1. స్వేచ్ఛ
చీకటి గదిలో కూర్చొని
సీసాలో బంధించిన
మిణుగురులను చూస్తూ
మురిసిపోతుంది మా అమ్మాయి.
ఆరు బయటకు వచ్చి
సీసా మూత తీసాను.
ఆకాశం సీసా నిండా మిణుగురులే!
చిన్నారి కళ్లల్లో వెన్నెల మెరుపు.
2. వెన్నెల సీమ
కొబ్బరాకుల వెనుక
నిశ్శబ్ధ చంద్రోదయం.
వెన్నెల చక్కిలి గిలికి
రాలిన కొబ్బరి పూత.
బొల్లోజు బాబా
చీకటి గదిలో కూర్చొని
సీసాలో బంధించిన
మిణుగురులను చూస్తూ
మురిసిపోతుంది మా అమ్మాయి.
ఆరు బయటకు వచ్చి
సీసా మూత తీసాను.
ఆకాశం సీసా నిండా మిణుగురులే!
చిన్నారి కళ్లల్లో వెన్నెల మెరుపు.
2. వెన్నెల సీమ
కొబ్బరాకుల వెనుక
నిశ్శబ్ధ చంద్రోదయం.
వెన్నెల చక్కిలి గిలికి
రాలిన కొబ్బరి పూత.
బొల్లోజు బాబా
మొదటి కవితలోని లోతు నాకు తెలియలేదు.కానీ యధాతధం గా అర్ధమయింది మాత్రం చాలా బాగుంది."వెన్నెల చక్కిలి గిలికి
ReplyDeleteరాలిన కొబ్బరి పూత" బావుంది.
బాగున్నాయి మీ కవితా గుళికలు. పూతలా తేలికగా ఉన్నా, బోండామంత మర్మం ఉంది. అభినందనలు.
ReplyDeleteబాగున్నాయి
ReplyDeleteచాలా బాగుంది :)
ReplyDeleteవెన్నెల చక్కెలగిలి - చక్కటి పదపయోగం బాబాగారూ
ReplyDeleteబావుందండీ..
ReplyDeleteఎప్పటిలానే బావున్నాయి.
ReplyDeleteచిన్న చిన్న పదాలతో కూడా లోతైన భావాన్ని స్పృశించగలరు, సృష్టించగలరు మీరు.
రాధికగారికి
ReplyDelete1.సీసాలోని మిణ్గురులు, ఆకాసపు సీసాలోని మిణుగురులంటే నక్షత్రాలు అని ఒక చిన్న పోలిక.
2. బంధించటం కంటే స్వేచ్చనివ్వటంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. (కళ్లల్లో వెన్నెల మెరుపు)
ఎక్కువ సౌందర్యం వెల్లి విరుస్తుంది. (ఆకాశం సీసా నిండా మిణుగురులే!)
మీకు అర్ధం కావటమేమీ కాదు. ఉత్తినే సరదాకు అడిగి ఉంటారు.
మీ సేకరణ బ్లాగు చూస్తున్నానండీ. చాలా గొప్ప కలక్షను. దత్తత తీసుకోవటానికి భయంగా ఉంది చేయగలనా అని.
ఆత్రేయగారు, థాంక్సండి.
వేణుగారూ,
నేస్తం గారు,
లలిత గారు
ప్రతాప్ గారు, థాంక్సండీ.
ప్రత్యేకంగా చెప్పాలా!!! అదరహో! అంతే.
ReplyDelete౧ చీకటి (బంధనం), వెన్నెల (స్వేచ్ఛ) రెండిటినీ చక్కగా చిత్రీకరించారు. "చిన్నారి" పదం కల్మషరాహిత్యానికి చక్కగా అద్దంపడుతోంది.
ReplyDelete౨ కొబ్బరికి వెన్నెలకీ మైత్రి :)
బాబా గారు మీరు చెప్పిన అర్ధం చూశాక
ReplyDeleteఅది నేననుకున్న అర్ధం కాదని అర్ధమయ్యింది
ఇది నేననుకున్న అర్ధం
గదిలో బధింపబడ్డ ( మూసిన గదిలో కూర్చున్న )
పాపకి, అద్దాల కిటికీలోనించి ( తనే ఒక సీసాలో ఉన్నట్టు)
కనిపించిన ముణుగురులు ( కిటికీ కాబట్టి కొన్నే నక్షత్రాలు కనిపించాయి. పక్కనే ఉన్న చంద్రుడు కనపడలేదు - ఆమె ఆనందం అంతవరికే పరిమితమయ్యింది - అవకాశములేక )
మీరు ఆరుబయటకు వచ్చి ( మీరు ఆలోచనా స్వేచ్చని ఆహ్వానించారు)
సీసా మూత తీసి (పాపను లిబరేటు చేశారు)
ఇప్పుడు ఆకాశము నిండా తారలే, చంద్రుని తోడుగ- మిణుగురులే
అందుకే పాప కళ్ళల్లో వెన్నెల మెరుపులు - అన్నందం.
ఇక్కడ
పాప - మనలోని తృష్ణ
అద్దాల గది - సంకుచిత తత్వం
తారలు - అవకాశాలు
వెన్నెల- వాటిని అందుకున్న ఆనందం
ఇంత తత్వం - అంతా - యాద్రుచ్చికమా ?
ఆత్రేయ గారు
ReplyDeleteహాట్సాఫ్ సర్.
ఒక పక్క ఆనందంగానూ, మరోపక్క సిగ్గు గానూ ఉంది నాకు :-+
థాంక్యూ.
అయ్యో ఎంత మాట బాబా గారు. నేను మరో కోణం లో చూశాను అంతే.
ReplyDeleteఇన్ని అర్ధాల్ని ఇచ్చిన మీకవితను చూసి గర్వ పడాలిగాని సిగ్గేమెటండీ !
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా శుభం చేకూరాలని కోరుకుంటూ...
ReplyDeleteస్వేచ్ఛ- అందంగా ఉంది. అమ్మాయి కళ్లల్లో మెఱుపు నా కళ్లలో ప్రతిఫలించింది.
ReplyDeleteవెన్నెల సీమ- అద్భుతంగా ఉంది.వెన్నెల చక్కిలిగిలి మధురోహల్ని సృష్టించింది.