రామ్, రవీ మా డ్రాయింగు మాస్టారు శ్రీ చెల్లి కృష్ణమూర్తి గారి
అబ్బాయిలు. మేమంతా ఒకే స్కూల్ లో చదూకున్నాం. వీళ్ళిద్దరూ నాకు సీనియర్స్. రామ్ పాలిటెక్నిక్ చదివి నాతో పాటు ఇంటర్ లో కొంతకాలం కలిసాడు.
తరువాత ఉద్యోగం వచ్చి వెళిపోయాడు. అప్పట్లో చలం పుస్తకాలు పట్టుకొని తిరిగేవాడు. నేను డిగ్రీలో కొచ్చాకా చలాన్ని తాకాను.
ఇక రవి గురించయితే నాకెప్పుడూ కన్ఫ్యూజనే నేనెవరితో మాట్లాడుతున్నానో అని. చాన్నాళ్లకు కానీ క్లారిటీ రాలేదు.
రవి కూడా కవిత్వం వ్రాస్తాడు. చక్కగా ఆలపించగలడు. వక్తగా సభల్లో రంజింపచేయగలడు. అంతకు మించి "ఒక కవిని కన్న తండ్రి".
కొయిటా అమ్మకు కన్నీటి సంతకం ఒక సంచలనం. శివారెడ్డిగారు అంటూంటారు ఒక్క కవిత..... ఒక్క కవిత చాలు నిన్ను ఓ ఇరవై ఏళ్లు బ్రతికిస్తుందని. అలా ఆ సంపుటి రామ్ కి తెచ్చిన కీర్తి అజరామరం.
అయినప్పటికీ రామ్ రెండో పుస్తకం తేవాలి. ఈ ఇరవై ఏళ్ళలో ఏ మేరకు పదునెక్కాడో, ఏ మేరకు విస్త్రుతమయ్యాడో సాహిత్యచరిత్రలో నిక్షిప్తం కావాలి..... అది అవసరం.
నాకు తెలిసి రవి వద్ద మంచి కవితలు ఉన్నాయి. వాటిని వెలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొడుకుతో పోటీ పడే అవకాసం ఎంతమందికి వస్తుంది? ఇద్దరూ ఒకే ట్రాక్ పై పరిగెడుతూంటే చూడాలని ఉంది.... ... పోనీ పాడుతూంటే ... సరదాకి
మా ముగ్గురినీ కలిపి ఉంచే అంతస్సూత్రం శిఖామణి గురువుగారు. ఆ చెట్టుపై వాలిన పిట్టలం ముగ్గురం.
Ram Poet, Chelli Ravi ఇద్దరకూ జన్మదిన శుభాకాంక్షలు
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment