Wednesday, December 4, 2019

Poem with a Tail by Orhan Veli Kanik, Turkey poet

Poem with a Tail by Orhan Veli Kanik, Turkey poet

మనిద్దరం కలవలేం
మన మార్గాలు వేరు
నువ్వు కసాయివాని రక్షణలో ఉన్నావు
నేనో ఊరకుక్కను.
నువ్వు పింగాణీ ప్లేటులో తింటే
నేను పులినోట్లోంచి తింటాను
నువ్వు ప్రేమను స్వప్నిస్తే
నేను బొమికల్ని స్వప్నిస్తాను.

నీ మార్గం కూడా అంత తేలికైనది
ఏమీ కాదులే మిత్రమా! నాకు తెలుసు
ఏ ఆకర్షణా లేకుండా ప్రతిరోజూ
తోక ఊపుకొంటూ తిరగటం
అంత సులువు కాదు.
అనుసృజన- బొల్లోజు బాబా

No comments:

Post a Comment