సమకాలీన నేపథ్యం లోంచి మానవ జీవన వాస్తవికతను వ్యంగ్యాత్మక పదునుతో వ్యక్తీకరించే కవిత్వాన్ని వ్రాసినందుకు" అంటూ విస్లోవా షింబోర్స్ కా కు 1996 లో నోబుల్ పురస్కారం అందించారు.
నర్మగర్భంగా ఉండే విషాదాన్ని పైకి కనిపించే సరళతతో దాయటం షింబోర్స్కా కవిత్వ లక్షణం. తేటదనం, గూఢార్ధమూ ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఆమె కవిత్వం అంత తేటగా ఉన్నప్పటికీ అశేష పాఠకుల ఆదరణ పొందటం పెద్ద పెద్ద విమర్శకులను ఆశ్చర్యపరచిన అంశం. ఆమె ఏ సిద్ధాంతాలకు, స్కూల్ ఆఫ్ థాట్స్ కు చెందకుండా-చారిత్రిక సంవేదనలకు, కవి సామాజిక బాధ్యతలకు, కట్టుబాట్లకు దూరంగా ఉండి- తనదైన శైలిని నిర్మించుకొన్నారు.
ఈ క్రింది కవితలో ఒక విషాదఘట్టాన్ని ఒక టెర్రరిస్టు పాయింటాఫ్ వ్యూతో వర్ణిస్తారు షింబోర్స్కా. సంఘటనా స్థలం నుంచి ఒక రిపోర్టులా అనిపిస్తున్నా అంతర్లీనంగా ఒక దిగులు ఉంది కవితలో.
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
ఉగ్రవాది.... చూస్తున్నాడు --- The Terrorist, He Watches by Wislawa Szymborska
సరిగ్గా ఒంటిగంటా ఇరవై నిముషాలకు
అక్కడో బాంబు పేలనుంది.
ఇప్పుడు సమయం ఒంటిగంటా పదహారు నిముషాలు.
ఇంకా కొంత సమయం ఉంది.
కొంతమంది లోనికి రావటానికి
మరికొంతమంది బయటకు పోవటానికి
అక్కడో బాంబు పేలనుంది.
ఇప్పుడు సమయం ఒంటిగంటా పదహారు నిముషాలు.
ఇంకా కొంత సమయం ఉంది.
కొంతమంది లోనికి రావటానికి
మరికొంతమంది బయటకు పోవటానికి
విస్ఫోటనం వల్ల ఏ హాని జరగనంత దూరంలో
ఉగ్రవాది దాక్కొని అంతా గమనిస్తున్నాడు
సినిమాల్లో చూపించే విధంగానే:
ఉగ్రవాది దాక్కొని అంతా గమనిస్తున్నాడు
సినిమాల్లో చూపించే విధంగానే:
పచ్చరంగు దుస్తుల్లో ఒక స్త్రీ లోనికి వెళ్లింది
నల్లకళ్లద్దాలు ధరించిన అతను బయటకు వచ్చాడు
జీన్స్ వేసుకొన్న కుర్రాళ్లు మాట్లాడుకొంటున్నారు
మరో నిముషం గడిచింది
పొట్టిగా ఉన్న అతను బహుసా అదృష్టవంతుడు
స్కూటరెక్కి వెళిపోయాడు అక్కడనుంచి
ఓ పొడుగతను లోపలకు వెళుతున్నాడు
నల్లకళ్లద్దాలు ధరించిన అతను బయటకు వచ్చాడు
జీన్స్ వేసుకొన్న కుర్రాళ్లు మాట్లాడుకొంటున్నారు
మరో నిముషం గడిచింది
పొట్టిగా ఉన్న అతను బహుసా అదృష్టవంతుడు
స్కూటరెక్కి వెళిపోయాడు అక్కడనుంచి
ఓ పొడుగతను లోపలకు వెళుతున్నాడు
పదిహేడునిముషాల నలభై సెకన్లు
ఆకుపచ్చ రిబ్బన్ కట్టుకొన్న అమ్మాయి వస్తోంది
బస్సు అడ్డంగా రావటం వల్ల
ఆమె లోపలకు వెళ్ళిందా లేదా అన్నది తెలియలేదు
పద్దెనిమిది నిముషాలు
ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిఉంటుందా లేదా?
ఏమో! శవాలను బయటకు మోసుకొచ్చినప్పుడు చూడాలి
ఆకుపచ్చ రిబ్బన్ కట్టుకొన్న అమ్మాయి వస్తోంది
బస్సు అడ్డంగా రావటం వల్ల
ఆమె లోపలకు వెళ్ళిందా లేదా అన్నది తెలియలేదు
పద్దెనిమిది నిముషాలు
ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిఉంటుందా లేదా?
ఏమో! శవాలను బయటకు మోసుకొచ్చినప్పుడు చూడాలి
పంతొమ్మిది నిముషాలు
ఎవరూ లోపలకు వెళుతున్న జాడ లేదు
ఓ బట్టతల వ్యక్తి బయటకు వచ్చాడు
గ్లోవ్స్ కోసం జేబులు ఒకసారి తడుముకొని
మళ్ళా లోపలకు వెళిపోయాడు
ఎవరూ లోపలకు వెళుతున్న జాడ లేదు
ఓ బట్టతల వ్యక్తి బయటకు వచ్చాడు
గ్లోవ్స్ కోసం జేబులు ఒకసారి తడుముకొని
మళ్ళా లోపలకు వెళిపోయాడు
ఒంటిగంటా ఇరవై నిముషాలు
కాలం సాగుతోంది
సమయం అయిపోయింది
ఇంకా కాలేదు
అవును అప్పుడే
బాంబు...... విస్ఫోటనం జరిగింది
కాలం సాగుతోంది
సమయం అయిపోయింది
ఇంకా కాలేదు
అవును అప్పుడే
బాంబు...... విస్ఫోటనం జరిగింది
Source: The Terrorist, He Watches by Wislawa Szymborska
అనువాదం; బొల్లోజు బాబా
No comments:
Post a Comment