Thursday, December 18, 2008
సంవత్సరీకాలు
నీవిక లేవన్న వాస్తవానికి
చెట్టుతొర్రలో పక్షిపిల్ల ఆర్తనాదంలా
హృదయం కీచుమంది.
మెతుకు వృధా, బతుకు వృధా అంటూ
తీతువు పిట్ట అరుచుకుంటూ సాగింది.
ఆ లోహ క్షణాల రంపపు కోతకు
నిలువెత్తు జీవన వృక్షమూ
కన్నీరు చిమ్ముకుంటూ నేలకొరిగింది.
కాలం ఎంత చిత్రమైనది!
నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.
కలలూ, కన్నీళ్లు
ధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!
బొల్లోజు బాబా
Labels:
కవితలు,
కవిత్వం,
నాస్టాల్జియా,
సాహిత్యం
Subscribe to:
Post Comments (Atom)
బాబాగారూ
ReplyDeleteమొదటి మూడుముక్కలూ క్లుప్తంగా బాధని తెలియజేస్తున్నై. బావుంది.
"కాలం ఎంత చిత్రమైనది! నీవులేవన్న వాస్తవం ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది." మరపు గురించి ఎంత బాగా చెప్పారు!
"ధరలూ దరిద్రాల"వంటి దినసరి వెచ్చాల్ని "ఖర్చు చేసుకుంటూ"?
రాఘవగారికి
ReplyDeleteఈ కవితపై మీ స్పందనను తెలియచేసినందుకు ధన్యవాదములండీ
దినసరి వెచ్చాలు అన్న పదం ద్వారా రోజు వారీ ఆలోచనలు అనే భావాన్ని సూచించదలచుకొన్నానండీ.
బొల్లోజు బాబా
Heart touching andi.... naa tammudu gurtuki vachaadu.... I'm missing him so much, but don't find words to express that feeling... kallu chemmagillaayi, nijamgaa
ReplyDeleteనిజమే అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ్రతుకు బండి లాగడానికి. ఇంకా ఎన్నో చేస్తాం,పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి అంటగట్టాలనే మన ప్రయాస.
ReplyDeleteచాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో ఇంక రామని నను వదిలివెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది. చదివే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు.
ఊహలన్ని నిజాలై నా ముందు కనిపించావు,
ReplyDeleteమెలుకువ వచ్చి చూసే సరికి స్వప్నమై కనుమరిగినావు,
జ్ఞాపకాలు వదలనంటే, కన్నీరు మాత్రం వదిలివెళ్ళిపోతున్నానంటుంది.
బావుంది..
"కాలం ఎంత చిత్రమైనది! నీవులేవన్న వాస్తవం
ReplyDeleteఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది."
ఈ అభివ్యక్తి అద్భుతం! ఈ వాక్యాలు కవిత చివరనుంటే ఇంకా బావుంటుందేమో.
>>కాలం ఎంత చిత్రమైనది!
ReplyDeleteనీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.
nijame.. time heals everything!!
"నీవు లేవన్న వాస్తవం ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది"
ReplyDeleteభిన్నంగా ఏదైనా వ్యాఖ్య వ్రాద్దామంటే పదాలే అదృశ్యమైపోయాండి....
Simply Superb.....
కలలూ, కన్నీళ్లు
ReplyDeleteధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!
ఎంత వద్దనుకున్నా కొన్ని మీ కవితలు చదవగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి చాలా బాగా రాస్తున్నారు అండి
chaala bhavagarbha maina kavita vrasaru.
ReplyDeletechala bagundi. Especially the last but one stanga is excellent.
బాబా గారు చాలా బాగుంది.
ReplyDeleteదినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ ఎంతదూరం .... చాలా బాగా చెప్పారు. అభినందనలు.
బాబా గారూ దార్ల గారి బ్లాగు లోంచి లంకె ద్వారా కవితలు బ్లాగ్స్పాట్ లోకి వచ్చానని కామెంటు పెట్టారు కదా.ఆ కవితలు దాచుకున్నది నేనే[snehamaa].అప్పట్లో అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ గా,ఓపికగా చేసేదానిని.ఈ మధ్య బద్దకం తోపాటూ ఒకలాంటి నిరాశక్తత వచ్చేసిందండి.మీకేమన్నా ఆ బ్లాగు నడపాలని,మరిన్ని మంచి కవితలు అక్కడపెట్టాలని అనిపిస్తే నాకో జాబు రాయండి.అధికారాలు మీ సొంతం చేసెస్తాను :)
ReplyDelete>>కలలూ, కన్నీళ్లు
ReplyDeleteధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!
ఇలాంటివి రాయడంలో మీకు మీరే సాటి. Superb.
namastey sir made samalkot nenu mee help to telugu blog erne kavalanukumtunna sahayapadagalara na mail id saroja62@gmail.com
ReplyDelete