Monday, November 10, 2008

ఈ కవితకు పేరు సూచించండి.

విరగకాచినవెన్నెల్లో
మరొక్కపొగడపువ్వు కూడా
పట్టేట్టు లేదు.

రాత్రయితే చాలు
ఋతువు తప్పని
వలసపక్షుల్లా
నీ జ్ఞాపకాలు
హృదయంపై వాలతాయి.

హృదయతరువుపై
మరొక్కవసంతం కూడా
పట్టేట్టు లేదు.


చుంబనంలో
మోహావేశంలో
మూసుకొన్న
కన్నియనయనాల్లా
హృదయం తీయగా
వణుకుతుంది.

పొగడ పూల పరిమళంలో
వెన్నెల జలకాలాడుతూంది.బొల్లోజు బాబా

25 comments:

 1. పొగడ పూల పరిమళం

  ReplyDelete
 2. ఏమోనండీ నేను ఇంకా కవితలోనే వుండిపోయాను.నిషి చెప్పింది బాగుందనిపిస్తుంది.

  ReplyDelete
 3. ఆ తన్మయత్వం లో నుండి బయటకిరావడానికి నాకు చాలాసేపు పట్టింది... అలాంటి క్షణాల్లో పొందే అనుభూతి జీవత కాలపు "bliss" కదా..


  "ప్రేమ కైవల్యం"

  ReplyDelete
 4. శరదృతువుని -- వెన్నెల గూర్చి చెప్పి
  శిశిరాన్నీ --- వలస
  వసంతాన్నీ -- వసంతం
  గ్రీష్మాన్నీ -- చెలియ చుంబనం
  వర్షఋతువునీ -- జలకాలాట

  ఇదే వరసలో స్పృసించారు.. అది యాదృచ్చికమా ?

  కవితకు పేరు చెప్పేటంత సాహసం చేయలేను
  అందుకు మీరే తగును.

  ReplyDelete
 5. బాబా గారూ,
  మీ అందరిలా మేధాసంపత్తి లేకున్నా నాకెందుకో "ఋతురాగం" అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది.సరికాదు అనిపిస్తే క్షమించగలరు.

  http://srushti-myownworld.blogspot.com/

  ReplyDelete
 6. కవిత చాలా బాగుంది బాబా గారు.

  ReplyDelete
 7. కొనసాగింపుగా ,క్షమార్ధనలతో

  "జలకాలాటల అలసిన వెన్నెల ,
  వాలిన వృక్షపు నీడలో,
  పరిమళ సుమాలపై పవళించేను"


  కవిత పేరు "కేవలమానందం "

  ReplyDelete
 8. కామేశ్వర రావు గారు సూచించిన పేరు బాగుంది.
  "నువ్వు- నేను-వెన్నెల" .. ఎలా వుంది?

  ReplyDelete
 9. కవిత చాలా బాగుంది బాబా గారు. నాకు పెద్దగా పద్యాల గురించి తెలియదు ఐనా మీ కవితకి సాహసించి పేరు రాస్తున్నాను,":ప్రేమ ఋతువు" అని నా సూచన.

  ReplyDelete
 10. I'm too late.
  అందరూ వారి వారి అభిప్రాయాలు, పేర్లు చెప్పేశారు. అదేమిటో అన్నీ బానే ఉన్నాయి. నాకే పేరుతట్టడంలేదు.

  ReplyDelete
 11. కవిత చాలా బాగుంది.

  మొదటి పంక్తిలో..
  "విరగకాచినవెన్నెల్లో
  మరొక్కపొగడపువ్వు కూడా
  పట్టేట్టు లేదు."

  మరి చివరిది...
  "పొగడ పూల పరిమళంలో
  వెన్నెల జలకాలాడుతూంది."

  ఏమిటో ఇక్కడ పొగడ పులు, వెన్నెల విరహంతో సఖి/సఖుని తలపుల కౌగిలిలో బిగుసుకుపోయి బయటపడలేనట్టుగా ఉన్నారేమో... మధ్య 3 పంక్తులు వారి తలపులేమో అనిపించాయి నాకు. దూరంగా ఉన్నా , ఇద్దరూ అనుభవించేది విరహమే... దూరమైనప్పుడు దగ్గరచేసేది అదే. ఇక అప్పుడు కస్త ఏకాంతం దొరికితే '(పర)వశమే...'

  ReplyDelete
 12. ప్రతాప్ తమ్ముడూ
  చాలా సందర్భాలలో నా హృదయాన్ని చదివినట్లు మీ వాఖ్యలుంటాయి. చాలా చాలా కరక్ట్. అన్నీ బాగానే ఉన్నాయి కదూ?

  నిషిగంధగారు,
  మొదటగా స్పందించి మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదములు.
  నరసింహ గారు
  మీరు సూచించిన పేరు పరిమళిస్తుంది.

  రాధికగారూ
  నేను కూడా కవితలోనే ఉండిపోయి ఏ పేరు పెట్టాలో తెలియక ఆ భారాన్ని మనమిత్రులపైకి తోసేసాను. :-)

  క్రిష్ణారావుగారు
  హాపీ నైట్స్ పేరు హేపీగా ఉందండి. ఇప్పుడు బ్లాగులోకంలో సీక్వెల్ సీజనటకదండీ బహుసా అప్పుడు నేను హేపీడేస్ కవిత వ్రాయవలసిఉంటుందేమో :-)

  దిలీప్ గారు
  థాంక్యూ. ప్రేమ కైవల్యం బాగుందండీ.

  కామేశ్వరరావుగారు
  మీరు సూచించిన పేరులో కవితాత్మ ఒదిగిపోయేలా ఉదండీ.

  ఆత్రేయగారు
  కవితలను మీరు చూసే కోణమే వేరని నిరూపించారు. మీ పరిశీలన నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అవునా అనిపించింది. అలా అమరటం యాదృచ్చికమే తప్ప నా ప్రతిభకాదని గమనించగలరు.
  హృదయతరువుపై
  మరొక్కవసంతం కూడా
  పట్టేట్టు లేదు.
  అన్న వాక్యాన్ని మొదట
  హృదయతరువుపై
  మరొక్క పక్షి కూడా
  పట్టేట్టు లేదు.
  అని వ్రాసి, లయెక్కడో తప్పినట్లనిపించి ఇలా మార్చాను. బహుసా పక్షి అని వ్రాసినట్లయితే ఈ యాదృచ్చిక ఋతువులు వచ్చేవి కావేమో.
  థాంక్యూ సర్.

  క్రాంతి గారు
  మీరు సూచించిన పేరు ఋతురాగం ఆత్రేయ గారు పరిశీలన ప్రకారం చక్కగా అమరిపోతుందండీ. థాంక్యూ

  విజయమోహన్ గారు
  థాంక్సండీ.
  మీరు సూచించిన నిశి శశి పేరు బాగుందండీ

  చైతన్య గారు
  థాంక్సండీ.

  శ్రీకాంత్ గారు
  కొనసాగించినందుకు క్షమార్ధనలెందుకండీ. మీ విలువైన సమయాన్ని ఈ కవితపై వెచ్చించి, మీ భావాలను పంచుకోవటానికి నా బ్లాగును వేదికగా చేసుకొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
  you are always free to pen your views. thankyou

  మీ కొనసాగింపు చాలా చాలా బాగుంది.

  సుజాత గారు
  థాంక్సండీ. బాగుందండి.

  వేద గారికి
  సాహసం అనుకోకండి సరదా మాత్రమే.
  ప్రేమ ఋతువు పేరు బాగుందండీ.

  మోహన గారు
  hope you got the thread.
  you wanted to say something and kept mum. why i dont know sir.
  ok i will continue it sir.

  ఈ కవితలో రెండు అంశాలను పేనుకుంటూ వ్రాయాలని ప్రయత్నించాను.

  వెన్నెల + పొగడపూలు
  హృదయం + ప్రియుని/ప్రియురాలి జ్ఞాపకాలు

  వెన్నెల విరగ కాసింది దానిలో ఇక మరొక్క పొగడపూవు కూడా పట్టనంతగా ఉంది.

  హృదయం లో ప్రియుని/ప్రియురాలి జ్ఞాపకాలు, మరేవిధమైన ఆలోచనలకూ తావులేకుండా ఆక్రమించేసాయి.

  ఆ జ్ఞాపకాలకు హృదయం తీయగా మూలుగుతుంది.
  వెన్నెలకూడా పరిమళాల లో ఈతలు కొడుతుంది.

  ఇంకొంచెం క్లారిటీ వచ్చేలా వ్రాసుండాల్సింది అనిపించింది.
  కవిత అర్ధాన్ని కవి చెప్పటం నాదృష్టిలో :-|
  స్పందించినందుకు ధన్యవాదములండీ.

  ఈ కవిత పేరేమిపెట్టాలో తెలియక, అనుకొన్నవి నచ్చక, కొంచెం సరదాగా ఉంటుందని మిత్రులను కోరాను, నా విన్నపాన్ని మన్నించి నేనెంచుకోలేనన్ని మంచి మంచి ఆప్షన్లను ఇచ్చిన బ్లాగ్మిత్రులుకందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

  సూచించిన అన్నిపేరు ఫస్టుగా ఉన్నాయి కనుక ఏఒక్కదానిని తీసుకొన్నా మిగిలిన వాటికి అన్యాయం జరుగుతుందన్న భావనతో ఈ కవిత పేరు ఈ విధంగా పెడుతున్నాను. :-)
  మధురోహలు/పొగడ పూల పరిమళం/HAPPY NIGHTS/ప్రేమ కైవల్యం/రాత్రి పూచిన చెట్టు/ఋతురాగం/నిశి -శశి/కేవలమానందం/నువ్వు- నేను-వెన్నెల/ప్రేమ ఋతువు

  అంతపెద్ద పేరుంటుందా అని అడగొద్దు. it has been possible with all your love and affection.
  thankyou one and all

  bollojubaba

  ReplyDelete
 13. మీరు పేరు పేరు న అందరికీ సమాధానం ఇవ్వటం బాగుంది.
  అనుకోగానే, అనుకున్న అంశం మీద కవిత రాయగలగటం మీ వద్ద నేర్చుకోవాలి. మీ స్థాయిని నేను అందుకోలేక పోయాను. మీరు వివరించాక, చాలా బాగా రాశారు అనిపించింది. "ఇంకొంచెం క్లారిటీ వచ్చేలా వ్రాసుండాల్సింది అనిపించింది." అన్నారు. నాకు కూడా, కానీ ఎలాగో నాకు తెలియదు కనక తెలియక మిన్న కున్నాను. మీ సిన్సియారిటీ అభినందనీయము.

  ReplyDelete
 14. ఆత్రేయగారు
  థాంక్సండి.
  శ్రీలేఖ గారు
  తలపుల ఊయల బాగుందండీ
  స్వాతీ శ్రీపాద గారు
  థాంక్సండి.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 15. ఈ మధ్య చదివిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత ఇది. మీకు మల్లే నేను కూడా కవిత నుండి తేరుకోలేకపోయాను. ఇంత మంచి తలపు ఎలా తట్టిందండి మీకు. btw I belong to pithapuram. I may come next month, is it possible to have a meet sir?

  ReplyDelete
 16. ఈ మధ్య చదివిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత ఇది. మీకు మల్లే నేను కూడా కవిత నుండి తేరుకోలేకపోయాను. ఇంత మంచి తలపు ఎలా తట్టిందండి మీకు.

  ReplyDelete
 17. This comment has been removed by the author.

  ReplyDelete
 18. కవిత చాలా బాగుందండి.......ఏవో నాలుగు పేర్లు వ్రాసి మీ కవితకు నేను పేరు పెట్టేటంతటి దాన్నా అని......delete చేసి, remove చేసి, చివరికి చిరు comment చేస్తున్నాను.

  ReplyDelete
 19. క్రిష్ణ గారికి
  థాంక్సండీ.
  పద్మార్పిత గారు
  మీ ఐడి పైన మౌస్ ని హోవర్ చేస్తుంటే దేవరపల్లి రాజెంద్ర గారి ఐడి చూపిస్తుందేమి?
  ఈ కవితకు పేరు పెట్టేసానండీ చూడలేదా :-)
  థాంక్సండీ

  ReplyDelete