కొన్ని జంతర్ మంతర్ రీల్స్ చూసినప్పుడు యువత ఇప్పటికైనా కళ్లు తెరుస్తోందనే ఆశ కలిగింది. గర్వం వేసింది. అక్కడ అవమానాలు, దాడులు భరిస్తున్న ప్రతి మనిషి బాధ కలచివేస్తోంది. హింస ఎప్పుడూ వాదనకు ప్రత్యామ్నాయం కాదు.
అదేసమయంలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న పెయిడ్ విద్వేష కామెంట్లు చూస్తున్న ప్రతిసారీ, ఈ దేశంలో ఎంత లోతైన విషప్రచారం జరుగుతోందో అర్థమవుతోంది. దుఃఖం కలుగుతోంది.
తమ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం విదేశీ ఆర్య పండితులు ఈ దేశప్రజలమధ్య విద్వేషాలు నూరిపోసారు. మతం మత్తులో ఉంచారు. సామాజిక చైతన్యాన్ని తీవ్రంగా దెబ్బతీశారు.
చరిత్రను వక్రీకరించడం, ప్రజల మధ్య అనుమానాలు పెంచడం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం—ఇవి గర్వకారణాలు కావు. ఈ విధ్వంసాన్ని చరిత్ర తప్పకుండా నమోదు చేస్తుంది.
సత్యాన్ని దాచవచ్చు; శాశ్వతంగా ఓడించలేరు.

No comments:
Post a Comment