ఓ భార్య భర్తకు పాదనమస్కారం చేసింది
సంస్కృతి పరిరక్షణ జరిగిందని
జయజయ ధ్వానాలు మిన్నంటాయి
పాదాలు పక్కపక్కన
కలిసి నడవటానికి తప్ప
ఎక్కువ తక్కువ
ప్రదర్శించుకోవటానికి కాదన్న తెలివిడిని
క్రమక్రమంగా చేజార్చుకొంటున్న
జాతికి అభినందనలు
బొల్లోజు బాబా
telugu kavithalu
భర్త భార్యకు పాద నమస్కారం చేసుంటే వార్త గాని ఇదెలా అవుతుందండీ ? :)
ReplyDelete