సమాచారం కావలెను.
రాజమహేంద్రవరంలో చాళుక్య గుణగవిజయాదిత్యుడు ఒక కోట నిర్మించాడు. ఈ కోటకు రెడ్డిరాజులు అనేక మార్పులు చేర్పులు చేసారు. ఈ కోట శిథిలాలు ఇరవయ్యవశతాబ్దం ప్రారంభం వరకూ ఉండేవి. ఈ కోటలో మదనగోపాల స్వామి, ముల్లగూరిశక్తి ఆలయాలు ఉండేవని శ్రీనాథుని పద్యాలద్వారా తెలుస్తుంది.
.
ఉండునేవీట మార్కండేయమునినాథ సజ్జలింగమనంగ శాసనుండు
ప్రవహించునేవీటి పశ్చిమప్రాకార మొరసి గంగమ్మ సాగరముకొమ్మ
యావిర్భవించినా డేవీటికోటలో బలభేది #మదనగోపాలమూర్తి
పాలించునేవీటి ప్రాగుదక్కోణంబు నుమతోడి శ్రీముల్లగూరిశక్తి
(కాశీ ఖండము-శ్రీనాథుడు)
.
ఈ మదనగోపాల స్వామి విగ్రహం ఫొటో 1920 ల నాటిది. (కర్టసీ: బి.వి కృష్ణారావు)
నాకు కావలసిన సమాచారం
.
ఈ మదనగోపాల స్వామి విగ్రహం నేడు రాజమండ్రిలో ఏదైనా ఆలయంలో భద్రపరచబడిందా? (నేటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం ఇది కాదు). మరేదైనా ఆలయంలో ప్రతిష్టించారా లేక వందేళ్ల కాలంలో ఈ విగ్రహం కాలగర్భంలో కలసిపోయిందా
.
ఎవరికైనా సమాచారం తెలిస్తే పంచుకోగలరు దయచేసి.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment