Wednesday, December 4, 2019

The Painter… Bolloju Baba

My sincere thanks to Sri N S Murthy gaaru for a wonderful rendering of my poem. thank you so much sir
.
The Painter… Bolloju Baba
Once
His signature on walls,
Banners, signboards and cut-outs
Used to gleam like
The solar disc hanging on to the horizon.
Between the straight lines
He drew with the twine dipped in indigo
His letters used to nestle like doves in a nest.
The paints amid the squirrel hairs of the brush
Marched with the discipline of soldiers.
Producing derived colours from the basic
Was an esoteric skill… known only to him.
It was common those days
While cleaning the premises each day,
To find a few pairs of eyes and hearts
Of anonymous admirers lost in front of his paintings.
For beginners, his letters
Used to show the way clearly, but silently.
Oh! His wooden box overflowed color cans!
It seemed he slivered rainbow vertically
And stuffed each color with its shades in those cans.
There were any number of brushes in that Box
From the hair-thin line to sky-wide line.
The stains of colours
That appear so liberally
On his bald-head, his hands and skin
Seemed to confer
A kind of divinity to him.
But, today
The vinyl prints, the Flexi banners,
The Photo-shops and the Corel-Draws
Like winter seizing from all sides
Have invaded him
And his livelihood melted like a shattered dream.
An undiluted darkness
Suddenly spilt all over his life’s canvas.
From now on, with nothing else to do
He would encounter us on the road some day
Doing a sketch of Christ or a drawing of Saibaba .
.
Bolloju Baba
Telugu Poet, Indian
పెయింటరు
ఒకప్పుడు
గోడలు, బేనర్లు, సైను బోర్డులూ
కటౌట్లపై వాడి సంతకం
ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా
వెలిగిపోతుండేది.
నీలిమందు నీళ్ళలో ముంచిన పురికొస సాయంతో
వాడు గీసిన సరళరేఖలమధ్య అక్షరాలు
గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి.
కుంచెలోని ఉడుతవెంట్రుకల మధ్య వర్ణాలు
సురక్షిత సైనిక కవాతులా కదిలేవి.
బేసిక్ కలర్స్ నుండి డిరైవ్డ్ రంగుల్ని
సృష్టించడం వాడికి మాత్రమే తెలిసిన ఓ రసవిద్య.
అతడు గీసిన చిత్రాలముందు
ఎవరెవరోపారేసుకున్న
ఓ పది పన్నెండు కళ్ళూ, రెండు మూడు హృదయాలూ
ప్రతిరోజూ తుడుపులో దొరుకుతుండేవి.
కొత్తవారికి వాడి రాతలు
నిశ్శబ్దంగా, నిర్దుష్టంగా దారిచూపేవి.
వాడి చెక్కపెట్టినిండా రంగురంగుల డబ్బాలే!
ఇంద్రధనుస్సుని నిలువునా చీరి
ఒక్కో ముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది.
పెట్టెలో వివిధ సైజుల్లో బ్రష్షులు ఉండేవి
సన్నని గీతనుండి ఆకాశమంత పెద్దరేఖ వరకూ గీయటానికై
వాడి బట్టతలపై, వంటిపై, హృదయంపై
చిలికిన రంగుల మరకలు
వాడికో దివ్యత్వాన్నిస్తున్నట్లు
మురిసిపోయేవి.
కానీ ఇప్పుడు
వినైల్ ప్రింట్లూ, ఫ్లెక్సీ బేనర్లూ
ఫోటో షాపులూ, కొరెల్ డ్రాలూ,
అన్నివైపులనుండీ కమ్ముకునే
శీతవేళలా వాడిని మింగేశాయి.
వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది.
వాడి జీవితంలోకి
థిన్నర్ కలుపని చిక్కని నల్లని రంగు ఎగజిమ్మింది.
ఎప్పుడో ఎక్కడో వాడు
రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో
కళాత్మకంగా మనదారికడ్డంపడతాడు
ఇంకే చెయ్యాలో తెలియక!
.
(పెయింటర్ మిత్రుడు కీ. శే. పట్నాల రమణ ప్రసాద్ కు
వెబ్ పత్రిక తెలుగుజ్యోతి సెప్టెంబరు-అక్టోబరు 2008)
బొల్లోజు బాబా
(ఆకుపచ్చని తడిగీతం నుండి)

No comments:

Post a Comment