Wednesday, December 4, 2019

సోషల్ ఇంజనీరింగ్

సోషల్ ఇంజనీరింగ్
మన జీవితాల్ని ఎక్సెల్ షీట్ లో
గదులు గదులుగా నింపి
బోర్డు మీటింగుల్లో
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా
మన తరపున నిర్ణయాలు తీసుకొంటారు
ఏం కొనాలో
ఏం తినాలో
ఎలా బతకాలో అన్ని నిర్ణయాలూ.
ఆ ప్రకారం జీవించాల్సిందే! వేరే దారి లేదు.
వ్యతిరేకించటానికి చేసే ధర్నా కూడా
నిర్దేశిత ప్రదేశాలలో అనుమతి తీసుకొని చేయాలి.
ఏదో కంపనీ సబ్బు కొని నీకు కరుణ ఉందని
ఏదో దేశ ప్రజలను ద్వేషించి నీకు దేశభక్తి ఉందని
నిరూపించుకోవలసి ఉంటుంది.
ఇప్పుడు ప్రపంచం
చక్కగా నియంత్రించబడుతోన్న ఒక యంత్రాంగం
చివరకు
నిన్నరాత్రి నువ్వు కన్న స్వప్నంతో సహా!
బొల్లోజు బాబా

No comments:

Post a Comment