ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే
ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో
ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యేసందర్భాలలో వర్తించదనే
విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించివ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం
చదివితే అర్ధమౌతుంది.
శ్రీలంకలో తమిళులపైజులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్
జులై’అంటున్నారు చరిత్రకారులు.ఈ దాడులలో దాదాపు మూడువేలమందిప్రాణాలు కోల్పోయారు.
తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా
షాపులను తగలబెట్టారు.లక్షా యాభైవేలమంది
నిర్వాసితులయ్యారు.ఇదంతా చరిత్ర.చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు,
కారణాలు మాత్రమే ఉంటాయి.
ఆనాటి బాధితుల మనోద్వేగాలు,
హంతకుల ఉన్మత్తత,తటస్థుల ప్రవర్తనలాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలోఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలోప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే
వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో
ఊచకోత జరిగినాఅరసనాయగం కవిత్వాన్ని
గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.
*
1.తుపాకి మాట్లాడితే – If the gun speaks
తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి
మాట్లాడితే.
గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది
చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం
నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది
ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది
తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి
చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.
(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ
పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.
అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను
పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత
హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)
No comments:
Post a Comment