మొన్న విశాఖపట్నం వెళినపుడు డచ్చి సమాధులు చూద్దామని భీమిలి వెళ్లాను. కొన్ని సమాధి ఫలకాల ఫొటోలు తీసుకొన్నాను.
భారతదేశంలో వ్యాపారనిమిత్తం మొదట పోర్చుగీస్ వారు, తరువాత డచ్, ఆ వెనుక ఇంగ్లీషు, డెన్మార్క్ , ఫ్రెంచి వాళ్లు వచ్చారు.
ఆంధ్రప్రాంతంలో డచ్చివారు- భీమిలిపట్నం, కాకినాడ, పాలకొల్లు, ద్రాక్షారామం మచిలిపట్నం నిజాంపట్నం, పులికాట్ లాంటి ప్రాంతాలనుంచి మంచి వ్యాపారమే సాగించారు.
బ్రిటిషు, ఫ్రెంచి వాళ్ళ సమాధులు పెద్దగా ఆకర్షణీయంగా ఉండవు. డచ్చివారి సమాధులు కళాత్మకంగా ఉంటాయి.
బ్రిటిషు, ఫ్రెంచి వాళ్ళ సమాధులు పెద్దగా ఆకర్షణీయంగా ఉండవు. డచ్చివారి సమాధులు కళాత్మకంగా ఉంటాయి.
భీమిలి సెమెటరీలో ప్రధానంగా ఆకర్షించినవి గోపురాలలాగ ఉన్న నాలుగు పెద్ద సమాధులు. సమాధిఫలకంపై ఉన్న వివరాలను బట్టి 1765, 1768, 1783 లలో మరణించిన ముగ్గురు వ్యక్తుల వివరాలు దొరికాయి.
1765
1. జాఫ్నా పట్నంలో పుట్టి భీమిలిపట్నంలో 8-3-1765 న మరణించిన కాథరినా రోలోఫ్స్ ( Catharina Roelofs)
2. చనిపోయేనాటికి ఈమె వయసు 63 సంవత్సరాల, పదకొండునెలల, పదిహేను రోజులు
3. ఈమె భర్త పేరు ఇ. జాన్ మారిట్స్ (E. John Maurits). భార్యచనిపోయిన సమయంలో ఈయన శ్రీలంకలో పుంటో పెడ్రో అనే డచ్చి స్థావరంలో ఉద్యోగం చేస్తున్నాడు.

1768
1. జర్మనిలోని లిప్పే పట్టణంలో జన్మించిన ఢీర్ జాన్ విస్చెర్ (D'Heer Jan Visscher) భీమిలిపట్నంలో 26-11-1768 న చనిపోయారు.
2. ఇతని వయసు 48 సంవత్సరముల ఆరునెలల పంతొమ్మిది రోజులు
3. ఇతను ఇక్కడ డచ్చి కంపెనీలో ఉద్యోగి

1783
1783 లో చనిపోయిన వ్యక్తి హెలెనె స్టురెట్ (Helene Steuret). ఈమె తో పాటే ఆమె తల్లి, భర్త, కుమారుడు కూడా అక్కడే ఖననం చేయబడ్డారు అని ఆ ఫలకంలో ఉంది.
1783 లో చనిపోయిన వ్యక్తి హెలెనె స్టురెట్ (Helene Steuret). ఈమె తో పాటే ఆమె తల్లి, భర్త, కుమారుడు కూడా అక్కడే ఖననం చేయబడ్డారు అని ఆ ఫలకంలో ఉంది.
ఈ నాలుగు గోరీలలో మొదటిదానిపై ఉన్న నల్లరాతి ఫలకం చాలా అందంగా ఉంది. పైన లతలతో కూడిన డిజైన్ ఉండి దాని మధ్యలో చేపను నోటితో పట్టుకొన్న కొంగ బొమ్మ ఉంది. (పైన, మధ్యలో రెండుచోట్ల). ఇలాంటి డిజైన్ ను "Coat of Arms" అంటారు. ఇది ఆ సమాధిలో ఉన్న వారి వంశావళిని తెలియచేస్తుందట.
దాని ఆధారంగా ఈ సమాధులు Tamerus Canter Visscher వంశానికి చెందినవిగా గుర్తించారు.
దాని ఆధారంగా ఈ సమాధులు Tamerus Canter Visscher వంశానికి చెందినవిగా గుర్తించారు.
కాంటర్ విస్చర్ అనే ఆయన బెంగాలులోని, డచ్చి స్థావరమైన కాసింబజారు కు రెండవ అధికారిగా పనిచేసాడు. Chinsura చర్చి నిర్మాణంలో పాత్రవహించాడు. (ఇది ఇప్పటికీ అందమైన పురాతన చర్చ్. బెంగాల్ లో ఉంది)
పి.ఎస్. భీమిలిలో బీచ్ వద్దనున్న సెమెటరీ డచ్ సైనికులకు సంబంధించినదిగా రికార్డులను బట్టి తెలుస్తున్నది. సివిలియన్స్ ది మరో చోట ఎక్కడో ఉండాలి... ఉందో... లేదో
No comments:
Post a Comment