Friday, December 5, 2008
ప్రవాసి కలలు
చీకటి పడింది
పగటి వేషం తీసేసి
సుగంధ స్వప్నాల లోతుల్లోకి
నిశ్శబ్ధంగా జారిపోయాను.
కొబ్బరి పుల్ల తో కత్తి యుద్దం చేస్తుండగా
చెడ్డీ జారిన తమ్ముణ్ణి చూస్తూ
" షేమ్ షేమ్ పప్పీ షేమ్" అంటూ
పువ్వులా నవ్వుతుంది పాపాయి.
ఆ నవ్వుల పరిమళంలో తడుస్తూ
నువ్వూ నేనూ.
చెడ్డి పైకి లాక్కొని
కాంతారావు కాస్తా రాజనాలగా మారిపోయాడు.
మనిద్దరి చుట్టూ వాళ్లిద్దరూ
గిర.. గిర.. గిర.. గిర...
పూర్వానుభవాల్ని స్వప్నాల్లో
చూసుకొంటోంది హృదయం
వసంతార్భాటాల్ని విత్తనాల్లో
దాచుకొన్న వనంలా.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
chAlA bAgundi bAbA gAru.Very nice
ReplyDeleteపగటీ వేషం .. హ హ హ
ReplyDeleteబాగుంది.
బాగుంది.very nice.
ReplyDeleteవిత్తనాల్లో వసంతార్భాటమా.. భలే వూహ. బావుంది..!!
ReplyDeleteఅద్భుతం. ఇంత మంచి కవిత్వాన్ని అంతర్జాలానికి పరిమితం చెయ్యకండి.
ReplyDeleteబాబా గారు చాలా చాలా బాగుంది. ఐనా మీరు పురానుభవాల్ని పగటి వేషమని తుడిచారుగా ? మరది పూర్వానుభావమేమో ? ముద్రారాక్షసం అనుకుంటాను. రాక్షస సంహారం చెయ్యండి.
ReplyDeletebaaba gaaru,
ReplyDeletekavitha chaala bagundi.Especially the last stanja is superb.
క్రాంతి గారికి
ReplyDeleteధన్యవాదములండీ
కొత్తపాళీ గారికి
గురువుగారూ అంతే కదు సారూ?
నరసింహ గారికి
థాంక్సండీ
సత్యప్రసాద్ గారూ
ఆ వాక్యం నాకు కూడా బాగా నచ్చిన వాక్యం అండీ.
థాంక్సండి
రాధిక గారు
థాంక్సండీ. అంతే నంటారా?
ఆత్ర్రేయ గారు
థాంక్సండీ. మీరన్నది సరి చేసానండి. సూచించినందుకు ధన్యవాదములండీ.
సాయిసాహితి గారికి
థాంక్సండి.
కవిత మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండి.
బొల్లోజు బాబా
sir its very nice last 4 lines are have nice feel
ReplyDeleteపూర్వానుభవాల్ని స్వప్నాల్లో
ReplyDeleteచూసుకొంటోంది హృదయం
వసంతార్భాటాల్ని విత్తనాల్లో
దాచుకొన్న వనంలా.
వ్యక్తీకరించిన తీరు అద్భుతం బాబా గారూ!