Wednesday, December 4, 2019

This Be The Verse - BY PHILIP LARKIN కవితను Avvari NagarajuRohith, Naveen Namboori లు అనువదించారు. Mohan P గారి వాల్ పై ఆ అనువాదాల పట్ల నేచేసిన కామెంటు ఇది.... ఇది కేవలం చర్చ కోసమే... మూడు అనువాదాల పట్ల నా సమీక్ష మాత్రమే....
భవదీయుడు
బొల్లోజు బాబా
ఫక్ అప్ పదానికి హెచ్చార్కె గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.
Fucked-up definition is - thoroughly confused, disordered, or damaged. (Merriam-Webster Dictiionary)
పై కవితలో ఫక్డ్ అప్ కు డామేజ్డ్ అనే అర్ధం సరైనదిగా తోస్తోంది.
కవితలో కవి "నీ తల్లితండ్రులు నిన్ను పాడుచేస్తారు/కలుషితం చేస్తారు/సర్వనాశనం చేస్తారు అనే అంటున్నాడని నాకు అనిపిస్తుంది.
పడదెంగుతారు /దెంగబెడ్తారు అనటంలో నైఘంటికార్థం వస్తుంది తప్ప... భావార్ధం రావటం లేదేమో.
1. fuck you up అనే పదానికి రోహిత్ నిన్ను దెంగబెడ్తారు అంటారు. నాకెందుకో ఆ మాటలో they get you seduced/fucked అనే అర్ధం ధ్వనిస్తోంది నాకు.
అదే పదానికి - అవ్వారి నాగరాజు గారు నిన్ను పడదెంగుతారు అంటారు. దీనిలో they fuck you గా అర్ధమౌతుంది
నవీన్ గారు అదే పదాన్ని నిన్ను సర్వనాశనం చేస్తారు అంటారు. అదెందుకో మూలానికి దగ్గరగా అనిపిస్తోంది.
2. They fill you with the faults they had
And add some extra, just for you.
అన్న వాక్యానికి రోహిత్ చేసిన - వాళ్ళు దెంగించుకున్నవన్నీ నీతో చేయిస్తారు... అనే అనువాదం మరీ విడ్డూరంగా అనిపిస్తోంది.
నవీన్ గారు అదే వాక్యాన్ని - వాళ్ళకుండిన లోపాలన్నిటినీ నీలో నింపుతారు/కాసిని ఎక్కువే వొంపుతారు, కేవలం నీకోసం ..... చక్కని అనువాదం.
3. But they were fucked up in their turn
అనే వాక్యం రోహిత్ చేతుల్లో - అసలు వాళ్ళే అప్పటికి దెంగిపొయుంటారు -- గా అనువదించబడింది. దెంగిపోయింటారు అనేది they had fucked and gone అనే అర్ధం ఇస్తోంది.
నాగరాజు గారి చేతుల్లో --కానీ వాళ్ళూ కూడా పడ దెంగబడి ఉంటారు-- గా మారింది.
ఇక నవీన్ గారి చేతుల్లో అది -- వాళ్ళప్పటికే దుంపనాశనమయ్యుంటారు -- అయ్యింది. This is how I understood the poem అనుకొంటున్నాను.
4. old-style hats and coats-- ను పాతకాలపు తలపాగాలు, కండువాలు అంటారు నవీన్ గారు. It is interesting.
5. It deepens like a coastal shelf -- అనే వాక్యానికి స్వేచ్చతీసుకోక తప్పదనిపించింది మూడు అనువాదాలు చూసాక.
కవిత్వంలో బూతులు వాడటం అల్ట్రా మోడర్న్ ఎక్స్ప్రెషన్ అనుకొంటాను తప్ప నాకేమీ అభ్యంతరాలు లేవు.
కానీ ఈ కవితానువాదంలో ఫక్డ్ అప్ కు చేసిన వాచ్యార్ధం అనవసరమనిపిస్తోంది. అలా చేయటాన్ని రివర్స్ ట్రాన్స్ లేషన్ చేస్తే - మూలంలోని భావం మొత్తం తలక్రిందులవటం జరుగుతోన్నది. ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమని అనుకొంటాను.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment