మూరెడు మట్టి గాజులకు
ఆమె చేతుల్ని తొడిగారు.
సోలడు పసుపుకు
ఆమె ముఖాన్ని అద్దారు.
సంజె బింబానికి
ఆమె నుదురును తగిలించారు.
బుట్టెడు పూలకు
ఆమె కురులను ముడి వేసారు.
ఇవేమీ పట్టని ఆమె
భోరు భోరున దుఖి:స్తోంది
భర్త శవంపై పడి.
**********
చాలారోజులక్రితం
రాత్రివేళల్లో రోడ్లు ఊడ్చే కార్మికులపై వ్రాసిన నిర్మాల్యం అనే కవిత ప్రేరణ గురించి అక్కడ చేసిన కామెంటు ఇది.....
ఈ కవిత వ్రాయటానికి ప్రేరణ, చాన్నాళ్ల క్రితం, సెకండ్ షో సినిమాచూసి వస్తుంటే, మా ఆఫీసు అటెండరు, రోడ్లు శుబ్రం చేస్తూ కనపడ్డాడు. బండి ఆపి వానితో మాట్లాడి,, కుటుంబ ఖర్చులకోసం, ఇలా పార్ట్ టైముగా చేస్తుంటాను అని తను చెప్పగా తెలుసుకొన్నాను.
ఆ అనుభవం మనసులో ముద్రించుకు పోగా, ఇంటికొచ్చి వ్రాసుకొన్న కవిత ఇది.
ఇక ప్రస్తుతానికి వస్తే
కొద్దిరోజుల క్రితం పైన చెప్పిన మా ఆఫీసు అటెండరు చనిపోయాడు. అక్కడ చూసిన ఒక దృశ్యం కలచివేసింది. భర్తపోయిన దుఖంలో ఉన్న స్త్రీని అలా (సుమంగళిలా) అలంకరించే ఆచారం ఎలా వచ్చిందో కానీ చూడటానికి చాలా అనాగరీకంగాను, inhuman గానూ అనిపించింది.
ఆ అనుభవం మనసులో ముద్రించుకు పోగా, ఇంటికొచ్చి వ్రాసుకొన్న కవిత ఇది.
ఇలా మీతో పంచుకొంటున్నాను.
ఈ విధంగా నా రెండు కవితలలో నిద్రిస్తున్న మిత్రుడు బి.శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ........
బొల్లోజు బాబా
:-( Touching, and thought provoking.
ReplyDeleteబాబా గారూ,
ReplyDeleteమీరు ఉపయోగించిన పదాలు ఈ ఆచారాన్ని వర్ణించడానికి సరిపోవేమో.
బహుసా ఆ స్త్రీకి తన పుణ్యస్త్రీ రూపాన్ని చివరిసారిగా చూపించడానికి చేసే ఒక తంతు కావచ్చు. అయినా ఇది దారుణం.మరో విషయం అక్కడ వున్నవారిలో కొంతమంది గంగాభాగిరధీ సమానులుంటారు. వారిదో sadistic pleasure. ఈ తంతు నడిపేది అంతా ఆడవాళ్ళే అని చెప్పడానికి సిగ్గుపడాల్సివస్తుంది.
ఒకే వ్యక్తి రెండు పార్శాలలో మీకు రెండు వస్తువులు. వీటిని మలచడమ్లో మీరెంత క్షోభకు గురయ్యారో కదా.
మునుపటి టపాలో మనవి మన్నించినందుకు ధన్యవాదములు.
నెను మీ బ్లాగు కి కొత్త అండి .
ReplyDeleteమీలా సామాజిక స్పృహ వున్న వారంటె నాకు చాలా అభిమానమండి
బాబా గారు ఇటువంటి ఆచారాలన్ని కచ్చితంగా పనికిమాలిన వాళ్ళు చెసినవే అని చెప్పడానికి నేను ఏ మాత్రం బయపడను, సంకొచించనండి.
ఇటువంటి ఆచరాలను మట్టిలొ వేవేల అదుగుల లొతులొ కూర్చేసె రొజు దగ్గరలోనె ఉందండి
ఒక మంచి విష్యంపై స్పందించినందుకు, మిమ్మల్ని పొగిడె అనుబవము వయసు లెని చిన్న వాణ్ణీ , ఐనా మీ కాళ్ళకు నమస్క్రించాలండి ఈతువంటి దురాచారాలపై స్పందించినదుకు.నెను మీ బ్లాగు కి కొత్త అండి .
మీలా సామాజిక స్పృహ వున్న వారంటె నాకు చాలా అభిమానమండి
బాబా గారు ఇటువంటి ఆచారాలన్ని కచ్చితంగా పనికిమాలిన వాళ్ళు చెసినవే అని చెప్పడానికి నేను ఏ మాత్రం బయపడను, సంకొచించనండి.
ఇటువంటి ఆచరాలను మట్టిలొ వేవేల అదుగుల లొతులొ కూర్చేసె రొజు దగ్గరలోనె ఉందండి
ఒక మంచి విష్యంపై స్పందించినందుకు, మిమ్మల్ని పొగిడె అనుబవము వయసు లెని చిన్న వాణ్ణీ , ఐనా మీ కాళ్ళకు నమస్క్రించాలండి ఈతువంటి దురాచారాలపై స్పందించినదుకు.
మీ కవితకి ఇంకేమీ కలపలేను. కానీ రెండు చేదు జ్ఞాపకాలు కదిలాయి. బలాత్కార మరణానికి గురైన మా చెల్లికి ఇంకేవో సాంప్రదాయాలు మిగిలున్నాయని ఒక స్త్రీని తీసుకువచ్చి ఆమెకి మాతో యేవేవో అలంకరణలు, ఆ షాక్ తో నలతపడి, లేవలేని స్థితిలోవున్న నన్ను అలా ఓదావరి వొడ్డున ఆ పనులన్నీ చేయిస్తూ ఇదంతా నీ చెల్లికే అన్న ఒక సాకుతో నానోరు మూయించేసారు అక్కడ చేరిన స్ర్తీలు. నా ఓటమి లెక్కల్లో అదొకటి. అమ్మ, నాన్న గారు ఎంత క్షోభననుభవించారో అనిపిస్తుంది.
ReplyDeleteఅలాగే మా మరిది చనిపోయినపుడు ఆ అమ్మాయికి ఈ పద్దతులేవో చేయాలని అనుకుంటూన్నప్పుడు మాత్రం ముందు నాకు చేసి ఆమెకి చేయండి అని మాత్రం అడ్డం పడ్డాను, ఆపగలిగాను. ఈ రెండూ ఒక సంవత్సర వ్యవధిలోనే జరిగాయి. కానీ నాలో స్థైర్యం రావటానికి కారణమయ్యాయి.
మీ మిత్రుని ఆత్మ శాంతికి నా ప్రార్థన వుంటుంది.
అప్పుడప్పుడూ స్పందించడానికి మాటలు రావు. కోపం మాత్రం వస్తుంది. మనమెందుకిలా? అనే ప్రశ్నమాత్రం వస్తుంది.
ReplyDeleteఅప్పుడప్పుడూ స్పందించడానికి మాటలు రావు. కోపం మాత్రం వస్తుంది. మనమెందుకిలా? అనే ప్రశ్నమాత్రం వస్తుంది....
ReplyDeleteమహేష్ , బాగా చెప్పారు!
బాబాగారు,
ఏం చెప్పను! ఏడాది క్రితం బంధువుల్లో 90 ఏళ్ళ పెద్దాయన పోతే ఆయన భార్య, 85 ఏళ్ళ ముదివగ్గు...ఆమెక్కూడా ఇవన్నీ చేశారు.
ఉష, మీ అనుభవాలు చాలా బాధ కల్గిస్తున్నాయి.
I have no words to comment.....
ReplyDeleteసుజాత, "మనమెందుకిలా?" - అవును ఇంకెన్నో. అన్నీ నన్ను స్తబ్దత నుండి మరణం కోరుకునేంత బాధించాక, ఆ అంచుని తాకి వచ్చాక తిరికి ఎత్తిన మొలక ఈ మరువం. కొన్ని ప్రస్తావిస్తే మరొకరికి స్ఫూర్తి అన్నవే వ్రాస్తాను. ఇక్కడ ఒక ఓటమి వెనుక మరొక గెలుపువంటిది వుంది కదా. అందుకే వ్రాసాను.
ReplyDeleteబాబా గారూ,
ReplyDeleteనిజంగా అధ్బుతం! నాకు చాలా బాగా నచ్చింది ఈ కవిత.కళ్ళు,గుండె ఒక్కసారి చెమరించాయి! అలాగే శ్రీనిక గారు చెప్పింది కూడా అక్షరాలా నిజం!----భాస్కరభట్ల రవికుమార్