బాంబు అడ్డుకొలత ముప్పై సెంటిమీటర్లు
నలుగురు మృతులు, పదకొండుమంది క్షతగాత్రులతో
దాని విస్ఫోటన పరిధి ఏడు మీటర్లు
అది కలిగించిన దుఃఖం రెండు ఆసుపత్రులకు
ఒక స్మశానానికి విస్తరించింది.
నలుగురు మృతులు, పదకొండుమంది క్షతగాత్రులతో
దాని విస్ఫోటన పరిధి ఏడు మీటర్లు
అది కలిగించిన దుఃఖం రెండు ఆసుపత్రులకు
ఒక స్మశానానికి విస్తరించింది.
పాతిపెట్టబడిన అమ్మాయి
వందకిలోమీటర్ల దూరంలో ఉండే
సిటీ నుండి రావటం వల్ల
ఈ వలయం మరింత పెద్దదయ్యింది.
వందకిలోమీటర్ల దూరంలో ఉండే
సిటీ నుండి రావటం వల్ల
ఈ వలయం మరింత పెద్దదయ్యింది.
ఆమె మరణ వార్త విన్న ప్రియుడు ఎక్కడో మరో దేశంలో
ఒంటరిగా విలపిస్తూండటంతో
ఈ వలయంలోకి మొత్తం ప్రపంచమే వచ్చినట్లయింది
ఒంటరిగా విలపిస్తూండటంతో
ఈ వలయంలోకి మొత్తం ప్రపంచమే వచ్చినట్లయింది
దేవుని సింహాసనం వరకూ
ఇంకా దాన్ని దాటికూడా ప్రతిధ్వనించే
అనాధల ఆక్రందనలను ఈ వలయంలో చేర్చలేదు
ఇంకా దాన్ని దాటికూడా ప్రతిధ్వనించే
అనాధల ఆక్రందనలను ఈ వలయంలో చేర్చలేదు
అపుడీ వలయానికి అంతమూ ఉండదు
అందులో దేవుడూ ఉండడు.
అందులో దేవుడూ ఉండడు.
Source: The Diameter of the Bomb by Yahuda Amichai
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment