Thursday, July 23, 2026

మరపురాని పరిమళం


పుస్తకం మధ్యలో
ఎండిపోయిన గులాబి

దానికిప్పుడు
సువాసన లేదు
విలువా లేదు

అయినా
పేజీ తెరిచిన ప్రతిసారి
ఒక సాయింత్రం నాలో వికసిస్తుంది

ఆమె నవ్వు
గది మూలలో వెలుగుతుంది.

ఆమె వేళ్ల వెచ్చదనం
ఆమె జుట్టు పరిమళం
ఆమె కళ్ల మాటలు
ఒక్కొక్కటిగా
ఆ పేజీల మధ్యనుండి
బయటకు వస్తుంటాయి.

కాలం
మనుషులను మాత్రమే తీసుకెళ్తుంది.
వాళ్లు తాకిన వస్తువుల్లో
వాళ్ల ఋతువులను
మరిచిపోతుంది.

అందుకే
కొన్ని పాత వస్తువులు
మనలో ఎప్పుడో
నిశ్శబ్దమైపోయిన
ఒక వసంతాన్ని
మళ్ళీ పూయిస్తాయి.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment