Wednesday, December 4, 2019

ఎన్నికలు ప్రజలకొరకు…

ఎన్నికలు ప్రజలకొరకు…
ఓటు మన హక్కు మాత్రమే కాదు
సమాజాన్ని మంచివైపు నడిపించే చోదక శక్తి
వ్యవస్థలోని చెడును సంహరించే
అతిపెద్ద అహింసాయత ఆయుధం.
ఓటు వేయటం అంటే
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు
కృతజ్ఞతగా రుణం తీర్చుకోవటం.
ఓటు వేయటం అంటే
సమాజ శ్రేయస్సు కొరకు పౌరులందరూ
భక్తి శ్రద్ధలతో నిష్ఠగా వ్రతాన్ని ఆచరించటం.
ఎన్నికలనేవి నాయకుల కొరకు కాదు ప్రజలకొరకు
.
“రాజకీయాలపట్ల మాకేమీ ఆసక్తిలేదు” అన్నంత మాత్రాన
రాజకీయం వారికేమీ మినహాయింపునివ్వదు.
శరణార్థులకు ఓటు హక్కు ఉండదు
ఓటుండీ వేయనివాడు శరణార్థి కన్నా దుర్బలుడు.
ఓటుండీ వేయనివారే పరోక్షంగా
అవినీతి నాయకుల్నిఎన్నుకొంటున్నారు.
ప్రజాస్వామ్యమంటే
మనల్ని మనమే పరిపాలించుకోవటం.
విచక్షణతో యోగ్యుల్ని ఎన్నుకొన్నప్పుడే
అది సాధ్యపడుతుంది.
ప్రలోభాలకు లొంగి ఓటు వేయటం అంటే
మన భద్రతను ఎవరికో తాకట్టుపెట్టటమే.
మనకొరకు, మనం ప్రేమించేవారికొరకు
మేలైన సమాజం కొరకు
విజ్ఞతతో ఓటువేసి మంచి నాయకుల్ని ఎన్నుకొందాం.
మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని నిర్మిద్దాం.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment