మిత్రమా
నిన్నెందుకలా సంబోధిస్తున్నానో కూడా
నాకు తెలియటం లేదు.
నిన్నటివరకూ నీగురించి తెలియదు
నిన్నెప్పుడూ చూడలేదు
అయినప్పటికీ.....
నా ఆత్మీయ మిత్రమా
ఎందుకు ఉదయంనుంచీ
పదే పదే గుర్తుకు వస్తున్నావు?
ఎందుకు నీకై
హృదయం మౌనంగా రోదిస్తుంది?
కనురెప్పల మాటున
పలుచని నీటి పొరపై ఎన్నో దృశ్యాలు
లుక లుక లాడుతున్నాయి.
నీలం షర్టులో నీవు
హెల్మెట్ ధరిస్తూ, జాకెట్ సరిచేసుకొంటూ
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ
ఎవరికో దిశా నిర్ధేశం చేస్తూన్న
దృశ్యాలు పదే పదే
కుత కుత లాడుతున్నాయి.
నిన్నటి దాకా
అగ్ని వర్షం కురిపించిన
నీ కనులు తృప్తి నిండిన
నిశ్శబ్ధాన్ని ధరించాయి.
వదరుబోతు మృత్యువు
ఎదురుచూడని నిబ్బరమది.
ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా?
నువ్వు మాత్రం మరొక శవం కాదు
ఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది.
(ముంబాయి టెర్రరిస్టు దాడులలో చనిపోయిన, నిజాయతీ పరుడైన ఏ.టి.ఎస్. అధికారి శ్రీ హేమంత్ కార్కర్ మరియు ఇతర సిబ్బంది ఆత్మ శాంతికి )
Subscribe to:
Post Comments (Atom)
చాలా గొప్పగా అర్పించిన నివాళి
ReplyDeleteచాలా గొప్పగా అర్పించిన నివాళి.
ReplyDelete"ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా" .....good que sir
బాబా గారు, హేమంత్, విజయ్, అశోక్ ల మృతి ఆవేదనను మిగిల్చింది. మీరన్నట్టు,
ReplyDelete"నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది ".
ఇంకా కాల్పులలో మృతి చెందిన జవాన్లకు కూడా నివాళి అర్పిద్దాం.
నిజమే వారు మనకేమీకాకపొఇనా..............
ReplyDeleteపదేపదే గుర్తొస్తున్నారు .టి.వి. లో ఆయన ఫైరింగ్ కి సిద్దమవుతున్న క్లిప్పింగ్స్, చూసి ఆ వెంటనే ఆయన ఇకలేరన్న నిజం చూస్తుంటే ఎంతోబాధ గా వుంది
బొంబాయి సంఘటన చాలా దురదృష్టకరం.. మంచి అధికారులను కోల్పోయాం.. మేం మౌనంగా వున్నా మీరు బాగాస్పందించారు... !
ReplyDelete>>నువ్వు మాత్రం మరొక శవం కాదు
ReplyDeleteఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది
చాలా కరెక్ట్...
ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులందరికీ, నివాళి...
ReplyDeleteచాలా బాగా రాశారు బాబా గారు.
ReplyDeleteబాబా గారు,
ReplyDeleteనిజం !
ఆయన భౌతిక శరీరం కేవలం శవం కాదు.
జాతికి ఆయన కలిగించిన పోరాట స్ఫూర్తి చిరకాలం నిలవాలని కోరుకుంటున్నాను.
ఆయన బలిదానం గుండెల్లో రగిల్చిన ఆవేదన అంత ఇంత అని చెప్పలేనిది
భరించలేని విషాదం, ఆవేదన. బాబా గారు, ఈ అశ్రునివాళికి నా తరపున ఓ కన్నీటి చుక్క.
ReplyDelete(తీవ్ర వాదుల దాడుల్లో మరణించిన సందీప్ ఉన్ని కృష్ణన్ కు నిరుడు పెళ్ళయిందట).
స్పందన ద్వారా వారి ఏకీభావాన్ని తెలియచేసిన అందరికీ ధన్యవాదములు
ReplyDelete