Saturday, October 17, 2009

వైచిత్రి

వాన దాడికి
గుడ్లు మోసుకుంటూ
చీమలు తలో దిక్కుకూ
పరుగులెడుతున్నాయి.

కప్పల సంగీతోత్సవానికి
కొలను అలలలలుగా ధ్వనిస్తోంది.

చినుకొకటే
సమాధానాలు రెండు.

బొల్లోజు బాబా

6 comments:

  1. చినుకు పడ్డ
    ఎండకి కాలిన నాపరాయి
    సర్రుమనదా!

    చినుకు తాకిన
    కొలను నీరు
    తృళ్ళిపడదా?

    చినుకు కారుతున్న
    పాక చూరు
    గీతం పాడదా!

    నిజమేనండి, కన్నెపిల్ల చిందులు, పసిపిల్లల కేరింతలే కాకుండా ఇలా ప్రకృతిలోనే పలు పోకడలుగా తిరిగి తిరిగి తనని పరిచయం చేసుకునే వాన/చినుకు కవితలు తోడగ తరగని గని.

    ReplyDelete
  2. ప్రకృతి ధర్మాన్ని చక్కగా చెప్పారు.
    సాహితీ మిత్రులకు
    ప్రపంచ కవితాదినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. చినుకొకటే కానీ సమాధానాలు రెండు మాత్రవే కాదేఓ బాబా గారు, సమాధానాలు అనంతంవేఓ కదా.

    తిమ్మిరెడ్డి.

    ReplyDelete
  4. ఉష గారు, శ్రీనిక గారు
    థాంక్సండీ

    తిమ్మిరెడ్డి గారికి
    సమాధానాలు అనంతం కావొచ్చు. కానీ తెలుపు నలుపులు రెండే మధ్యలో అనేక షేడ్స్

    అలా ఇక్కడ ఒకే వాన, రెండు పరస్పర విరుద్దమైన సమాధానాల్ని రాబట్టింది. ఒకరికి ఖేదం, మరొకరికి మోదం. ఆ రెందు పనులు కూడా ప్రత్యుత్పత్తికి సంబందించినవే.

    నే బంధించిన దృశ్యం తాలూకు చిత్రణ అది.

    అయినా ప్రకృతి వైవిధ్యాల్ని పదాల్లో బంధించగలమా? అనంతం అని చెప్పుటం వినా. :-)

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. బాబా గారు చాలాబాగా అనిపించింది కాని నా మట్టి బుర్ర్రకి అర్థం ఆయీ అవనట్టుగా అర్థం అయింది .

    ReplyDelete
  6. చలం గారు అన్న "Economy of words" కనపడింది ఇక్కడ
    నాకైతే ... ప్రకృతి నిశ్శబ్దంలో కేవలం వాన చినుకులే వినపడ్డాయి ... ఈ కవిత ,దృశ్యాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించింది...

    చదివిన ప్రతీ సారి ఒక్కొక్క సమాధానం దొరుకుతూ ఉంది...

    నరసింహ మూర్తి

    ReplyDelete