లేగ దూడ
కట్రాట గుంజుకు పోయింది.
దాచేసుకొన్న పాలను
చేపుతోంది ఆవు.
దూడ మెడలో గంట
దొంగలిద్దరినీ పట్టించేసింది.
మట్టుపైని అణుగుకోడి
ముక్కుతో గుడ్లను మరోసారి
లెక్కెట్టుకొని, దగ్గరకు లాక్కొంది.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
telugu kavithalu
Beautiful
ReplyDeleteardam kaaledu baaaba garu.koncham vivarincha galara
ReplyDeleteమీరింత సింపుల్ గా రాయడం ఇదే మొదటిసారేమో... ? కవిత చాలా బావుంది..!
ReplyDeleteస్పందించిన అందరకూ ధన్యవాదములు
ReplyDeleteక్రాంతికుమార్ గారు
ఈ కవితలో ఒక గ్రామీణ నేపద్యంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు వర్ణించానండి.
కొన్ని దొంగ ఆవులు సాధారణంగా పాలను దూడ తాగుతున్నంత సేపూ దానికివ్వటానికై చేపుతాయి, ( చేపు: the udder gets filled with milk)దూడను తొలగించి రైతు పితకటం మొదలు పెట్టగానే ఎగచేపుతాయి(పొదుగులోకి వచ్చిన పాలను పైకి లాగేసుకొంటాయి).
అలా చేసిన ఒక దొంగ ఆవు వద్ద పాలను తాగటానికై ఒక లేగదూడ కట్రాట తెంపుకొని తల్లి వద్దకు వెళ్ళింది. దూడ మెడలోని గంట మోగి దొంగలిద్ద్దరినీ పట్టించి వేసింది.
అంతటితో ఒక హైకూ లా కవిత ఆగిపోవచ్చు కానీ అది చదివిన మా ఆవిడ ఇదేం కవిత, ఇది మామూలుగా జరిగే విషయమే కదా అని ఓ పోటు ......
కొనసాగింపుగా రెండవ చరణం
ఈ తతంగం అంతా చూస్తున్న ఒక అణుగు కోడికి (brooding hen) అనుమానం వచ్చింది. తనగుడ్లను కూడా రైతు మాయం చేసేసాడేమోనని. అందుకనే అది ఒకసారి గుడ్లను లెక్కెట్టుకొని, దగ్గరకు లాక్కొంది. దాని అనుమానం కాకపోతే రైతెప్పుడు మట్టులోని (cletch) గుడ్ల జోలికి రాడన్న విషయం తెలియదు కదా ఆపిచ్చి అనుమానప్పక్షికి.
thankyou kothapaalee gaaru and bhagavaan gaaru
bollOju baabaa
నేను దొంగ ఆవులన్న పదం రైతు పాయిట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే సుమా. పాపం అది పిల్లకోసమై ఆపని చేస్తుంది.
ReplyDeleteబొల్లోజు బాబా
బాబా గారు చాలా బాగుంది.
ReplyDeleteభగవాన్ గారన్నట్లు మీరింత సింపుల్ గా రాయడం ఇదే చూస్తున్నాను, చాలా బాగుంది.
ReplyDelete