.
1.
జీవితం
చెట్టుకొమ్మల్లో చిక్కుకొన్న
సాయింత్రపు గాలిపటం
2.
వాన చినుకుల్లో తడిచే
నల్లగేదెపై తెల్లకొంగ
3
మృత్యులోయకు నలగని దారిపై
భుజం తొక్కే ప్రయాణం
4.
బొగ్గులపై మాంసం ముక్కల్ని
పైకి క్రిందకీ కదపటం
5.
కబోది అంధకారంలోకి
కూలిపోయే వందల నల్లని కాకులు
6.
డ్రింకు సీసాలో చిక్కుకొన్న
మిణుగురుల దుఃఖ కాంతి
7.
కాలివేలు నోటిలో పెట్టుకొని
వటపత్రంపై శయనించే ఎలక్షన్లు
8.
శిథిలాలయంలో దుండగులు
చెక్కేసిన శాసన వాక్యాలు
9.
శవపేటికలో ఊపిరాడని
ఉక్కపోత
10.
జీవితం
తొలగించినా మరలా మరలా
పుట్టుకొచ్చే కాన్సర్ కణితి
.
బొల్లోజు బాబా
ఎన్ని నీచోపమానాలు!
ReplyDeleteకవిత్వం ఎలా ఉండకూడదూ అన్నది బాగా చూపారు.
thank you Syamaleeyam gaaru...:-)
Delete