thank you కోండ్రు రమేష్ gaaru. ఆసక్తికరమైన ప్రశ్నలతో, వినూత్నంగా పుస్తక పరిచయం చేసినందుకు. I wonder at your close reading of the text.
thank you so much
బొల్లోజు బాబా
***
##❤❤మెకంజీ కైఫియ్యతులు❤❤##
##❤తూర్పుగోదావరి జిల్లా❤##
##బొల్లోజు బాబా##
*1816లో వ్రాసిన పుస్తకం నిమిత్తం ఇంగ్లీషులో వ్రాసిన మొదటి భారతీయునిగా రాజారామమోహాన్ రాయ్ గుర్తింపబడ్డారు...కానీ ఆయన కంటే ముందు 1803లోనే ఇంగ్లీషులో రచనలు చేసిన తెలుగు వ్యక్తి ఎవరు??
*అమరావతి స్థూపాన్ని గుర్తించిన మొదటి యూరోపియన్ ఎవరు??
*దీపాలదిన్నె ప్రాంతం ఏమిటి?అదెక్కడ ఉంది??
*బోయినపూడి గ్రామం ఎలా ఏర్పడింది?నీలం జాతి వారు ఎవరు?వారి జీవన విధానం ఏమిటి??
*చిన్న పువ్వు తేనె అంటే ఏమిటి?పిఠాపురం రాజా వారి సైనికులు దానిని ఏవిధంగా సేకరించేవారు??
*108యుద్దాలలో గెలిచినందుకు 108శివాలయాలు ప్రతిష్ఠించిన చాళుక్య రాజు ఉదంతం ఏమిటి??
*రాజమండ్రి కోటగుమ్మం ప్రాంతానికి ఆ పేరెలా వచ్చింది??
*రాజమహేంద్రవరం పట్టణాన్ని ఎవరు,ఏ విధముగా నిర్మించినారు??
*రాజమహేంద్రవరం కోట గోల్కొండ నవాబుల వశం కావడానికి కారకులైన సీతాఫిఖానుడు-అవసరాల పెద్దిరాజుల ఉదంతం ఏమిటి??
*కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ నిజాం నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి,ఎప్పుడు అమ్మివేశాడు??
*పురిటి సుంకం విధించిన రాచవేమారెడ్డిని వీధిలో కత్తితో వధించిందెవరు??
*సర్పవరం,పండూరు,జల్లూరు గ్రామాలకు ఆ పేర్లేలా వచ్చాయి??
*దక్షిణ భారతదేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన రాజు ఎవరు?వాటికి వరహాలు అనే పేరెలా వచ్చింది??
*మంచికొండ పట్టణం ఎవరి పేరు మీద,ఏ సందర్భంలో ఏర్పడింది??
*వెన్నెల రాయుడికి ఆ పేరెలా వచ్చింది?వెన్నెలరాయ గుట్టకి అతనికి గల సంబంధం ఏమిటి??
*భారతదేశంలో గన్ పౌడర్ ను 1526లో బాబర్ ప్రవేశపెట్టినట్లు చెప్పబడినా...అంతకుముందే దానిని భారతదేశంలో వాడింది ఎవరు??
*కోరుకొండ పట్టణం ఏవిధంగా ఏర్పడింది?కోరుకొండ కొండపై నృశింహస్వామి దేవాలయం నిర్మించింది ఎవరు??
*గోదావరికి గుద్రవర అనే ప్రాచీన నామం ఏ ఆలయ స్తంభంపై శాసనరూపంలో ఉంది??
*మనిషి పుర్రెలో వండిన అన్నాన్ని,రక్తంతో కలిపి రాత్రివేళ యుద్ధభూమిలో నైవేద్యం పెట్టే రాజు ఎవరు??
*కుల్లమీనార్ అంటే ఏమిటి?దాని వలన ఏర్పడిన భయనక వాతావరణం ఏమిటి??
*తన ఎదుట పొగ త్రాగితే కత్తి తీసి పరిగెత్తించి కొట్టే గజపతుల రాజు ఎవరు??
*దోమాడ యుద్ధం ఎప్పుడు,ఎవరి మధ్య జరిగింది??
*కిమ్మూరు,గోరంట,గోవాడ,చెల్లూరు గ్రామాలకు ఆ పేర్లేలా వచ్చాయి??
*కోరంగి గ్రామానికి ఆ పేరెలా వచ్చింది?కోరంగికి రామాయణానికీ గల సంబంధం ఏమిటి??
*సీతాంతం గ్రామం సిద్దాంతం గ్రామంగా ఎలా మారింది??
*గుడిపాడు,అంకసానిపాడు గ్రామాలు ఏవిధంగా ఏర్పడ్డాయి??
*ధర్మవేమారెడ్డి కాలంలో జరిగిన పరుసవేది వృత్తాంతం ఏమిటి?
*ద్రాక్షారామ భీమేశ్వరాలయం,సామర్లకోట కుమార భీమేశ్వరాలయలను నిర్మించిన రాజు ఎవరు??
*ద్రాక్షారామం ప్రాచీన నామం ఏమిటి??ద్రాక్షారామంలో దాదాపు వేయి సంవత్సరాల క్రితం నెలకొన్న సామాజిక,ఆర్థిక,మత,వర్ణవ్యవస్థ పరిస్థితులు ఏమిటి??
*క్రీ.శ ఏ కాలం నాటికి గోదావరి,ద్రాక్షారామపురం అనే పేర్లు వాడుకలోకి వచ్చాయి??
*ఒక అఖండ దీపారాధన కోసం కావాల్సిన నెయ్యి కోసం ఎన్ని గోవులు అవసరం??
*ఆంధ్రదేశంలో బౌద్ధ,జైన మతాలను తీవ్రంగా అణచివేసి,ఉత్తర భారతదేశం నుండి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను రప్పించి,హిందూ మతాన్ని ఆంధ్రదేశంలో స్థిరీకరించిన రాజు ఎవరు?ఆనాటి పరిస్థితులు ఏమిటి??
*వరంగల్ సీతాఫ్ ఖాన్,రాజమహేంద్రవరం సీతాఫ్ ఖాన్ ల మధ్య సంబంధం ఏమిటి??
*1759,మే 14 న కోస్తా జిల్లాలను బ్రిటిష్ వారికి ఈనాం గా ఇచ్చిన నిజాం నవాబు ఎవరు??
*సర్కారు జిల్లాలలో ఫ్రెంచివారి నిష్క్రమణ మరియు బ్రిటిష్ వారి ప్రాబల్యం ఏవిధంగా ఏర్పడ్డాయి??
*అనేక శాసనాలలో ప్రస్తావించబడిన ఇనుపఎడ్లు అంటే ఏమిటి??
*ఆలయాలలో గోశాలల నిర్మాణం ప్రారంభించిన రాజు ఎవరు?
*సాని అనే పదం యొక్క పవిత్రత ఏమిటి?దేవాలయాలలో వారు చేసిన పవిత్ర సేవలు ఏమిటి?వారు పొందిన గౌరవాలు ఎట్టివి?కాలక్రమంలో సాని అంటే బూతుగా ఎలా,ఎందుకు మారింది??
*కాలీన్ మెకంజీకి శాసనాలు,కైఫీయత్తులు సేకరణలో తోడ్పడిన సహాయకులు,చిత్రకారులు ఎవరు?వారి కృషి వలన తెలుగు ప్రాంతానికి జరిగిన చారిత్రక మేలు ఏమిటి??
ఇత్యాది విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే...❤❤
తెలంగాణా ప్రాంతంతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలో ప్రాచీన చరిత్రపై జరుగుతున్న పరిశోధనలు,రచనలు బహు తక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు...అయితే ఈ పుస్తకం కోసం రచయిత బొల్లోజు బాబా గారి పరిశోధన,శ్రమ,అవిరాళ కృషి నిజంగా శ్లాఘనీయం...చక్కని వివరాలతో,ఆధారాలతో సరళ శైలిలో వారు ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు...కేవలం తూర్పుగోదావరి జిల్లా వాసులు మాత్రమే కాకుండా తెలుగువారందరు చదవదగిన పుస్తకం రచించిన రచయిత బొల్లోజు బాబా గారికి...🙏🙏🙏
వీరి కలం నుండి ఇలాంటి రచనలు అనేకం రావాలని ఒక చరిత్ర విద్యార్థిగా నేను ఆశిస్తున్నాను...💐💐💐💐
ఈ పుస్తకం కావాల్సిన వారు పల్లవి పబ్లికేషన్స్ వారిని 9866115655నంబర్ లో సంప్రదించగలరు...
writeup by Sri కోండ్రు రమేష్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment