Saturday, October 10, 2009

నిన్ను కప్పే కాంతి

(పాబ్లో నెరుడా The Light Wraps You కు తెలుగు అనువాదం)


కాంతి తన మృత్యు జ్వాలతో నిన్ను పెనవేసుకొంటుంది.

నీ చుట్టూ తిరిగే వెన్నెల కు అడ్డుగా

ఎవరో పరధ్యాన దు:ఖితుడు నిలచాడు.

గతించిన ఘడియ ఏకాంతంలో ఒంటరివై

జీవ జ్వాలలు నింపుకొని,

శిధిల దినపు నిజమైన వారసునిగా

మాటల్లేక మిగిలిపోయావా మిత్రమా.


నీ చీకటి దుస్తులపై ఫలమేదో సూర్యునినుండి రాలిపడింది.

రాత్రి వేళ్లు, అకస్మాత్తుగా నీ ఆత్మలోంచి మొలచుకొచ్చాయి.

నీలో దాగున్నవన్నీ మరలా బయటకు వచ్చేస్తున్నాయి.

ఒహ్! ఘనమైన, ఫలవంతమైన, ఆకర్షణీయమైన

చీకటి వెలుగులలో తిరుగాడుతూండే వలయం

పెంచి, నడిపించే ఈసృష్టి విషాదంతో నిండి ఉంది,

దాని పువ్వులు వాడిపోతూంటాయి



బొల్లోజు బాబా

5 comments:

  1. Feels appropriate, with Sri Balagopal's passing

    ReplyDelete
  2. ఒక నిష్క్రమణ మరొక చేతనకి, ఒక అచేతన మరొక ఆగమనానికి, ఈ నడుమ ఈ చీకటి వెలుగులు.

    ReplyDelete
  3. "ఒహ్! ఘనమైన, ఫలవంతమైన, ఆకర్షణీయమైన

    చీకటి వెలుగులలో తిరుగాడుతూండే ఈ వలయం

    పెంచి, నడిపించే ఈసృష్టి విషాదంతో నిండి ఉంది,

    దాని పువ్వులు వాడిపోతూంటాయి"
    మరల మరల కుసుమిస్తుంటాయి మేమందరం గతించాయనుకున్న నీ జీవ జ్వాల ను తోడు గా తీసుకుని.. వేచి వుంటాము మిత్రమా నీ ఆశయాల వూపిరి ని ఆలంబన గా చేసుకుని అంత దాక... :-)

    ReplyDelete