నేను మాట్లాడుతున్నాను (I am Speaking by Rafael Guillen)
నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను.
ఒక చిన్నారి పెప్పరుమెంటును తన పళ్లమధ్య
పగలగొట్టి నాకు సగం ముక్క ఇచ్చింది
ఒక చిన్నారి పెప్పరుమెంటును తన పళ్లమధ్య
పగలగొట్టి నాకు సగం ముక్క ఇచ్చింది
నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను
లక్షల మంది ప్రజలు గొంతులు పగిలేలా
"అది శిక్షార్హం కాదు" అని ఘోషిస్తున్నారు
లక్షల మంది ప్రజలు గొంతులు పగిలేలా
"అది శిక్షార్హం కాదు" అని ఘోషిస్తున్నారు
నేను అమ్మగురించి మాట్లాడుతున్నాను
ఒక స్త్రీ ఏదో అనాది గీతాన్ని పాడుతూ
ఏడుస్తున్న నా ముక్కు తుడిచింది.
ఒక స్త్రీ ఏదో అనాది గీతాన్ని పాడుతూ
ఏడుస్తున్న నా ముక్కు తుడిచింది.
నేను నా దేశం గురించి మాట్లాడుతున్నాను
ఒక యువకుడు దోసిలి నిండా రక్తాన్ని నింపుకొని
"దీన్ని మొదలు పెట్టింది నేను కాదు" అంటున్నాడు
ఒక యువకుడు దోసిలి నిండా రక్తాన్ని నింపుకొని
"దీన్ని మొదలు పెట్టింది నేను కాదు" అంటున్నాడు
నేను మృత్యువు గురించి మాట్లాడుతున్నాను
అర్ధరాత్రి ఖాళీ వీధులలో ఎవరో నోటరీ కొరకు
వెతుకుతూ తిరుగుతున్నారు
అర్ధరాత్రి ఖాళీ వీధులలో ఎవరో నోటరీ కొరకు
వెతుకుతూ తిరుగుతున్నారు
నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను
ఒక మతపెద్ద అంత్యక్రియలు ముగించి
కళ్ళు పైకెత్తి దేవుడివైపు చూస్తున్నాడు
ఒక మతపెద్ద అంత్యక్రియలు ముగించి
కళ్ళు పైకెత్తి దేవుడివైపు చూస్తున్నాడు
నేను దేవుడి గురించి మాట్లాడుతున్నాను
సమస్తమూ నన్ను నిశ్శబ్దంగా గమనిస్తోంది.
సమస్తమూ నన్ను నిశ్శబ్దంగా గమనిస్తోంది.
Source: I am Speaking by Rafael Guillen
అనువాదం: బొల్లోజు బాబా
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment