Wednesday, February 1, 2012

ఫ్రాగ్మెంట్స్ 6

1.  వానచినుకూ
     సాగర హృదయం
     ఒకరిలోకి మరొకరు
     కరిగిపోతూ మరలా
     మిత్రులైపోయారు

2.  ఒకే ఒక్క రాగంతో
     చిమ్మెట
     తెల్లారేదాకా
     సూర్యుడ్ని
     పైకి లేవనియ్యలేదు

3.  అమావాస్య రాత్రి
     చందమామ
     శకలాలు శకలాలుగా
     విడిపోయి
     తిరుగుతోంది భువిపై
     మిణుగురుల రూపంలో

4.  చికన్ కూర
     అమ్మ వడ్డించింది
     మెత్తని ముక్కలన్నీ
     మాయమయ్యాయి


5.  ఆ కాన్సర్ పిలగాని
     నవ్వు
     కన్నీళ్ళ కన్నా
     ఎక్కువ
     బాధిస్తోంది


బొల్లోజు బాబా




10 comments:

  1. bavundi kotta images chala kalaniki kani amma aratam koddiga takkuvindi climax tondaraga vachindi
    sanjeev

    ReplyDelete
  2. బాబా:

    దీర్ఘ కవితల కంటే ఇలా కొద్ది పదాల కవిత్వంలో గాఢత కనిపిస్తోందీ మధ్య! ఆ మాటకొస్తే, చాలా దీర్ఘ కవితల్లో చివరికి మిగిలేది ఆ నాలుగయిదే కదా! ఈ అయిదు కవితలూ అయిదు దిక్కులకి లాక్కు వెళ్ళాయి నన్ను. ముఖ్యంగా ఈ కవిత:

    ఆ కాన్సర్ పిలగాని
    నవ్వు
    కన్నీళ్ళ కన్నా
    ఎక్కువ
    బాధిస్తోంది

    ReplyDelete
  3. రవి వీరెల్లిFebruary 2, 2012 at 7:17 AM

    ఫ్రాగ్మెంట్స్ నచ్చాయి. చినుకు, చిమ్మెట రాగం, చందమామ, చికెన్ కూర బాగున్నాయి. ఐదవ ముత్యం కదిలించింది.

    ReplyDelete
  4. అమావాస్య రాత్రి
    చందమామ
    శకలాలు శకలాలుగా
    విడిపోయి
    తిరుగుతోంది భువిపై
    మిణుగురుల రూపంలో

    wow! ఒక ఊహాత్మక దృశ్యం! చందమామ శకలాలు నా చుట్టూ పరుచుకున్నట్టు! ఈ దృశ్యం లోంచి బయట పడకముందే

    ఆ అయిదోది

    ఆ కాన్సర్ పిలగాని
    నవ్వు
    కన్నీళ్ళ కన్నా
    ఎక్కువ
    బాధిస్తోంది

    కసుక్కున గుండెల్లో గుచ్చుకుంది.

    మీరు తరచుగా రాస్తుండాలి బాబాగారూ! మా లాంటి అభిమానుల కోసం

    ReplyDelete
  5. సంజీవా థాంక్యూ
    అఫ్సర్ గారికి
    మీ ఆత్మీయ వ్యాఖ్య కు థాంక్సండీ
    అయిదు కవితలూ మీలాంటి సాహితీ మేరువులను కదపగలిగాయంటే అంతకు మించి కావల్సినదేముంది సార్

    సౌమ్య గారికి
    థాంక్సండీ
    సుజాత గారికి
    I am really thankful to you madam. As I previously expressed, my enthusiasm in poetry was sustained by your comments many times. Thank you very much for your kind encouragement madam

    ReplyDelete
  6. తడారని పచ్చని గీతాలతో మీ బ్లాగిక ఇలా కళకళ్ళాడుతూనే ఉండాలని ఆకాంక్షిస్తూ...

    మనోయవనిక మీద గమ్మత్తు ప్రదర్శన చేయించే మీ కవితలకి సదా అభిమాని -ఉష

    ReplyDelete
  7. బాబా గారు!
    ఆ పిలగాని నవ్వుకు బాదపడుతూనే ,ఈ కవిత చదివాక కొన్ని చందమామ శకలాలు సేకరించాను నేను !

    ReplyDelete
  8. "ఆ కాన్సర్ పిలగాని
    నవ్వు
    కన్నీళ్ళ కన్నా
    ఎక్కువ
    బాధిస్తోంది"
    మిగతా కవితనంతా మరిపించి మళ్ళీ మళ్ళీ వెంటాడుతున్న వాక్యం!!

    ReplyDelete