్కోణాన్ని తీక్షణ పరుస్తుంది.  – కారోల్ జియోలా

కవిత్వాన్ని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అర్ధం చేసుకొంటారు.  కొంతమందికి కవిత్వం అంటే స్కూలులో బట్టీవేయవలసి వచ్చే కొన్ని హింసాత్మక పారాగ్రాఫులు.  మరికొంతమందికి కవిత్వం అంటే అసలేమీ కాకపోవచ్చు.  మనం 21 వ శతాబ్దంలోకి వచ్చేసాం కదాని కవిత్వం అప్రస్తుతం అని భావించక్కరలేదు. ఎందుకంటే కవిత్వం అంటే ఒక వ్యక్తీకరణ, ఒక కళారూపం, ఒక కధారూపం. ఎలా అంటే  
కవిత్వం ఒక వ్యక్తీకరణ: కవిత్వాన్ని అర్ధం చేసుకోవటం సులువైన పనికాదు.  కవిత్వం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయంలో మనం తరచూ గందరగోళానికి గురవుతూంటాం.  కవిత్వం ఇలా ఉండాలని కవిత్వానికి సంబంధం లేని  కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకొంటాం. ఆ సూత్రాలకు అనుగుణంగా కవిత్వం రావటం లేదని బాధపడుతూంటాం.  ఎవరేమనుకొన్నప్పటికీ కవిత్వం అనేది కవియొక్క అభివ్యక్తి (expression).  ఇది వాని హృదయంనుంచో, మెదడులోంచో లేక ఆత్మలోతుల్లోంచో మొలకెత్తుతుంది. కొన్నిసార్లు ఇది మసకమసకగానో లేక ప్రకాశవంతంగానో బయటకు వస్తుంది.  ఇది కొన్ని దృశ్యాలను, ఉద్వేగాలను, ప్రేమను, ఆనందాన్ని, బాధను తెలియచేస్తూంటుంది.  ఏది ఏమైనప్పటికీ ఒక కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తనలోలోపల్లోంచి బయటకు తీసిన పదార్ధమే కవిత్వం.   
కవిత్వం ఒక  కళారూపం: జాక్స్ న్ పోల్లక్   (ఒక అబ్ స్ట్రాక్ట్ పెయింటరు) చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి  దానికి అర్ధం ఏమిటని అడగవచ్చు.  అదే చిత్రాన్ని చూసిన మరొకరు భావోద్వేగానికి గురయి చెమ్మగిల్లిన కళ్లతో వెనుతిరగవచ్చు.  రెండో వ్యక్తికి తెలుసు పోల్లక్ గీసిన చిత్రం లోని అర్ధమేమిటో.  కవిత్వం కూడా అంతే.  అందరికీ అర్ధం కావాలనేమీ లేదు.  అలాగని అందరికీ అర్ధం కాకుండా కూడా ఉండదు.  ఎందుకంటే కవిత్వమొక కళా రూపం అంతే.  కళా రూపం కనుక కవిత్వానికి ఉండాల్సిన విలువ ఉండాల్సిందే అది ఏ శతాబ్దమైనా.  
కవిత్వం ఒక కధ: హోమర్ కాలం నుంచి డికిన్ సన్ కాలం వరకూ కవిత్వం లో కధను చెప్పటం ఒక ప్రక్రియ.  అది గొప్ప గాధలు కావొచ్చు, లేక చిన్న చిన్న సంఘటనలు కావొచ్చు. కధలు అనేవి మానవ చరిత్రని లిఖించే శిలా శాసనాలు.
ఒకరు అక్షరీకరించిన రసాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం సులభం కాకపోవచ్చు కానీ ఒకరు ఆవిష్కరించిన రసం అప్రాధాన్యమైనదని తీర్మానించటం దుస్సాధ్యం అది ఏ శతాబ్దమైనప్పటికీ. – డనెల్లె కార్త్

21  వ శతాబ్దంలో కవిత్వం అంతరించిపోతున్న ఒక వ్యాపకంగాను,  సాంకేతికంగా వెనుకబడిన పాతకాలపు వ్యక్తులు కొనసాగిస్తున్న తెలివితక్కువ వ్యవహారం గాను మిగిలిపోయింది.  అక్కడక్కడా కవిత్వసభలు జరుగుతున్నప్పటికీ, ఆహూతులలో,  తమ కవిత వినిపించే చాన్సు ఎప్పుడువస్తుందా అని ఎదురుచూసే కవులే ఉంటున్నారు.  ఒక నాటి కవులు పొందిన కీర్తిని  సినీ తారలు, క్రీడాకారులు, అరాచకంగా ఎత్తులకెదిగిన కొద్దిమంది హైజాక్ చేసేసారు.  ఇది సమాజానికి మంచిది కాదు, ఇప్పుడే కవిత్వావసరం సమాజానికి మరింత ఎక్కువ.  ఎందుకంటే జెట్టు స్పీడులో పోతున్న ఈ ప్రపంచానికి, కవిత్వం కాసేపు ఆగి లోతుగా ఆలోచించుకొనే అవకాసాన్నిస్తుంది. మెదడుకు పనిచెప్పే క్రాస్ వర్డ్ పజిల్స్ లేదా సుడొకు లాంటి ఆటల్లో ఆలోచనా పరిధి పరిమితంగా ఉంటుంది.  (జవాబు వస్తే ఇక ఆట ముగిసినట్లే).  కానీ కవిత్వంలో వస్తువు, వాక్య నిర్మాణం, భాష ప్రయోగం, పదాల ఎంపిక వంటి విషయాలలో అనంతమైన అవకాశాలు ఉంటాయి.  కనుక కవిత్వం మనసుకు ఆత్మకు స్వేఛ్చనిస్తుంది.
కవిత్వం మన ఎమోషన్లకు అద్బుతమైన మార్గం చూపిస్తుంది.  మన బాధలకు, నిరాశలకు, కోపానికి, ఒత్తిడులకు చక్కటి అవుట్ లెట్ ను కళాత్మకంగా కల్పించి మంచి పరిష్కారమార్గాల్ని సూచిస్తుంది.   – అల్లన్ ఎమ్ హెల్లెర్

వ్యతిరేక వాదనలు
కవిత్వం చచ్చిపోతూన్నదా లేక అదింకా జీవం ఉన్న కళారూపమా? అన్న ప్రశ్న ఈ చారిత్రిక సంధికాలంలో తలెత్తటం సహజమే.  కవిత్వం అనేది మౌఖిక ప్రక్రియద్వారా తరతరాలుగా అందించబడిన ఒక కళారూపం. 
చరిత్రను గమనిస్తే- పబ్లిక్ రంగము, వ్యక్తిగత రంగాలు విస్పష్టంగా ఉండేవి.  ఇల్లు వ్యక్తిగతమైన రంగం గాను, ప్రదర్శన శాలలు/రాజ సభలు పబ్లిక్ రంగాలుగా పనిచేసేవి.  ఈ ప్రదర్శన శాలలలో కళాకారులు, కవులు వారివారి కళలను సభికులముందు ప్రదర్శించేవారు.  వాటి  మంచి చెడ్డలను అక్కడ చర్చించటం జరిగేది.  ఇందులో కళల ప్రదర్శన కు మౌఖికరూప ప్రక్రియ ప్రధాన పాత్ర వహించేది.  నేడు అట్లాంటి ప్రదర్శన శాలలు అంతరించిపోయాయి.  వాటి స్థానాన్ని దృశ్యరూప మాద్యమం ఆక్రమించింది.  ఇలాంటి దృశ్య ఆధారిత కళల ప్రదర్శనా వాతావరణంలో చాలా కళారూపాలు అంతరించటం మొదలైంది.  అందుకనే పత్రికల, పుస్తకాల అమ్మకాలు పడిపోయాయి. కవిత్వం ముఖ్యంగా ఒక శబ్దాధారిత ప్రక్రియ. కనుక అంతరించక తప్పదు.  ఈ దృశ్యాధారిత మాద్యమ ప్రభంజనంలో కవిత్వం అనేది ఒక తెల్లకాగితం పై వ్రాసిన అక్షరాలు మాత్రమే – చాలా సందర్భాలలో ఆ తెల్లకాగితం విలువకూడా లేని.  – హ్యూమా రషిద్

19  వ శతాబ్దం వరకూ కవిత్వమే అత్యున్నతమైన సాహిత్య ప్రక్రియ.  కధ లేదా నవలా ప్రక్రియ అప్పటికే ఉన్నప్పటికీ ఆకాలంలో కవులకు వచ్చినంత పేరు రచయితలకు రాలేదు. ఈనాటి చాలామందికి ఆనాటి రచయితల పేర్లే తెలియవు.   కానీ ఇరవయ్యవ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి తారుమారయ్యింది.  నేడు కవి కంటే రచయిత ప్రముఖుడుగా చలామణీ అయ్యే పరిస్థితి వచ్చింది.  నేడు చాలా మంది ఔత్సాహిక కవులకు కవిత్వం అనేది ఒక మానసిక అవుట్ లెట్ గా మారిపోయిందనటంలో సందేహం లేదు.  సార్వజనీనత కోల్పోయింది.  ఏదో కొద్దిమందికే అర్ధం అయ్యే ప్రక్రియగా మారిపోయింది.  కవిత్వం స్వీయనిర్మిత శిఖరం నుంచి దిగివచ్చి, మేధోపరంగా తాజాగా తయారయి, ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడే అది నేటి మల్టిమీడియా దాడిని ఎదుర్కొని నిలబడగలదు.   – లెప్లెన్

కవిత్వం నేడు డబ్బునిచ్చే ప్రక్రియ కాదు.  డబ్బులేని ప్రక్రియలు బతికే అవకాశాలు లేవు. -- సాండీ షాన్

ప్రస్తుతకాలం హారీపోటర్, ది సింప్సన్ సినిమాలు, Myspace,  sms ల  ప్రపంచం.  ఇవే నేటి కాలపు కళారూపాలు, వ్యక్తీకరణ మాధ్యమాలు.   ఒకప్పుడు కవులు రాక్ స్టార్ లకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు. కానీ ఈ రోజు కవులు ఏవో స్థానిక పత్రికల్లో ఎక్కడో ఓ మూల తమ కవిత  పబ్లిష్ అయితే చాలులే అనే స్థాయికి చేరుకొన్నారు.  మనలో ఎంతమంది 1970  ల తరువాత వచ్చిన కవులలోని ఓ ముగ్గురి పేర్లు చెప్పమంటే టకటకా చెప్పగలరు?
మనలో ఎంతమంది ప్రతిరోజూ కవిత్వం చదువుతున్నారు.  నిన్నచదివిన నవలలానో లేక చూసిన సినిమాలానో ఎంతమంది తమమిత్రుల వద్ద తాము చదివిన కవిత్వం గురించి చర్చిస్తున్నారు?  దురదృష్టవశాత్తు కవిత్వం తన మాస్ అప్పీల్ ను కోల్పోయింది.  కవియొక్క మేధోశక్తిని, శ్రమని సమాజం హర్షించే స్థితిలో లేదు.  యవ్వనంలో ఉన్న ఈ శతాబ్దం హారీపోటర్ పేజీలు తిప్పుకొంటోంది.  – సి.సి. వాగో


భవదీయుడు
(ఈ పోస్టుకు ఇంట్రోగా రాముగారిని తీసుకోవటం ఆయనను నొప్పిస్తే క్షంతవ్యుడను.  పై అభిప్రాయాలలో – చెర్రీ లార్సన్ భావాలతో నేను ఏకీభవిస్తాను.  పై వ్యాఖ్యలు ప్రపంచ కవిత్వధోరణులని ప్రతిబింబించినా తెలుగులో కూడా అదే పరిస్థితి  ఉంది —బొల్లోజు బాబా)

Thursday, June 3, 2010

ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవిత ప్రస్తావన .....

 ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవితల ప్రస్తావన .....

వ్యాసకర్త సాంధ్యశ్రీ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



ఈ పాపికొండల్నే మరో కవి దర్శించాడు. ఆ నదీ నీటి బిందువులోంచి మధుర నాదం విన్పించిందట. అక్కడి ప్రజలగుండెల్లో ఆ నదికీ ఆ కొండలకీ గొప్ప మహత్తు ఉందంటున్నారు ఆ నది పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్‌లా జాలర్లకు చేపలు పంచుతోందంటున్నాడు. ''నదికి అడ్డంగా పెద్దకొండ / ప్రవాహం ఆగలేదు/ మలుపు తీసుకొంది/ జీవితంలానే / డామ్‌ సంకెళ్లు వేయించుకోబోతున్న / ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే జాలేస్తుంది/ ఇకపై కూడికలు, తీసివేతలు ప్రకారం ప్రవహించాలి / ఒక్క క్షణం ఆగానో లేదో/ నది నన్ను దాటుకొని / నవ్వు కొంటూ వెళ్లిపోయింది. -  బొల్లోజు బాబా

పూర్తి వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదవగలరు
http://www.andhraprabha.in/search/article-112855

Thursday, April 29, 2010

తపస్సు

చెట్ల ఆకులు
ధ్యాన ముద్రలో ఉన్నాయి
కొలను అలలు కూడా వాటిని
కలచ సాహసించటం లేదు
నీడ పొడలు నిశ్శబ్దంగా
తొంగిఛూస్తున్నాయి.
పరిమళాల సంచారం
నిలచిపోయింది.


నిశ్చల దృశ్యానికి
ఓ రికామీ తెమ్మెర
చక్కిలిగిలి పెట్టిపోయింది


పూలు అంతవరకూ బంధించిన
సుగంధాలు రివ్వున ఎగిసాయి.
కొలను అలలలలుగా తృళ్లిపడింది.
నీడపొడల అల్లరి
మళ్లీ మొదలైంది.


ఆకులు గలగలా నవ్వేసాయి
ధ్యానం ఫలించినందుకు


బొల్లోజు బాబా

Saturday, March 13, 2010

చిన్న చిక్కు- Chandrakant Deotale

"నా వద్ద కొద్దిపాటి స్థలముంటే
కుమ్మరి వద్దనుంచి కొన్ని ఇటుకలను
అరువు పుచ్చుకొని
ఓ గుడెసెను నిర్మించుకొనేవాడిని
వెదురుకర్రలు మాత్రమే నా వద్ద లేవు"

అతనలా చెప్పినప్పటి నుంచీ
నేను అన్వేషిస్తూనే ఉన్నాను
కొన్ని వెదురుకర్రలు సంపాదించి అతనికిద్దామని.


అతనికి కొద్దిపాటి స్థలముంటే
అతను కుమ్మరి నుండి ఇటుకలను
అరువు తెచ్చుకోగలడు కనుక
ఓ చిన్న గుడిసె తయారయిపోయి ఉండేది.

మేమలా సాగుతుండగా
సముద్రం ఆకాశం అంతేలేని భూమి
కనిపించాయి
ఈ మూడూ ఎవరికీ చెంది లేవు
మేము వెంటనే అరిచాం
ఇది మా సముద్రం మా ఆకాశం మా భూమి అని.

ఆ మూడింటినీ
మా పిడికిళ్ళలో కానీ కళ్లల్లో
చేతులలో కానీ నింపుకోలేకపోయాం.
కనీసం ఓ ముక్క ఆకాశాన్నో ఓ చెక్క భూమినో
సముద్రాన్నో అమ్ముకోలేకపోయాం.
ఆ విధంగా మేము అనంతానికి అధిపతులయ్యాం

కానీ చిన్న చిక్కు మాత్రం అలానే
మిగిలిపోయింది మా ఇద్దరకూ.
అతనివద్ద స్థలం లేదు
నా వద్ద వెదురు కర్రలు లేవు.


మూలం:
"A Minor Difficulty With The Two Of Us" -- Chandrakant Deotale

అనువాదం: బొల్లోజు బాబా

Saturday, February 13, 2010

రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్

1. రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్ 
 రండి మీకు వీలు కుదిరినపుడు రండి 
మీకు వీలు కుదరనప్పటికీ రండి 
చేతులలో శక్తిలా 
నాళాలలో రక్తంలా రండి 
కుంపట్లోని సన్నని మౌన జ్వాలల్లా 
 రండి రండి 
వానల తరువాత మొలిచే తాజా తుమ్మ ముళ్లల్లే 
 రాలిపోయే రోజుల్లారా 
కూలిపోయే వాగ్దానాల్లారా 
రండి రండి 
మంగళవారం తరువాత వచ్చే 
బుధవారంలా రండి రండి 

 మూలం: COME WHEN YOU FIND THE TIME - KEDARNATH SINGH 

 2. పండు రుచి లా.... 
 ఆకాశంలో తారలు 
నీళ్లల్లో చేపలు 
గాలిలో ప్రాణవాయువు 
 సరిగ్గా అలానే 
ఈ భూమిపై నేను నువ్వు 
అనిలము 
మరణము 
దిరిసెన పూలు 
 అగ్గిపుల్ల తల 
ఇంటి తలుపు 
వీపుపై కురుపు 
పండు రుచి 
 సరిగ్గా అలానే...... సరిగ్గా అలానే....... 

 మూలం:LIKE FLAVOUR OF FRUIT - KEDARNATH SINGH 

 భవదీయుడు బొల్లోజు బాబా

Monday, February 8, 2010

దేవుడు లేకుండానే!


శ్రీ కేదార్ నాధ్ సింగ్ (1934) ప్రముఖ ఆధునిక హిందీ కవి. వీరు రచించిన Akaal Mein Saras (Cranes in Drought) సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. శ్రీ కేదార్ నాధ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో హిందీ భాషా ప్రొఫసరుగా పనిచేసారు.

వీరి కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన భావాల్ని కలిగి ఉంటుంది. ఈయన శైలి "బహుళ స్వరాలతో సంభాషణాయుతం" గా ఉంటుందని విమర్శకులు అంటారు.
రోజూ దర్శించే దైనందిక విషయాలే వీరి కవిత్వంలో గొప్ప నిగూఢార్ధంతో, ఒక నూతన దృష్టితో వర్ణింపబడుతూంటాయి.

స్థూలంగా చెప్పాలంటే్, శిల్పం పట్ల మక్కువ కలిగిన, ప్రయోగశీలి అయిన, ఒక మానవతావాద కవిగా శ్రీ కేదార్ నాథ్ సింగ్ గారిని చెప్పుకోవచ్చు.

శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God కు స్వేచ్ఛానువాదం ఇది. మరికొన్ని వీరి కవితానువాదాలు మరోసారి........

దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
ఉదయం పదికల్లా ఈ ప్రపంచం
తన పని తాను చేసుకుపోతోంది
దేవుడు లేకుండానే!

వాహనాలు నిండిపోయాయి
జనాలు తొందరలో ఉన్నారు
ఎప్పట్లానే.

భుజానికి సంచి తగిలించుకొన్న
తపాలావాలా రోజూలానే
తిరుగుతున్నాడు
దేవుడు లేకుండానే!

బ్యాంకులు వేళకే తెరవబడ్డాయి
గడ్డి పెరుగుతూనే ఉంది
అన్ని లెక్కలూ ఎంత క్లిష్టమైనవైనా
చివరకు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి
జీవించాల్సిన వాళ్లు
జీవిస్తున్నారు
చనిపోవాల్సిన వాళ్లు
చనిపోతున్నారు
దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
రైళ్లు ఆలస్యంగానో సమయానికో
ఏదో గమ్యానికి వెళ్లటమో రావటమో
జరిగిపోతూనే ఉంది
ఎన్నికలు జరుగుతున్నాయి
ఆకాశంలో విమానాలు ఎగురుతూనే ఉన్నాయి
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
గుర్రాల సకిలింపు కొనసాగుతూంది
సాగరంలో ఉప్పు ఇంకా తయారవుతూనే ఉంది
అటూ ఇటూ పిచ్చిగా తిరిగిన పిచ్చుక
చివరకు ఎలానో
తన గూటికి తిరిగి చేరుకొంటూంది
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
నా విషాదం మునుపెన్నడూ లేనంత
చిక్కబడుతూనే ఉంది
పది సంవత్సరాల నా పాత ప్రియురాలి కురులు
ఎన్నడూ లేనంత నల్లనైనాయి
ఇంటినుంచి బయటకెళ్లి తిరిగి చేరుకోవటం
ఇంకా వ్యామోహం గానే ఉంది ఎప్పట్లానే

ఇదేమి వింత
నీరు ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం మధ్యలో చేతులు చాపి
అలా నుంచునే ఉంది వంతెన
దేవుడు లేకుండానే!

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God
బొల్లోజు బాబా

Saturday, February 6, 2010

స్త్రీ దేహం....... పాబ్లో నెరుడా

స్త్రీ దేహమా!
తెల్లని గిరులు, ఊరువులతో
నీవు వశమయిన ప్రపంచంలా కనిపిస్తున్నావు.
ధృఢమైన నా రైతు దేహం నిన్ను దున్నుతోంది
అవని లోతుల్లోని శిశువును పైకి తీసుకు రావటానికై.

నేనో సొరంగంలా ఒంటరినై ఉండేవాడిని.
పక్షులు నాలోంచి ఎగిరేవి.
రాత్రి ముట్టడి చేసి నన్ను ముంచెత్తేది.
నే బతకటం కోసమే నిన్నో ఆయుధంగా చేసుకొన్నాను
నా ధనస్సులో బాణంలా నా ఒడిసెలలో రాయిలా.

కానీ ప్రతీకార క్షణాలు కరిగిపోయాకా
నిన్ను ప్రేమిస్తున్నట్లు గ్రహించాను.
చర్మం, మట్టి, వాంఛ, చిక్కని పాలు నిండిన దేహానివి నీవు.
ఓహ్! చనుల ధ్వయం విరహ నేత్రాలు
కటిప్రాంత ఎర్రగులాబీలు సన్నని విషాద స్వరంతో నీవు.

ఓ నా స్త్రీ దేహమా!
నీ సౌందర్యంలోనే నా మనుగడ.
నీవే నా దాహానివి, అంతే లేని నా కోర్కెవు, మారిపోయె నా మార్గానివి.

చీకటి నదీ గర్భాన
ఆధ్యంతరహితమైన దాహం ప్రవహిస్తూంటుంది.
అనంతమైన బాధ అలుపు అనుసరిస్తూంటాయి.

బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా Body of woman కు స్వేచ్ఛానువాదం

Saturday, January 30, 2010

రచన (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అమ్మా,
నాన్న బోలెడన్ని పుస్తకాలు రాస్తారని నీ వంటావు కానీ ఆయనేం రాస్తారో నాకెపుడూ అర్ధం కాదు.
సాయింత్రం వేళలో నీకు చదివి వినిపిస్తూంటారు, ఆయన చెప్పేవన్నీ నీకు అర్ధమౌతాయా?

అమ్మా! నువ్వు మాకెంతో మంచి మంచి కధలు చెపుతావు! నాన్నెందుకలా రాయరూ అని నాకు ఆశ్చర్యమేస్తుంటుంది.

రాక్షసులు, రాకుమారిలు, మాంత్రికుల గురించిన కధల్ని నాన్న నాయినమ్మవద్ద వినలేదా?
అన్నీ మరచిపోయారా?

స్నానానికి ఆలస్యమౌతుందని వందసార్లన్నా పిలుస్తావు నీవు.

ఆయనకై ఎదురుచూస్తూ నీవు భోజనాన్ని వెచ్చచేస్తూ ఉంటావా, నాన్న మాత్రం అలా రాసుకుంటూనే ఉండి ఆ విషయాన్నే మరచిపోతారు. పుస్తకాలు రాసుకోవటం అనే ఆటలో నాన్న మునిగిపోతారు.

నేనెప్పుడయినా నాన్న గదిలో ఆడుకోవటానికి వెళితే “అల్లరెక్కువయింది నీకు” అంటూ నన్ను బయటకు పిలిచేస్తావు.
నేనేదైనా చిన్న శబ్దం చేస్తే చాలు “నాన్న పనిలో ఉన్నారు” కనపడటం లేదా” అంటావు.

ఎపుడు చూసినా అలా రాస్తూ ఉండటంలో ఏమానందముందీ?
నేనెపుడైనా నాన్న పెన్ను తీసుకొని ఆయన పుస్తకంపై తను రాసినట్లుగానే అ ఆ ఇ ఈ లు రాస్తే, నన్నెందుకు కోప్పడతావు? నాన్న రాస్తుంటే ఒక్కమాట కూడా అనవు.
నాన్న అలా కట్టలు కట్టలు కాగితాల్ని వృధా చేస్తుంటే నువ్వసలు పట్టించుకోవు.
కానీ నేనెపుడైనా పడవ చేసుకోవటానికి ఒకే ఒక్క కాగితం తీసుకుంటే మాత్రం “ఎన్ని తిప్పలు పెడుతున్నావురా కన్నా” అని కోప్పడతావు.

నాన్న అలా బోల్డన్ని కాగితాలను రెండువైపులా నల్లని రాతలతో నాశనం చేయటం పట్ల నీవేమనుకొంటున్నావూ?



మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని AUTHORSHIP

బొల్లోజు బాబా

Sunday, January 3, 2010

నా కవితాసంకలనంపై శ్రీ పి.ఆర్.ఎల్. స్వామి గారి స్పందన

శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి గారు యానాం కు చెందిన ప్రముఖ కవి. పాండిచేరీ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే కలైమామణి" బిరుదాంకితులు.వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరి కవిత్వం సరళంగా జీవితంలోని భిన్నపార్శ్వాలను తాకుతూ అలరింప చేస్తుంది . ఆధునిక, ప్రాచీన కవిత్వ ధారణ వీరి ప్రత్యేకత. ప్రముఖ కవుల కవితలను అనర్ఘళంగా గానం చేస్తూ అనేక ప్రదర్శనలను ఇచ్చారు. పలువురి ప్రశంసలు పొందారు.

నా కవితా సంకలనాన్ని చదివి మెచ్చుకొంటూ వారు వ్రాసి ఇచ్చిన కొన్ని వాక్యాలు ఇవి. వీటిలోని దాదాపు అన్ని పదాలు నా కవితా శీర్షికలైనప్పటికీ, దీనిని విడిగ చదివినా ఒక కవితలాగ అనిపించటం వీరి ప్రతిభకు నిదర్శనంగా, నా కవిత్వానికి లభించిన గౌరవంలా నేను భావిస్తున్నాను.

వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ......

భవదీయుడు
బొల్లోజు బాబా

తడి గీతం మీద పొడి సంతకం

మిత్రుడు......
సహృదయుడు....
బొల్లోజు బాబా వెన్నెల నావనెక్కి
ఆకుపచ్చని తడిగీతాన్ని శిల్పంలా చెక్కాడు
ఆ శబ్దానికి రాలిన పూలు
సుగంధాలను గానం చేస్తున్నాయి
కవికి అపరిచిత ప్రపంచంలో
బతకడం ఇష్టం ఉండదు.
అందుకే మట్టికనుల పల్లెతో
నిరంతరం కరచాలనం చేస్తూంటాడు.
ఇన్నాళ్లూ తనలో దాచుకున్న అనేకానేక
రహస్యాలతో పొగడ చెట్టుమీద
వెన్నెల పిట్టలా కాగితాలమీద వాలాడు.
అతని అక్షరాల సంగీతమేఘం
తేనెపాటాల్ని వర్షిస్తోంది.
అతని వాక్యాల వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతున్నాయి.
ఖాళీ రాత్రులలోంచి ఉదయించే జ్ఞాపకాలన్నీ
హాయగా సలపడం కోసం
బాబా జీవితాన్ని పుటలు పుటలు గా పరిచాడు
అతడికి ఒకే ఒక ఆశ
పుస్తకంలోకి నడవటం
ప్రతివేకువ జామున ముళ్లగాయాలను
స్పర్శిస్తూంటాడు.
కాంక్షాతీరా వెతుకులాటలో అతడి నిరీక్షణ
ఆకాశంలోకి తెరుచుకుంటుంది.
అతని గుండెలో
సుళ్లు తిరిగే కన్నీళ్లని, ఆశల్ని, ఆవేశాల్ని
కలల తెరపై చిత్రించుకుంటాడు.
కవి "సాహితీయానాన్ని"
గాలి, చెట్టు,పిట్టా
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
పోలవరం నిర్వాసితులకోసం
జీవనసౌందర్యాన్నే నిర్మించగల
ఈ కవి హృదయం
ఒక సూర్యుడు
ఒక నది.

కలైమామణి పి.ఆర్.ఎల్. స్వామి



Friday, December 18, 2009

నీ దేహ అట్లాసు...... పాబ్లో నెరుడా

నీ దేహ అట్లాసును చిత్రిస్తున్నాను, నిప్పు రేఖలతో.
దప్పిగొన్న పిరికి సాలీడులాంటి నాపెదవులతో
నీలోకి, నీలోలోకి దూరిపోతున్నాను.

ఓ ముద్దుగుమ్మా!
ఈ సాయింత్రపు తీరంపై నిను సంతోషపెట్టటానికి
ఎన్ని కధలున్నాయో! ఒక కొంగ, ఒక చెట్టు, సుదూర ఆనందాలు,
మాగిన ఫలాలతో నిండిన ఈ ద్రాక్షఋతువు, ఇంకా మరెన్నో.

ఈ రేవులో సంచరిస్తూ, నిను ప్రేమిస్తూ నేను.
నా ఒంటరితనం
కలలతో మౌనంతో పెనవేసుకొంది.
సంద్రానికి దుఖా:నికి మధ్య చిక్కుకుపోయింది.
ఆ ఇద్దరు నిశ్చల నావికుల మధ్య నిశ్శబ్ధ మత్తులో జోగుతున్నది.

పెదాలకు స్వరానికి మధ్యనేదో అదృశ్యమౌతున్నది.
పక్షిరెక్కలతో ఉన్నదేదో! వేదనో లేక మైమరుపు లాంటిదేదో!
నా ముద్దుగుమ్మా
నీటిని వల చిక్కించుకోలేకపోయినా
ఏవో కొన్ని బిందువులు వేలాడినట్లుగా
జారిపడ్డ ఈ పదాలలోంచి ఏదో గీతం వినిపిస్తుంది.
ఏదో గీతం నా ఆకలిగొన్న పెదవులపైకి ఎగబాకుతున్నది.

పాడనా, దహించుకుపోనా, పర్వులిడనా పిచ్చివాని చేతి మువ్వలకర్రలా.
నా విషాద మృధుత్వమా
అకస్మాత్తుగా నిను ముంచెత్తేది ఏమిటనుకొంటున్నావు?
నేను సుందర శైత్యశిఖరాన్ని చేరినప్పుడు
నా హృదయం రాత్రి పూవు వలె ముడుచుకొంటుంది.


I Have Gone Marking

I have gone marking the atlas of your body
with crosses of fire.
My mouth went across: a spider trying to hide.
In you, behind you, timid, driven by thirst.

Stories to tell you on the shore of the evening,
sad and gentle doll, so that you should not be sad.
A swan, a tree, something far away and happy.
The season of grapes, the ripe and fruitful season.

I who lived in a harbour from which I loved you.
The solitude crossed with dream and with silence.
Penned up between the sea and sadness.
Soundless, delirious, between two motionless gondoliers.

Between the lips and the voice something goes dying.
Something with the wings of a bird, something
of anguish and oblivion.

The way nets cannot hold water.
My toy doll, only a few drops are left trembling.
Even so, something sings in these fugitive words.
Something sings, something climbs to my ravenous mouth.
Oh to be able to celebrate you with all the words of joy.

Sing, burn, flee, like a belfry at the hands of a madman.
My sad tenderness, what comes over you all at once?
When I have reached the most awesome and the coldest summit
my heart closes like a nocturnal flower.

బొల్లోజు బాబా

Wednesday, December 16, 2009

బంధన ఛాయ – పుస్తక సమీక్ష

పుస్తకం నెట్ లో ప్రచురించబడిన బంధన ఛాయ కవితా సంకలన పరిచయాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.

http://pustakam.net/?p=2832&cpage=1

భవదీయుడు
బొల్లోజు బాబా

Tuesday, November 17, 2009

వృద్ద జంట



తేనెవానల్ని కురిపించిన
వెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
స్వర్ణ వాసనల్ని ఎగరేసిన
జాజులు నేలకొరిగాయి.
ఇంధ్రధనస్సులపై
స్వారీ చేసిన మహోద్రేకాలు
ఇక శలవన్నాయి.

నే పూయించిన
విజయాలు కరిగిపోయాయి.
నే సాగించిన
యుద్దాలు ముగిసిపోయాయి.
నే మొలిపించిన
స్వప్నాలు వెలిసిపోయాయి.

నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

ఈ దుర్భల దేహానికి
కాస్తంత
నమ్మికనివ్వటానికి
నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

బొల్లోజు బాబా

Tuesday, November 3, 2009

పుస్తకం నెట్ లో ఒక పరిచయ వ్యాసం

ఆకెళ్ల రవి ప్రకాష్ – “ఇసక గుడి” కవితా సంకలనంపై పుస్తకం.నెట్ లో ప్రచురింపబడిన నా పరిచయ వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదువు కొనవచ్చును


http://pustakam.net/?p=2276

Saturday, October 17, 2009

వైచిత్రి

వాన దాడికి
గుడ్లు మోసుకుంటూ
చీమలు తలో దిక్కుకూ
పరుగులెడుతున్నాయి.

కప్పల సంగీతోత్సవానికి
కొలను అలలలలుగా ధ్వనిస్తోంది.

చినుకొకటే
సమాధానాలు రెండు.

బొల్లోజు బాబా