భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిముల పాత్ర అంటూ వాట్సప్ లో చక్కెర్లు కొడుతున్న ఒక పోస్టును రమా సుందరి గారు తన వాల్ పై పోస్ట్ చేసారు.
అక్కడ నేను చేసిన కామెంటు ఇది
అక్కడ నేను చేసిన కామెంటు ఇది
పై వ్యాసంలో చాలా హిస్టారికల్ ఫాలసీలు ఉన్నాయి. మీలాంటివారు వీటిని షేర్ చేయటం అంత బాగాలేదు.
నవభారత నిర్మాణంలో ముస్లిముల పాత్ర గణనీయమైనది. ఇది కాదనలేని సత్యం.
వ్యాసం మొత్తం ఎవరినో టార్గెట్ చేయటానికి ముస్లిముల భుజాలపై తుపాకి ఆనించి నట్లుంది.
నవభారత నిర్మాణంలో ముస్లిముల పాత్ర గణనీయమైనది. ఇది కాదనలేని సత్యం.
వ్యాసం మొత్తం ఎవరినో టార్గెట్ చేయటానికి ముస్లిముల భుజాలపై తుపాకి ఆనించి నట్లుంది.
1. విరాళాల విషయంలో చాలా మట్టుకు సెలక్టివ్ అనెక్ డోట్స్. అప్పట్లో దేశప్రజలందరూ విరాళాలు ఇచ్చారు
2. హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల, జాన్సి లక్ష్మి భాయి, బహదూర్ షా ల నాటికి అవి రాజ్యం కొరకు పోరాటాలు తప్ప స్వాతంత్ర్యపోరాటాలు కావు. రాజు లేకపోతే సైన్యానికి మోటివేషను ఉండదు అనే ఉద్దేశంతో అప్పట్లో బహదూర్ షా ను రాజుగా నిలబెట్టి "మొగల్ రాజ్యం" పునః స్థాపించటం కొరకు పోరాటం చేసారు కొంతమంది. ఒట్టొమాన్ ను అడిగితే ఆయన ఒప్పుకోడు బ్రిటిష్ వారి మిత్రుడైనందువల్ల. ఎనభై ఏళ్ల బహుదూర్ షా చివరలో నాకే పాపం తెలియదని, నన్ను మోసం చేసారని బ్రిటిష్ వారి ఎదుట తనకొడుకులను కోల్పోయాకా లొంగిపోతాడు. మూడురోజులనుండి తిండి కూడా తినలేదు అనటం దానికి పరాకాష్ట.
3. జాతీయ పతాకం రూపకర్తగా సురయ్యాను ముందుకు తీసుకురావటం - ఆంధ్రులు తెలంగాణాను ఇలాకూడా మోసం చేసారు అని పాండురంగా రెడ్డి అనే ఆయన ఇటీవల చేసిన ఒక వాదన. దీనికి పెద్దగా ఆధారాలు కనిపించవు
4. బ్రిటీష్, డచ్చ్, ఫ్రెంచ్ వారి లాగా వారు ఇక్కణ్ణుంచి ఏమీ దోచుకెళ్ళలేదు. ..... అనటం చరిత్రను విస్మరించటమే. గజని, గోరి, నాదిర్షాలు భారతదేశం నుంచి తరలించుకుపోయిన సంపదలు- మునిచి వ్రాసిన హిస్టరీ ఆఫ్ మొగుల్స్ లో వివరంగా ఉంటుంది. ముఖ్యంగా నాదిర్షా పట్టుకెళ్ళిన సంపద ఎంత అంటే- స్వదేశంలో ఇరవై ఏళ్ల పాటు ఏ పన్నులూ వసూలు చేయలేదట.
5. భారత దేశాన్ని అభివృద్ధి చేశారు. --- చోళులకాలం నాడు భారతదేశం మరింత సుభిక్షంగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం
6. చిన్న చిన్న రాజ్యాలను ముస్లిములు కాదు ఏకం చేస్తా పటేలు. 800 ఏళ్ల పాలనలో అవి చిన్న చిన్న రాజ్యాలుగానే ఉండిపోయాయి. నిజానికి అష్టాదశ శక్తి పీఠాలు భారతదేశంలో విస్తరించిన తీరు (కొన్ని ఇప్పటికీ బంగ్లాదేష్, నేపాల్, పాకిస్తాన్ లలో కూడా ఉన్నాయి) గమనిస్తే ఒకప్పుడు అధ్యాత్మికంగా భారతదేశం ఒకటిగానే ఉండేది అని భావించాలి. ముస్లిమ్ పాలనలో ముక్క చెక్కలయ్యింది అనిపించకమానదు
7. VO చిదంబరం పిళ్లై తమిళ స్వాతంత్ర్య వీరుడు. అతని ఉద్దాన పతనాలు ఒక కార్పొరేట్ వార్ లాగ అనిపిస్తుంది. అతని వ్యాపారానికిThurai Thevar అనే ఒక జమిందారు పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తుంది. పాతికరూపాయిల ముఖ విలువతో షేర్లు జారీచేసి 1906 లో అతను బ్రిటిష్ షిప్పింగ్ కంపనీకి పోటీగా స్వదేశీ షిప్పింగ్ కంపనీ పెట్టాడు. దీనిలో ముస్లిములు ఎవరైనా పెట్టుబడి పెడితే పెట్టి ఉండొచ్చు. అది వ్యాపారం
చివరగా నేను చెప్పొచ్చేదేమిటంటే
ముస్లిముల పాత్ర ప్రముఖమైనదే. కానీ అర్ధ సత్యాలతోను, మొదటి ప్రపంచ యుద్ధమెమోరియల్ అయినటువంటి ఇండియా గేట్ ను- ముస్లిం స్వాతంత్రసమరయోధుల పేర్లు అధికంగా కలిగిన స్వాతంత్ర్య సమర మెమోరియల్ అంటూ విపరీత వక్రీకరణలతోను దాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు.
ఇలాంటి అత్యుత్సాహం మంచి కన్న చెడే ఎక్కువ చేస్తుంది హిందూ ముస్లిముల ఐఖ్యత విషయంలో.
అసలు పై వ్యాసం కుష్వంత్ సింగ్ రాసాడని కూడా సరైన రిఫరెన్స్ లేదు.
No comments:
Post a Comment