"ఈస్ట్ ఇండియా కంపనీ అవసరాలకోసం చౌకగా గుమాస్తాలను తయారు చేయటానికి మెకాలే విద్యావిధానం (1835) రూపొందించబడింది" అన్న వాదన పదే పదే వినిపిస్తూంది.
"సంస్కృత విద్యావిధానం వలన ఈ దేశం చీకటిలో మగ్గిపోతున్నదని, ప్రజలకు - లెక్కలు, అనాటమీ, కెమిస్ట్రీ, ఫిలాసఫీ లాంటి ఉపయోగపడే విద్యలు నేర్పమని" రాజారామ్మోహన్ రాయ్ 11 డిసంబరు 1823 న ఎందుకు బ్రిటిష్ వారిని అభ్యర్ధించాడు? (అప్పటికి ఇంకా మెకాలే ఇండియా రానే లేదు... పాపం)
రాజారామ్మోహన్ రాయ్ కి కూడా చౌకగా ఉద్యోగుల అవసరం ఉందా?
అప్పటికి అమలులో ఉన్న సంస్కృత పాఠశాలల, మద్రాసాల విద్యలకు బదులు లెక్కలు, సైన్సు, జాగ్రఫీ లను బోధించే శాస్త్రీయ ఆధార ఆంగ్ల విద్యను మెకాలె సిఫార్సు చేసాడు.
దీనితో వేలసంవత్సరాలుగా విద్యకు మతానికి/కులానికి ఉన్న లింక్ కట్ అయిపోయింది. ఇది మన సామాజిక వ్యవస్థలో వచ్చిన అతి పెద్ద గుణాత్మక మార్పు.
ఆ మార్పు ఇష్టంలేని వాళ్ళే మెకాలేని ఇంకా తిట్టుకొంటున్నారు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment