Friday, December 23, 2011

దొరికిన దొంగ .....

కొబ్బరి కాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారంటే
చూట్టానికి వెళ్ళాను.
అతను తల దించుకొని ఉన్నాడు
చీప్ లిక్కర్ వాసన గుప్పుమంటోంది.
వ్యసనం అతని ఆత్మను తినేసింది
ఆత్మ లేని ఆ వికార దేహం
రక్త గడ్డలా ఉంది.
వాడి కుటుంబాన్ని తల్చుకొంటే జాలనిపిచింది.
వీధికొక్కటి చొప్పున 
వెలిసిన గిలిటన్ల వేట్లకు
ఊర్లకు ఊర్లు కబేళాలుగా 
మారుతున్న దృశ్యశకలమిది.
ఉన్నది కనుక తాగుతున్నారు
తాగుతున్నారు కనుక ఉంచుతున్నాం
నరంలేనిదే నాలుక కదా!
లిక్కర్  వైద్యం  ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా అంటూ
ప్రాణం చుట్టూ అన్ని
వ్యాపారాలు ముడివేసుకొన్నపుడు
జీవితం ఎంత చవకో 
అతణ్ణి చూస్తే అర్ధమౌతుంది.

“ఇది వరకు తిండి కోసం దొంగతనాలు చేసేవారు
ఇప్పుడు మందుకోసం చేస్తున్నారు” ఎవరో పెద్దాయన
గొణుక్కొంటున్నాడు.

అభివృద్ధంటే అదేనేమో!


బొల్లోజు బాబా

5 comments:

 1. బాబాగారూ,
  మీరు తీసుకున్న సబ్జెక్టు చాలా ముఖ్యమైనది చదువుకున్న వాళ్ళు సైతం దృష్టిపెట్టవలసినది. నిజానికి ప్రభుత్వాలు పేదలకి సహాయం చేస్తున్నామని చెప్పి పేపర్లలో వాళ్లడబ్బేదో ఉచితంగా ఇచ్చేస్తున్నట్టు ఫొటోలు వేయించుకుని మరీ ప్రచారాలు చేసుకుని ఓట్లు దండుకుంటున్నారు. నిజానికి పేద ప్రజలే ప్రభుత్వం పోస్తున్న,ఎలక్షన్లలో పోయిస్తున్న సారా తాగి, ఖజానాకి బోలెడంత ఆదాయాన్ని సమకూరుస్తున్నారు, ప్రభుత్వాల్ని పరోక్షంగా నడుపుతున్నారు. చదువుకున్నవాళ్ళు సైతం, ఫ్రీ మనీకి అలవాటుపడి ఒకపక్క వాళ్ల విలువల్ని తాకట్టుపెట్టడమేకాక,లిక్కరుమాఫియాకి పరోక్షంగా సహాయం చేస్తున్నారు. అది చాలా విచారించవలసిన విషయం. చర్చిల్ లాంటివాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యంవస్తే ఏమవుతుందో చెప్పిన మాటలు విని నా అహానికి దెబ్బతగిలినా, ఇప్పుడుఉన్న పరిస్థితిచూస్తే వాళ్లుచెప్పినది నిజమవుతున్నందుకు చాలా బాధగా ఉంది.

  ReplyDelete
 2. pedda pedda scam lo dongatanam chesina andariki bail ichi intiki pamputunnapudu , scam laki sayam chesina vallu desanni inka rule chestunnapudu , chillara dongalani matuku sikshinchi pedda dongalaki votese prajalani ela manninchali

  ReplyDelete
 3. >>"చర్చిల్ లాంటివాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యంవస్తే ఏమవుతుందో చెప్పిన మాటలు విని నా అహానికి దెబ్బతగిలినా, ఇప్పుడుఉన్న పరిస్థితిచూస్తే వాళ్లుచెప్పినది నిజమవుతున్నందుకు చాలా బాధగా ఉంది."

  చర్చిల్ లాంటివాళ్ళు చెప్పిన దాంట్లో కొంత అవసరమైన భయాలు ఉన్నా, అటువంటి వాటిని ఒక సమాజంగా మనం ఎప్పుడో అధిగమించామని గమనించలేక కేవల మీ అహం దెబ్బతింది అని మాత్రమే భాధ పడ్డ వాళ్ళని చూస్తే నాకూ చాలా జాలీ అసహనం కలుగుతాయి. I sincerely hope I am wrong

  ReplyDelete
 4. "అటువంటి వాటిని ఒక సమాజంగా మనం ఎప్పుడో అధిగమించామని" అవి నిజమా? నిజంగానే అధికమించేసామా? లంచాల విషయంలో, కులాలు మతాలుగా ముక్కలు ముక్కలుగా మారిపోవటం etc.

  ఇక్కడ కేవలం అహం మాత్రమే దెబ్బతిని బాధ పడుతున్నదెవరు? మీరు జాలిపడేందుకు అసహనం వ్యక్తపరచేందుకు?

  with wishes
  bollojubaba

  ReplyDelete