ఈ మధ్య ఆంధ్రప్రదేష్ మీడియా కబుర్లు బ్లాగరి, రాముగారు “కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతికశాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదుశాతమే” అంటూ కవిత్వంపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చూసి ఆశ్చర్యం కలిగింది. ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు. దశాబ్దాలుగా రచనారంగంలో ఉన్నవారే.
అంతేకాక ఈ మధ్య విడుదల అయిన ఒక కవితా సంకలనంపై బ్లాగుల్లో జరిగిన వాద ప్రతివాదాలు అందరికీ తెలిసినవే. ఈ సందర్భంగా Does Poetry matter in 21 centuary అనే పేరుతో ఒక వెబ్ సైట్ లో జరిగిన డిబేట్ నన్ను ఆకర్షించింది. అందులోని కొన్ని ఆశక్తి కరమైన అంశాలను సంక్షిప్తీకరించి పెడుతున్నాను.
కవిత్వానికి అనుకూల వాదనలు
కవిత్వం ఒక వ్యక్తీకరణ: కవిత్వాన్ని అర్ధం చేసుకోవటం సులువైన పనికాదు. కవిత్వం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయంలో మనం తరచూ గందరగోళానికి గురవుతూంటాం. కవిత్వం ఇలా ఉండాలని కవిత్వానికి సంబంధం లేని కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకొంటాం. ఆ సూత్రాలకు అనుగుణంగా కవిత్వం రావటం లేదని బాధపడుతూంటాం. ఎవరేమనుకొన్నప్పటికీ కవిత్వం అనేది కవియొక్క అభివ్యక్తి (expression). ఇది వాని హృదయంనుంచో, మెదడులోంచో లేక ఆత్మలోతుల్లోంచో మొలకెత్తుతుంది. కొన్నిసార్లు ఇది మసకమసకగానో లేక ప్రకాశవంతంగానో బయటకు వస్తుంది. ఇది కొన్ని దృశ్యాలను, ఉద్వేగాలను, ప్రేమను, ఆనందాన్ని, బాధను తెలియచేస్తూంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తనలోలోపల్లోంచి బయటకు తీసిన పదార్ధమే కవిత్వం.
కవిత్వం ఒక కళారూపం: జాక్స్ న్ పోల్లక్ (ఒక అబ్ స్ట్రాక్ట్ పెయింటరు) చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి దానికి అర్ధం ఏమిటని అడగవచ్చు. అదే చిత్రాన్ని చూసిన మరొకరు భావోద్వేగానికి గురయి చెమ్మగిల్లిన కళ్లతో వెనుతిరగవచ్చు. రెండో వ్యక్తికి తెలుసు పోల్లక్ గీసిన చిత్రం లోని అర్ధమేమిటో. కవిత్వం కూడా అంతే. అందరికీ అర్ధం కావాలనేమీ లేదు. అలాగని అందరికీ అర్ధం కాకుండా కూడా ఉండదు. ఎందుకంటే కవిత్వమొక కళా రూపం అంతే. కళా రూపం కనుక కవిత్వానికి ఉండాల్సిన విలువ ఉండాల్సిందే అది ఏ శతాబ్దమైనా.
కవిత్వం ఒక కధ: హోమర్ కాలం నుంచి డికిన్ సన్ కాలం వరకూ కవిత్వం లో కధను చెప్పటం ఒక ప్రక్రియ. అది గొప్ప గాధలు కావొచ్చు, లేక చిన్న చిన్న సంఘటనలు కావొచ్చు. కధలు అనేవి మానవ చరిత్రని లిఖించే శిలా శాసనాలు.
ఒకరు అక్షరీకరించిన రసాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం సులభం కాకపోవచ్చు కానీ ఒకరు ఆవిష్కరించిన రసం అప్రాధాన్యమైనదని తీర్మానించటం దుస్సాధ్యం అది ఏ శతాబ్దమైనప్పటికీ. – డనెల్లె కార్త్
వ్యతిరేక వాదనలు
చరిత్రను గమనిస్తే- పబ్లిక్ రంగము, వ్యక్తిగత రంగాలు విస్పష్టంగా ఉండేవి. ఇల్లు వ్యక్తిగతమైన రంగం గాను, ప్రదర్శన శాలలు/రాజ సభలు పబ్లిక్ రంగాలుగా పనిచేసేవి. ఈ ప్రదర్శన శాలలలో కళాకారులు, కవులు వారివారి కళలను సభికులముందు ప్రదర్శించేవారు. వాటి మంచి చెడ్డలను అక్కడ చర్చించటం జరిగేది. ఇందులో కళల ప్రదర్శన కు మౌఖికరూప ప్రక్రియ ప్రధాన పాత్ర వహించేది. నేడు అట్లాంటి ప్రదర్శన శాలలు అంతరించిపోయాయి. వాటి స్థానాన్ని దృశ్యరూప మాద్యమం ఆక్రమించింది. ఇలాంటి దృశ్య ఆధారిత కళల ప్రదర్శనా వాతావరణంలో చాలా కళారూపాలు అంతరించటం మొదలైంది. అందుకనే పత్రికల, పుస్తకాల అమ్మకాలు పడిపోయాయి. కవిత్వం ముఖ్యంగా ఒక శబ్దాధారిత ప్రక్రియ. కనుక అంతరించక తప్పదు. ఈ దృశ్యాధారిత మాద్యమ ప్రభంజనంలో కవిత్వం అనేది ఒక తెల్లకాగితం పై వ్రాసిన అక్షరాలు మాత్రమే – చాలా సందర్భాలలో ఆ తెల్లకాగితం విలువకూడా లేని. – హ్యూమా రషిద్
19 వ శతాబ్దం వరకూ కవిత్వమే అత్యున్నతమైన సాహిత్య ప్రక్రియ. కధ లేదా నవలా ప్రక్రియ అప్పటికే ఉన్నప్పటికీ ఆకాలంలో కవులకు వచ్చినంత పేరు రచయితలకు రాలేదు. ఈనాటి చాలామందికి ఆనాటి రచయితల పేర్లే తెలియవు. కానీ ఇరవయ్యవ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి తారుమారయ్యింది. నేడు కవి కంటే రచయిత ప్రముఖుడుగా చలామణీ అయ్యే పరిస్థితి వచ్చింది. నేడు చాలా మంది ఔత్సాహిక కవులకు కవిత్వం అనేది ఒక మానసిక అవుట్ లెట్ గా మారిపోయిందనటంలో సందేహం లేదు. సార్వజనీనత కోల్పోయింది. ఏదో కొద్దిమందికే అర్ధం అయ్యే ప్రక్రియగా మారిపోయింది. కవిత్వం స్వీయనిర్మిత శిఖరం నుంచి దిగివచ్చి, మేధోపరంగా తాజాగా తయారయి, ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడే అది నేటి మల్టిమీడియా దాడిని ఎదుర్కొని నిలబడగలదు. – లెప్లెన్
కవిత్వం నేడు డబ్బునిచ్చే ప్రక్రియ కాదు. డబ్బులేని ప్రక్రియలు బతికే అవకాశాలు లేవు. -- సాండీ షాన్
ప్రస్తుతకాలం హారీపోటర్, ది సింప్సన్ సినిమాలు, Myspace, sms ల ప్రపంచం. ఇవే నేటి కాలపు కళారూపాలు, వ్యక్తీకరణ మాధ్యమాలు. ఒకప్పుడు కవులు రాక్ స్టార్ లకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు. కానీ ఈ రోజు కవులు ఏవో స్థానిక పత్రికల్లో ఎక్కడో ఓ మూల తమ కవిత పబ్లిష్ అయితే చాలులే అనే స్థాయికి చేరుకొన్నారు. మనలో ఎంతమంది 1970 ల తరువాత వచ్చిన కవులలోని ఓ ముగ్గురి పేర్లు చెప్పమంటే టకటకా చెప్పగలరు?
మనలో ఎంతమంది ప్రతిరోజూ కవిత్వం చదువుతున్నారు. నిన్నచదివిన నవలలానో లేక చూసిన సినిమాలానో ఎంతమంది తమమిత్రుల వద్ద తాము చదివిన కవిత్వం గురించి చర్చిస్తున్నారు? దురదృష్టవశాత్తు కవిత్వం తన మాస్ అప్పీల్ ను కోల్పోయింది. కవియొక్క మేధోశక్తిని, శ్రమని సమాజం హర్షించే స్థితిలో లేదు. యవ్వనంలో ఉన్న ఈ శతాబ్దం హారీపోటర్ పేజీలు తిప్పుకొంటోంది. – సి.సి. వాగో
భవదీయుడు
(ఈ పోస్టుకు ఇంట్రోగా రాముగారిని తీసుకోవటం ఆయనను నొప్పిస్తే క్షంతవ్యుడను. పై అభిప్రాయాలలో – చెర్రీ లార్సన్ భావాలతో నేను ఏకీభవిస్తాను. పై వ్యాఖ్యలు ప్రపంచ కవిత్వధోరణులని ప్రతిబింబించినా తెలుగులో కూడా అదే పరిస్థితి ఉంది —బొల్లోజు బాబా)
This comment has been removed by the author.
ReplyDeleteకళ కళ కోసం కాదు, ప్రజలకోసం అంటూ ఛందో బంధనాలను తెంచుకొన్న కవిత్వం abstract విషవలయంలో చిక్కి సామాన్యుడికే కాక, కాకలు తీరిన పండితులకి కూడా అందనంత ఎత్తుకు "ఎదిగి" పోయిందేమో అనిపిస్తుంది.
ReplyDeleteరాముగారి మాటల అర్థం అదేనేమోనని నా అనుమానం.
ఒక abstract painting వందమందికి అర్థంకాక, చివరికి ఒక్కరు దాన్ని చూసి కళ్ళు తుడుచుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? ఆ వంద మందీ, కనీసం అందులో దెబ్బై శాతం మంది అర్థం చేసుకుంటేనేగదా దానికి సార్థకత!
ఎలుకతోలు దెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపుగాదు
అన్న పద్యం అర్థమైనంతగా సులభంగా ఎన్ని కవితలు ఈరోజుల్లో అర్థమౌతున్నాయి చెప్పండి?
కవితలు ఇంతే, అవి చదవి అర్థం చేసుకోవడానికి ప్రత్యేకమైన training అవసరం అంటే నేనేమీ చెప్పలేను.
Interesting.
ReplyDeleteCould you please post the original link, if it is on the web?
Thanks
కాలం తో పాటు మార్పు తప్పదు, దాన్ని పరిణామం అని సరిపెట్టుకోవాలి. రోజు రోజుకి మన జీవితాలు నాగరికత పేరుతో మెటీరియలిస్టిక్ అయిపోతూనే ఉన్నాయి. కవిత్వాన్ని అనుభవించడమంటే మనల్ని మనం తడిమి చూసుకోవడమే. గీతాంజలి ముందు మాట లో అనుకుంటా, చలం అంటాడు - "సంధ్య కేసి చూస్తున్నాను" అంటే, "ఆమె ఎవరు" అన్న మిత్రునికి ఏంచెప్పను అని.
ReplyDelete"కవిత" ఎవరు అనే రోజులు ఏంతో దూరం లో లేవు ఏమో కూడా. మన చిన్న తెలుగు బ్లాగ్ ప్రపంచమే తీసుకోండి, "గుండె చాటు కన్నీరు" అని ఒక కవిత టైటిల్ తో ఒక పోస్ట్ రాయండి.. సరిగ్గా ఓ ఇరవై మంది చూస్తే గొప్ప. అదే "సూరి హత్యకుముందు బాత్రూం కి ఎక్కడికి వెళ్ళాడు" అని రాయండి, రెండు వందల మంది చూస్తారు. (నాతో సహా) :-)
"నన్ను నేను తెలుసుకోడానికని ప్రపంచం అంతా తిరిగాను.. కాని ఆ దారిలో ఎక్కడో, నేను ఎందుకు తిరుగుతున్నానో మరచేపోయాను.. "
గీతాంజలి ముందుమాటలో కాదు... శ్రీశ్రీ గారి "మహాప్రస్థానం" ముందుమాటలో.
ReplyDeleteఈ వ్యాఖ్యని ప్రచురించకండి, ఊరికే, నా అభిప్రాయాన్ని మీతో పంచుకుందామని ఇలా:
ReplyDeleteకవిత్వంలో చెప్పే విషయంతో మనకి అవగాహన లేకపోతే దాన్ని అర్ధం చేసుకోవడం కష్టమే. పైన చెప్పిన "చందో బద్దమైన" వ్యాఖ్య తో నేను విబేధిస్తున్నాను. చందస్సులో వ్రాసిన వేమన పద్యాలు అర్ధం కావా, సుమతీ శతక పద్యాలు అర్ధం కావా. ఎలా వ్రాసినా సరళంగా అర్ధమయ్యేలా ఉండాలి, మోడ్రన్ ఆర్ట్ పెయింటింగ్స్ లా కవిత్వాలు వ్రాస్తే, ఆ పెయింటింగ్స్ ఎంతమందికి అర్ధమౌతాయో ఈ కవిత్వాలుకూడా అంతమందికే అర్ధమౌతాయి.
గీతిక గారు, కరక్టే అండి, "యోగ్యతాపత్రం" లో కదా, సరి చేసినందుకు కృతజ్ఞతలు. మీ బ్లాగ్ చూసాను, చాలా బావుంది. ఇంకా పూర్తిగా చదవాలి.
ReplyDeleteThank you Vijay Bhaskar garu...
ReplyDelete