"నా వద్ద కొద్దిపాటి స్థలముంటే
కుమ్మరి వద్దనుంచి కొన్ని ఇటుకలను
అరువు పుచ్చుకొని
ఓ గుడెసెను నిర్మించుకొనేవాడిని
వెదురుకర్రలు మాత్రమే నా వద్ద లేవు"
అతనలా చెప్పినప్పటి నుంచీ
నేను అన్వేషిస్తూనే ఉన్నాను
కొన్ని వెదురుకర్రలు సంపాదించి అతనికిద్దామని.
అతనికి కొద్దిపాటి స్థలముంటే
అతను కుమ్మరి నుండి ఇటుకలను
అరువు తెచ్చుకోగలడు కనుక
ఓ చిన్న గుడిసె తయారయిపోయి ఉండేది.
మేమలా సాగుతుండగా
సముద్రం ఆకాశం అంతేలేని భూమి
కనిపించాయి
ఈ మూడూ ఎవరికీ చెంది లేవు
మేము వెంటనే అరిచాం
ఇది మా సముద్రం మా ఆకాశం మా భూమి అని.
ఆ మూడింటినీ
మా పిడికిళ్ళలో కానీ కళ్లల్లో
చేతులలో కానీ నింపుకోలేకపోయాం.
కనీసం ఓ ముక్క ఆకాశాన్నో ఓ చెక్క భూమినో
సముద్రాన్నో అమ్ముకోలేకపోయాం.
ఆ విధంగా మేము అనంతానికి అధిపతులయ్యాం
కానీ చిన్న చిక్కు మాత్రం అలానే
మిగిలిపోయింది మా ఇద్దరకూ.
అతనివద్ద స్థలం లేదు
నా వద్ద వెదురు కర్రలు లేవు.
మూలం:
"A Minor Difficulty With The Two Of Us" -- Chandrakant Deotale
అనువాదం: బొల్లోజు బాబా
Saturday, March 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
హల్లో బాబా గారు - ఏంటి కథలు కూడా అనువదిస్తున్నారా?
ReplyDeletehttp://aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=2005&pageNo=0
పై లింకులో "ఆకుపచ్చని తడిగీతం" మీద రివ్యూ మీరు చూసినట్లు లేదు.
ఆ విధంగా మేము అనంతానికి అధిపతులయ్యాం
ReplyDeleteచాలా అర్థాలు స్ఫురిస్తున్నాయి. మంచి కవితను అనుభవింపజేసినందుకు కృతజ్నతలు.
ఇక్కడ నాకు ఒక రాజకీయ తత్వవేత్త అన్నమాట గుర్తుకొస్తోంది..'ఈ దేశంలో నాదంటూ ఓ అడుగు జాగా లేనప్పుడు ఈ దేశ పౌరుడుగా ఎలా చెప్పుకోగలను' అని అంటాడు.
చాలా బాగుంది సార్, నేనూ అలా అరిచినట్లు ఫీలయ్యాను
ReplyDeleteచాలా బాగుంది బాబా గారు. అనంతమైన భావాన్ని, మితమైన మాటలతో కూర్చిన కవిగారిని అనువదించిన మీకు ఇద్దరికి ధన్యవాదాలు.. చాలా బాగుంది.
ReplyDeleteకిరణ్ గారూ
ReplyDeleteహ హ
పోనీ అలానే అనుకోండి.....
మీ లింకు కు థాంక్సండీ
వర్మ గారూ
థాంక్యూ. కవితలోని భావం నేను చెప్పలేకపోయానేమో నని నాకున్న సందేహం మీ కామెంట్యు తీర్చింది. థాంక్యూ.
సామాన్యుడు గారు
ధన్యవాదములు
భావన గారు
థాంక్యూ మేడమ్.
బొల్లోజు బాబా