వసంతం - The Spring by Pablo Neruda
మనలో కాంతి నింపటానికి
పిట్ట వచ్చింది.
పిట్ట కువకువల్లోంచి నీరు పుట్టింది
నీటికి, కాంతికి మధ్య గాలి విచ్చుకొంది
అలా వసంతరుతువు ప్రారంభమైంది
పిట్ట వచ్చింది.
పిట్ట కువకువల్లోంచి నీరు పుట్టింది
నీటికి, కాంతికి మధ్య గాలి విచ్చుకొంది
అలా వసంతరుతువు ప్రారంభమైంది
తాను వయసుకు వచ్చానని
విత్తనం తెలుసుకొంది
పువ్వుల బొమ్మల్ని వేరు చిత్రిస్తుంది
చివరగా
పుప్పొడి కనులు తెరుచుకొన్నాయి.
విత్తనం తెలుసుకొంది
పువ్వుల బొమ్మల్ని వేరు చిత్రిస్తుంది
చివరగా
పుప్పొడి కనులు తెరుచుకొన్నాయి.
ఇదంతా
పచ్చని కొమ్మపైన
ఓ చిన్నపిట్ట వాలటం వల్ల జరిగింది.
పచ్చని కొమ్మపైన
ఓ చిన్నపిట్ట వాలటం వల్ల జరిగింది.
Source: The Spring by Pablo Neruda (La Primavera)
అనువాదం: బొల్లోజు బాబా
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment