Showing posts with label వ్యక్తిగతం. Show all posts
Showing posts with label వ్యక్తిగతం. Show all posts

Tuesday, November 29, 2011

Russell’s viper (Vipera russellii)


Russell’s viper (Vipera russellii)

కాలేజ్ గార్డెన్ లో రెండు కొండచిలువలు తిరుగుతున్నాయని మా విద్యార్ధులు  చెప్పటంతో చూడటానికి వెళ్ళాం.  నిజానికి అవి కొండచిలువలు కావు.  అత్యంత విషపూరితమైన  రక్త పింజరలు.  ఇవి పొడపాముల జాతికి చెందినవి.  సాధారణంగా వీటిని కొండచిలువలుగా పొరపడుతూంటారు.  కొండచిలువలకు శరీరంపై మచ్చలు అడ్డదిడ్డంగా (ఒక పాటర్న్ లేకుండా/సౌష్టవరహితంగా) ఉంటాయి.  కానీ పొడపాముల మచ్చలు ఒక క్రమపద్దతిలో ఉంటాయి.  వీటి విషం హీమోటాక్సిక్ రకానికి చెందింది.  అంటే విషం రక్తం పై ప్రభావితం చూపి రక్త కణాల్ని విచ్చిన్నం చేస్తుంది.  దీని కాటు బారిన పడితే, ఆరుగంటలలోగా ఆంటివీనం ఇవ్వకపోతే, మూడు నాలుగు రోజులలో శరీరం లోని రక్తం విచ్చిన్నమై, చర్మంపై పెద్దపెద్ద ఎర్రని బొబ్బలు తేలి మరణిస్తారు.చాలా బాధాకరమైన మరణం.  

 చాలా సంవత్సరాల క్రితం నా మిత్రుడు దీని కాటుకు గురయ్యాడు. ఏదో పురుగు కుట్టి ఉంటుందని అశ్రద్ధ చేయటంతో రెండోరోజుకు చర్మం పై ఎర్రని దద్దుర్లు లేచాయి.  మూడో రోజుకు అవి పెద్దవై విస్తరించాయి.  హాస్పటల్ కి తీసుకెళితే, లాభం లేదని డాక్టర్లు చెప్పారు.  నాలుగోరోజున అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు,  అతని శరీరంపై  ఎర్రని బొబ్బలు ఎర్రగా కాల్చిన అరెశలు పేర్చినట్లుగా ఉన్నాయి.  ఆ మరునాడు అతను మరణించాడు. చాలా విషాద కరమైన మరణం.

కొండచిలువలే కదా అని వాటితో పరాచికాలాడుతున్న విద్యార్ధులను హెచ్చరించాం.  కాసేపటికి అవి మెల్లగా మరోచోటికి జారుకొన్నాయి
బొల్లోజు బాబా

 

Thursday, June 3, 2010

ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవిత ప్రస్తావన .....

 ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవితల ప్రస్తావన .....

వ్యాసకర్త సాంధ్యశ్రీ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



ఈ పాపికొండల్నే మరో కవి దర్శించాడు. ఆ నదీ నీటి బిందువులోంచి మధుర నాదం విన్పించిందట. అక్కడి ప్రజలగుండెల్లో ఆ నదికీ ఆ కొండలకీ గొప్ప మహత్తు ఉందంటున్నారు ఆ నది పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్‌లా జాలర్లకు చేపలు పంచుతోందంటున్నాడు. ''నదికి అడ్డంగా పెద్దకొండ / ప్రవాహం ఆగలేదు/ మలుపు తీసుకొంది/ జీవితంలానే / డామ్‌ సంకెళ్లు వేయించుకోబోతున్న / ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే జాలేస్తుంది/ ఇకపై కూడికలు, తీసివేతలు ప్రకారం ప్రవహించాలి / ఒక్క క్షణం ఆగానో లేదో/ నది నన్ను దాటుకొని / నవ్వు కొంటూ వెళ్లిపోయింది. -  బొల్లోజు బాబా

పూర్తి వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదవగలరు
http://www.andhraprabha.in/search/article-112855

Tuesday, March 30, 2010

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?


ఆ పదం వచ్చిన వాక్యాలు

The evolution of revenues from the duty of montrafat

....were in all likelihood exempted from the tax of montrafat.

Counseil of India to subject the weavers to the tax of Montrafat of which they had been exempted since 1817

పై వాక్యాలను బట్టి Montrafat అంటే వృత్తి పన్ను అనే అర్ధం వస్తుంది. అది కరక్టేనా? ఈ పదం ఫ్రెంచి పదమేనా? దాని పూర్తి అర్ధాన్ని దయచేసి ఎవరైనా వివరించగలరు.

I will be highly thankful to to one and all .

బొల్లోజు బాబా