.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
గ్రామీణ వ్యవస్థ
.
సప్తశతి గాథలన్నీ గ్రామీణజీవనానికి సంబంధించినవి. గ్రామాలు, నిగమాలు అత్యంత క్రిందిస్థాయి పరిపాలనా విభాగాలు. గ్రామపాలనకు సంబంధించి గ్రామ పెద్ద, పన్నులు వసూలు చేసే అధికారి, కావలిదారుడు, తలారి, వైద్యుడు ఉండేవారని ఈ గాధల ద్వారా తెలుస్తుంది. ఆనాటి గ్రామాలు స్వతంత్రతను, కొంతవరకూ స్వయంపాలనను కలిగిఉండేవి.

సప్తశతి గాథలలో కనిపించే ఊరివర్ణనల ద్వారా ఆనాటి తెలుగుపల్లెల స్వరూపాన్ని ఊహించుకొనవచ్చును --
పల్లెలచుట్టూ కొండలు; చుట్టూ పొలాలు; సెలయేళ్ళు; ఇంటిచుట్టూ తిరుగాడే నెమళ్ళు; వానాకాలం వచ్చినప్పుడు బురద దారులు; కొలనులు, కొలనులనిండిన కలువలు; కలువలపైకి ఎగబ్రాకే తుమ్మెదలు; తామరాకుపై తపస్సుచేసే కొంగలు; నది ఒడ్డున ప్రేమికుల సమాగమ పొదలు; కాకులు, చిలుకలు, లేళ్ళు, పెంపుడు కుక్కలు, గోరువంకలు, చెట్లపై కోతులు; ఊరిమధ్యలో ఊడలు దిగిన పెద్ద మర్రిచెట్టు; గడ్డి ఇళ్ళు; శిథిల ఆలయాలు; ఎండుగడ్డితో వేసుకొనే చలిమంటలు; గడ్డిపరుపులు; ఎండాకాలంలో చెలరేగే కార్చిచ్చులు, తగలబడే ఇళ్ళు; బాటసారులు, బిచ్చగాళ్ళు, చలివేంద్రాలు; కట్టెలపొయ్యిలపై వంటలు; జాతరలు; చిరిగిన దుస్తులు ధరించే బీదజనం -- ఇవీ ఆనాటి పల్లెల రూపం.
***
***
గ్రామాన్ని సంరక్షించటం గ్రామపెద్ద విధి. అది బహుసా దొంగలు, బందిపోట్ల ముఠాలనుంచి కావొచ్చు. విధినిర్వహణలో అతను వీరోచితంగా వ్యవహరించి, గాయాలపాలయ్యేవాడని అర్ధమౌతుంది ఈ క్రింది గాథద్వారా...
.
ఊరికాపు అయిన మగని ఛాతీ
మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్టటం లేదు.
ఊరు మాత్రం ప్రశాంతంగా నిదురపోతోంది. (31)
***
ఊరికాపు అయిన మగని ఛాతీ
మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్టటం లేదు.
ఊరు మాత్రం ప్రశాంతంగా నిదురపోతోంది. (31)
***
గ్రామపెద్ద పదవి వంశపారంపర్యంగా సంక్రమించేది. గ్రామపెద్ద కొడుకు చిన్నతనం నుండే తండ్రివద్ద యుద్ధ విద్యలను నేర్చుకొని, అవసరమైనప్పుడు తన సాహసాన్ని ప్రదర్శించినట్లు కొన్ని గాధలలో కనిపిస్తుంది.
.
అతని బంధువులు శంకించినా
శత్రువులు భయపడినట్లుగానే
ఊరికాపు కొడుకు, చిన్నవాడైనా
గ్రామాన్ని కాపాడటంలో అసమాన్యమైన
ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. (630)
***
.
అతని బంధువులు శంకించినా
శత్రువులు భయపడినట్లుగానే
ఊరికాపు కొడుకు, చిన్నవాడైనా
గ్రామాన్ని కాపాడటంలో అసమాన్యమైన
ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. (630)
***
తనకు నిర్ధేశించబడిన ధర్మాన్ని ఆచరించటమే జీవనపరమార్ధమని ప్రాచీన భారతీయసంస్కృతి చెపుతుంది. మరణానంతరం తన సంతానం కూడా తనలాంటి నిబద్దతతో జీవించాలని కోరుకోవటం అనాదిగా ఉండేదే!
.
మరణశయ్యపై ఉన్న ఊరికాపు
తన కొడుకును దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు
"నాయినా! నా పేరు చెప్పుకోవటానికి
సిగ్గుపడేలా ప్రవర్తించకు ఏనాడూ" (634)
.
పై గాథలో ఆ ఊరికాపు తన ధర్మాచరణలో ఏ తప్పూ చేయలేదని ఎంత ఆత్మతృప్తితో ఉన్నాడో అర్ధమౌతుంది. ఎంతటి నిష్కల్మష జీవితాలు అవి!

గ్రామానికి సంబంధించిన బాగోగులు చూసుకోవటంలో తలమునకలై "సంసారిక బాధ్యతలను" విస్మరించే గ్రామపెద్దలు/మల్లయోధుల ప్రస్తావన ఓ గాథలో ఇలా ఉంది.
.
ఓసి పిచ్చిదానా! ఆనందంతో గంతులు వేస్తావెందుకూ?
ఇది సిగ్గుపడాల్సిన సందర్భం.
కుస్తీపోటీలో నీ భర్త విజయం సాధించినందుకు
మోగిస్తున్న విజయభేరి
నీ సంసారంలో సుఖం లేకపోవటాన్ని
ఊరంతా చాటింపు వేస్తున్నది. (687)
***
.
ఊరికాపు, పన్నులు వసూలు చేసే అధికారి, ధనికరైతులు ఆనాటి సమాజంలో పలుకుబడి కలిగిన సంపన్న వ్యక్తులు. వారి జీవన విధానం విలాసవంతంగా ఉండేదని, ధనిక-పేద వర్గ సమాజం ఈనాటిది కాదని ఈ గాథల ద్వారా అర్ధమౌతుంది.
.
ఊరిపన్నులు వసూలు చేసే అధికారి భార్య
రోజూ ఇచ్చే మధురమైన వంటకాల రుచిమరిగిన
ఆ పాలెకాపుకు మరే ఇతర తిండి సయించటం లేదు. (605)
.
ఆ డబ్బున్న స్త్రీ, పాలెకాపును ముగ్గులోకి దించినట్లుంది. ధనవంతులు తినే ఖరీదైన, రుచికరమైన వంటకాలు పేదరైతు భార్య ఎక్కడనుంచి తేగలదూ? (ఇంకా ఉంది)

బొల్లోజు బాబా
No comments:
Post a Comment