వెన్నెల గురించి
కురులతారాడే దవనపు పరిమళం గురించి
పసిపాప బుగ్గసొట్టలగురించి
మాట్లాడుకొని ఎన్నాళ్లయిందీ?
ఇప్పుడు సంభాషణలనిండా
మతం .... మతం
నెత్తురొక్కటే మన మధ్య మిగిలిన మాటలు
క్రిష్టియనులంటే మతమార్పుడులని
ముస్లిములు హింసకు ప్రతిరూపమని
హిందువులు విస్తరణవాదులని
మనమధ్య ముళ్ళు విస్తరించాయి
మన విశ్వాసాలతో వ్యాపారం జరుగుతోంది
ఎవరిని ద్వేషించాలో
ఎవర్నిదూషించాలో
అదృశ్య ఆజ్ఞలు సంచరిస్తున్నాయి
అంతరించిపోతున్న కప్పల గురించి
వలసలు పోతున్న మనుషుల గురించి
లుప్తమౌతున్న విలువలగురించి
మాట్లాడుకొని ఎన్నాళ్ళయిందీ?
దేశమిపుడో పులిబరుకుడు మాను
పులిని ఉత్త చేతుల్తో చంపే వీరులకోసం
కాలం ఎదురుచూస్తోంది!
బొల్లోజు బాబా
పులి బరుకుడు మాను
ReplyDeleteవెన్నెల గురించి
కురులతారాడే దవనపు పరిమళం గురించి
పసిపాప బుగ్గసొట్టలగురించి
మాట్లాడుకొని ఎన్నాళ్లయిందీ?
ఇప్పుడు సంభాషణలనిండా
మృత్యువు.... మృత్యువు..
విషాదమొక్కటే మనమధ్య మిగిలిన మాటలు
అంతరించిపోతున్న కప్పల గురించి
వలసలు పోతున్న మనుషుల గురించి
లుప్తమౌతున్న విలువలగురించి
మాట్లాడుకొని ఎన్నాళ్ళయిందీ?
ఇప్పుడు మాటలనిండా
కన్నీళ్ళు... కన్నీళ్ళు
వియోగమొక్కటే మనమధ్య మిగిలిన సంభాషణలు
ఒకే ఒక వ్యక్తి వైఫల్యం ఇపుడు
దేశప్రజలను ఎండుటాకుల్లా నేల రాలుస్తోంది
కన్నీటి చారికై దేహం పై విస్తరిస్తోంది
దుఖకెరటమై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది
శ్వాస కోసం ప్రాణల్ని పరుగులెత్తిస్తోంది.
దేశమిపుడో పులిబరుకుడు మాను
పులిని ఉత్త చేతుల్తో చంపే వీరులకోసం
కాలం ఎదురుచూస్తోంది!
బొల్లోజు బాబా