ఎందుకో తెలియటం లేదు కానీ
ఆ వీధిలోంచి వెళ్ళాలనిపించటం లేదు.
ఆ గుడిసె ముందు ఆ ఆటోని చూసినప్పుడల్లా
యాక్సిడంటులో నుజ్జు నుజ్జయిన
ఆ ఆటోని చూసినప్పుడల్లా
పగిలిన దాని హెడ్ లైట్ నిస్తేజాన్ని చూసినప్పుడల్లా....
"అటెండెన్స్ సరిపోలేదని
స్కాలర్ షిప్ నిలుపు చేసేసారు సార్
డబ్బు చాలా అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్" అని
అభ్యర్దించిన ఆ కుర్రవాని కనులే
జ్ఞాపకం వస్తున్నాయి.
కాగితాలు, కంప్యూటర్లూ జీవితాల్లోకి
చూడలేవన్న విషయాన్ని ఎలా చెప్పగలిగానూ?
ఆ వీధిలో, ఆ గుడిసె ముందు నిలిచిపోయిన
ఆ ఆటోని చూసినప్పుడల్లా....
రంగువెలసీ, తుప్పు పట్టీ, గడ్డి మొలచీ శిధిలమౌతున్న
రంగువెలసీ, తుప్పు పట్టీ, గడ్డి మొలచీ శిధిలమౌతున్న
ఆ ఆటోని చూసినప్పుడల్లా.....
చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన వాడు
"దేవుని కృప వల్ల అంతో ఇంతో సంపాదిస్తున్నాను కదా,
నువ్వింక రిక్షా తొక్కడం మానేయమంటే వినటం లేదు సార్ మా నాన్న"
అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి.
క్లాస్ రూమ్స్ లో ఎప్పటికీ నేర్వలేని పాఠాలవి.
ఆ రోజు వాడెంత ముద్దొచ్చాడనీ!
యాక్సిడెంటులో నుజ్జు నుజ్జయిన వాడి ఆటో పక్కనే
కొత్తగా గ్రీజు పెట్టిన డొక్కు రిక్షాను చూసినప్పటి నుంచీ .......
ఎందుకో తెలియటం లేదు కానీ .... ....
భవదీయుడు
బొల్లోజు బాబా
ఆ వీధిలోంచి వెళ్ళాలనిపించటం లేదు.
ReplyDeleteఇది ఎస్కేపిజం కాదా?
బాగుందండి.
ReplyDeleteమొదటి ఎనానిమస్ గారికి
ReplyDeleteథాంక్యూ
ఇక్కడ కవి ఎస్కేపిష్టు అయితే ఈ కవిత రాసేవాడు కాదేమో! ఆలోచించండి.
విధి విచిత్రాలకు కవి చిత్రరూపం ఇస్తాడు. బహుసా అంతవరకే అతని బాధ్యత.
మరొక్కసారి ధన్యవాదాలు.
రెండవ అనానిమస్ గారికి, పద్మార్పిత గారికి ధన్యవాదాలు
బొల్లోజు బాబా
చాలా టచింగ్‍గా ఉంది.
ReplyDeleteరోడ్డు మీద ఇలాంటి మాసిపోతున్న గురుతుల్ని ఎన్నో చూస్తాం. ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నా ఎలా ప్రతిస్పందించాలో తెలీదు. మీ ప్రతిస్పందన చాలా చాలా బాగుంది.
కానీ ఎందుకో... ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నాకెందుకో... సరిగా అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చదివాను. ఊహు...
//యాక్సిడెంటులో నుజ్జు నుజ్జయిన వాడి ఆటో పక్కనే
కొత్తగా గ్రీజు పెట్టిన డొక్కు రిక్షాను చూసినప్పటి నుంచీ .......
ఎందుకో తెలియటం లేదు కానీ .... .... //
ఇక్కడ ఎక్స్ ప్రెస్ చెయ్యాల్సిన ఇంకేదో మిగిలిపోయినట్లుగా... అసంపూర్తిగా అనిపిస్తోంది. అవునా...
అసంపూర్తిగా వదిలేసిన ఆ భావం అలా వెంటాడుతూ వుండటంలోనే ఈ కవిత వచ్చిందనుకుంటా... It's really haunting me Sir..
ReplyDeleteఅయ్యుండొచ్చేమో కెక్యూబ్ గారూ.
ReplyDeleteకానీ... ఎన్నిసార్లు చదివినా చదివిన ప్రతీ సారీ మనసెందుకో భారంగా..!
చాలా బాగా వ్రాశారు బాబా గారూ..
బాబాగారు,
ReplyDelete"ఆ సార్ స్త్రిక్టే కాదురా పైగా ముందు కులమోడు మనకెందుకు హెల్ప్ చేస్తాడు" అనే విద్యార్థులే మళ్ళీ తన దగ్గరకొచ్చి బ్రతిమాలితే అటెండన్స్ సైన్ చేసాను అన్న నాన్న మాటలకు "అదేంటి తప్పు కదా" అని మనసులో అనుకున్న రోజులను జ్ఞాపకం తెచ్చారు. నిజమే జీవితాల్లోకి తొంగి చూసేది మనుషులే కదా.
కొన్నిటికి కవి హృదయం ప్రేక్షక పాత్ర తప్ప ఇంకేమీ వహించలేదేమో.
కవితా వస్తువు సూపర్.